వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: ఢిల్లీ మెట్రో స్టేషన్లో మహిళా జర్నలిస్టుకు లైంగిక వేధింపులు(వీడియో)

దేశ రాజధాని నగరంలో వరుసగా జరుగుతున్న ఘటనలు మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.

|
Google Oneindia TeluguNews

Recommended Video

మహిళా జర్నలిస్టుకు లైంగిక వేధింపులు(వీడియో) Video Viral

న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో వరుసగా జరుగుతున్న ఘటనలు మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. తాజాగా, అత్యంత రద్దీగా ఉంటే ఐటీఓ మెట్రో స్టేషన్‌లో ఓ మహిళా జర‍్నలిస్టును వేధింపులకు గురిచేసిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

నవంబర్‌ 13న ఢిల్లీలో మెట్రో స్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీ ఐటీవో మెట్రో స్టేషన్లో జర్నలిస్టు(25) ను ఓ దుండుగుడు వేధింపులకు గురిచేశాడు. కావాలని ఆమెను తాకి వేధించాడు. అయితే క్షణాల్లో అతగాడినుంచి తప్పించుకున్న ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితుడుని అరెస్ట్‌ చేశారు పోలీసులు.

బాధితురాలి ఫిర్యాదుమేరకు మెట్రోస్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఉద్దేశపూర్వంగా అనుచితంగా తాకడం.. బాధితురాలు ప్రతిఘటించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. దీని ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు అతగాడిని అదుపులోకి తీసుకున్నారు.

ముందు పొరపాటున తాకినట్టుగా తాను భావించాననీ, కానీ మళ్లీ అదేపనిచేయడంతో షాకయ్యానని జర్నలిస్టు చెప్పారు. కొన్నిసెకన్లలలో వెంటనే తేరుకున్నట్టు చెప్పారు. అయితే, అక్కడ సెక్యూరిటీ ఎవరూ లేరు. లేదంటే స్పాట్‌లోనే ఆ దుర్మార్గుడిని పోలీసులుకు అప్పగించేదాన్నని చెప్పారు. మహిళల రక్షణ కోసం మెరుగైన చర్యలు తీసుకోవాలని అన్నారు.

English summary
A 25-year-old Journalist was molested at ITO Metro station in Delhi on 13 November, early this week. Since the act was caught on CCTV, police were able to arrest the culprit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X