వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలుడిపై అత్యాచారం చేసిన రిపోర్టర్, దారి చూపించాలి: నడవలేని స్థితి, మణిపాల, పోస్కొ చట్టం !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: పాఠశాల విద్యాభ్యాసం చేస్తున్న బాలుడిపై అత్యాచారం చేసిన పాత్రికేయుడిని (రిపోర్టర్)ను కర్ణాటకలోని ఉడిపి జిల్లా కుందాపుర పోలీసులు అరెస్టు చేశారు. కామంధుడి లైంగిక దాడితో తీవ్ర అనారోగ్యానికి గురైన బాలుడికి ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నామని పోలీసులు తెలిపారు.

కుందాపుర తాలుకా హెమ్మాడి ప్రాంతంలో నివాసం ఉంటున్న పాత్రికేయుడు చంద్ర కే. హెమ్మాడి అనే కామాంధుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఓ కన్నడ దినపత్రికలో చంద్ర రిపోర్టర్ గా పని చేస్తున్నాడు. బైందూరు సమీపంలోని అటవి ప్రాంతంలో వార్తలు సేకరించి ఫోటోలు తియ్యాలని చంద్రకు పై సిబ్బంది సూచించారు.

Journalist booked under POCSO act by police in Kundapur near Udupi in Karnataka

అటవి ప్రాంతంలో దారి చూపించడానికి బాలుడిని పంపించాలని అతని తండ్రికి చెప్పాడు. తండ్రి అనుమతి ఇవ్వడంతో బాలుడు చంద్ర వెంట వెళ్లాడు. అటవి ప్రాంతంలోని నిర్జనప్రదేశంలో బాలుడి మీద చంద్ర అత్యాచారం చేశాడు. తరువాత ఈ విషయం ఎవ్వరికి చెప్పకూడదని బాలుడికి చెప్పి అతన్ని ఇంటి దగ్గర విడిచిపెట్టి వెళ్లిపోయాడు.

బాలుడి ఆరోగ్యంలో కొంత కాలంగా మార్పులు వచ్చాయి. నడవడానికి బాలుడికి ఏ మాత్రం సాధ్యంకాలేదు. కుటుంబ సభ్యులు బాలుడిని మణిపాల ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు బాలుడి మీద అత్యాచారం జరిగిందని చెప్పారు.

కుటుంబ సభ్యులు బాలుడిని గట్టిగా ప్రశ్నించగా కొంత కాలం క్రితం అటవి ప్రాంతంలో తన మీద చంద్ర అత్యాచారం చేశాడని అంగీకరించాడు. బాలుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోస్కొ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు రిపోర్టర్ చంద్రను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. బాలుడికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు.

English summary
Chandra K Hemmadi, journalist booked under POCSO act by police in Kundapur, Udupi, alleging sexual harassment on a boy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X