వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోహియాకు ద్రోహం చేయడమే : కాంగ్రెస్‌తో ఆర్జేడీ జట్టుకట్టడంపై మోదీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : మండుటెండలో ఎన్నికల హీట్ పీక్ స్టేజీకి చేరిపోయింది. ప్రజలను ఆకట్టుకునేందుకు నేతలు పడరాని పాట్లు పడుతున్నారు. ఎన్నికల వేళ .. ఎత్తుకి పై ఎత్తు కొనసాగుతోండగా ... దేశంలో విభిన్న ప్రాంతీయ పార్టీలు ఒక్కటై బరిలోకి దిగుతున్నాయి. దీంతో ప్రధాని నరేంద్రమోదీ ఆ పార్టీల మూల సిద్ధాంతాన్ని గుర్తుచేశారు.

కాంగ్రెస్‌తో జట్టు లోహియాకు ద్రోహమే
ప్రముఖ సామాజికవేత్త, దేశంలో యాంటీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేందుకు క‌ృషిచేసిన రాం మనోహర్ లోహియాకు ఆయన వారసులమని చెప్పుకునే నేతలు ద్రోహం చేస్తున్నారని మోదీ ధ్వజమెత్తారు. శనివారం లోహియ జయంతి సందర్భంగా బీహార్ లో లాలు ప్రసాద్ యాదవ్ ఆర్జెడీ, శరద్ యాదవ్ కాంగ్రెస్ తో కలిసి పోటీచేస్తామని ప్రకటించిన సందర్భంగా .. మోదీ వారిపై నిప్పులు చెరిగారు.

Joining with Cong, Socialist parties betray Lohia: Modi

కర్ణాటకలో భాగస్వామ్యం
వీటితోపాటు కర్ణాటకలో జేడీఎస్ కాంగ్రెస్ పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మోదీ దుయ్యబట్టారు. మరోవైపు యూపీలో ఎస్పీ, బీఎస్పీ ఒక్కటై పోటీచేయడం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు.

లోహియా, వాజ్ పేయి ఆదర్శం
రాం మనోహర్ లోహియా ప్రజాభిష్టం మేరకు ప్రజాస్వామ్యయుతంగా నడుచుకునేవారని గుర్తుచేశారు. కాంగ్రెస్ వ్యతిరేకంగా పనిచేసి, ఆయా పార్టీలను ముందుకు నడిపించారని తెలిపారు. తర్వాత వాజ్ పేయి కూడా ప్రజాస్వామ్య విలువలను పునరుద్ధరించేందుకు పాటుపడ్డారని కొనియాడారు. వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో విలువలకు ప్రాధాన్యం ఇచ్చి ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వం పడిపోయిన సందర్బాన్ని గుర్తుచేశారు మోదీ.

English summary
At a time when most of the socialist parties are fighting against BJP either in an alliance with Congress or are likely to support it in a post-poll scenario, Prime Minister Narendra Modi reminded them of the staunch “anti-Congressism” of acclaimed socialist leader Ram Manohar Lohia and his anathema to “dynastic politics”. The occasion was the birth anniversary of Lohia on Saturday, a day after when Lalu Prasad's RJD and Sharad Yadav in Bihar announced their seat sharing with Congres in the 1970s
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X