వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దారుణం : ముసుగేసుకొచ్చి మహిళా జర్నలిస్టుపై కాల్పులు

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : దేశ రాజధానిలో దారుణం జరిగింది. నోయిడాకు చెందిన మహిళా జర్నలిస్టుపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈస్ట్ ఢిల్లీలోని వసుంధర ఎన్‌క్లేవ్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాల్పుల ఘటనలో గాయాలపాలైన ఆమె ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.

కీచకులు : యువతిని నిర్బంధించి గ్యాంగ్ రేప్.. పది రోజుల పాటు ప్రత్యక్ష నరకం చూపిన కామాంధులు..కీచకులు : యువతిని నిర్బంధించి గ్యాంగ్ రేప్.. పది రోజుల పాటు ప్రత్యక్ష నరకం చూపిన కామాంధులు..

నోయిడాకు చెందిన మిథాలీ చందోలా శనివారం డ్యూటీ ముగించుకుని కారులో ఇంటికి బయలుదేరారు. అప్పుడు సమయం అర్థరాత్రి 12.30గంటలు దాటింది. ఆమె కారు డ్రైవ్ చేస్తుండగా.. మారుతి స్విఫ్ట్ కారు ఆమెను ఓవర్ టేక్ చేసింది. అందులోంచి దిగిన ముసుగు ధరించిన వ్యక్తి మిథాలీపై రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. అందులో ఒక బులెట్ ఆమె చేతికి తగలడంతో తీవ్ర రక్త స్రావమైంది. దాడికి ముందు దుండగులు మిథాలీ కారుపై కోడి గుడ్లతో దాడి చేశారు.

Journalist Shot At While Driving In Delhi

కాల్పుల షాక్ నుంచి తేరుకున్న మిథాలీ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆమెను ఈస్ట్ ఢిల్లీలోని ధర్మశిల హాస్పిటల్‌కు తరలించారు. ట్రీట్‌మెంట్ చేసిన డాక్టర్లు మిథాలీకి ఎలాంటి ప్రాణాపాయం లేని చెప్పారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మిథాలీపై కాల్పుల కేసుకు సంబంధించి పోలీసులు వివిధ కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన వెనుక బైక్‌లపై వెళ్లే వారిపై గుడ్లు విసిరి దోపిడీకి పాల్పడే ముఠాల హస్తం ఉందా అన్న దిశగా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు వ్యక్తిగత కక్షతో దుండగులు దారుణానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమిక సాక్ష్యాలను బట్టి కుటుంబ సభ్యుల మధ్య విభేదాలే దాడికి కారణమై ఉంటుందని భావిస్తున్నారు. 2008లోనూ ఢిల్లీలో ఇలాంటి ఘటనే జరిగింది. సౌత్ ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో సౌమ్య విశ్వనాథన్ అనే 26 ఏళ్ల జర్నలిస్టును గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.

English summary
A journalist was shot at by a group of masked men while she was in her car at east Delhi's Vasundhara Enclave, the police said today. Mitali Chandola, who lives in Noida, was driving her Hyundai i20 car around 12:30 am on Sunday when a Maruti Swift suddenly overtook her, the police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X