వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మైనింగ్ మాఫియా ఆగడం: జర్నలిస్ట్ సజీవదహనం

|
Google Oneindia TeluguNews

షాజహాన్ పూర్: మాఫియా ఆగడాలపై వార్తలు వ్రాసినందుకు ఒక జర్నలిస్ట్ ను సజీవదహనం చేసిన దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్ పూర్ లో జరిగింది. షాజహాన్ పూర్ లో నివాసం ఉంటున్న జితేంద్ర సింగ్ అనే జర్నలిస్ట్ హత్యకు గురైనాడు.

జితేంద్ర సింగ్ స్థానిక పత్రికలో జర్నలిస్ట్ గా పని చేస్తున్నాడు. ఇతను మైనింగ్ మాఫియా మీద వార్త కథనాలు వ్రాశాడు. తరువాత ఆ వార్తల క్లిప్పింగ్ లను ఫేస్ బుక్ లో ఫోస్ట్ చేశాడు. ఈ విషయం జీర్ణించుకొలేని మైనింగ్ మాఫియా జితేంద్ర సింగ్ ను అంతం చెయ్యాలని ప్లాన్ వేశారు.

Journalist burnt alive in Uttar Pradesh

చివరికి సోమవారం సాయంత్రం జితేంద్ర సింగ్ ను పట్టుకుని పెట్రోల్ పోసి నిప్పంటించారు. వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించాడని వైద్యులు నిర్దారించారు. తన భర్త మీద ఒక పోలీసు అధికారి పెట్రోల్ పోసి నిప్పంటించారని జితేంద్ర భార్య ఆరోపిస్తున్నారు.

సమాజ్ వాదీ పార్టీ శాసన సభ్యుడు రాంమూర్తి అక్రమ మైనింగ్ కార్యకలాపాలకు సహకరిస్తున్నాడని, అతనే జితేంద్ర సింగ్ ను హత్య చేయించాడని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద జితేంద్ర సింగ్ హత్య సంచలనం కలిగించింది.

English summary
A Journalist was allegedly burnt alive by police in Shahjahanpur district of Uttar Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X