వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జర్నలిస్ట్ హత్య.. రెచ్చిపోయిన లిక్కర్ మాఫియా..!

|
Google Oneindia TeluguNews

లక్నో : ఓ జర్నలిస్ట్‌ను పొట్టనపెట్టుకుంది లిక్కర్ మాఫియా. బరి తెగించి కాల్పులు జరిపి మట్టుబెట్టింది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. సహరాన్‌పూర్‌లో ఆదివారం జర్నలిస్ట్‌తో పాటు ఆయన సోదరుడిని లిక్కర్ మాఫియా కాల్చి చంపిన ఘటన స్థానికంగా విషాదం నింపింది.

స్థానికంగా ప్రముఖ హిందీ న్యూస్ పేపర్‌లో పనిచేసే జర్నలిస్ట్‌ను లిక్కర్ మాఫియా చంపేసింది. ఇదివరకు పలు సందర్భాల్లోనూ ఆయన్ని బెదిరించినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఆదివారం నాడు జర్నలిస్ట్ ఆశిష్ జన్వానిని టార్గెట్ చేసిన దుండగులు అతడితో పాటు ఆయన వెంట ఉన్న సోదరుడిని కూడా మట్టుబెట్టింది.

<strong>మాజీ స్పీకర్ కోడెల తనయుడిపై కేసు.. వాహన విక్రయాల్లో భారీ స్కామ్..!</strong>మాజీ స్పీకర్ కోడెల తనయుడిపై కేసు.. వాహన విక్రయాల్లో భారీ స్కామ్..!

Journalist shot dead allegedly by liquor mafia in Uttar Pradesh

దుండగుల కాల్పుల్లో ఆయన సోదరుడు అక్కడికక్కడే చనిపోగా.. జర్నలిస్ట్ ఆశిష్ జన్వాని మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అయితే ఈ ఘటనకు సంబందించి పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ జంట హత్యలతో వారికేమైనా సంబంధముందా అనే కోణంలో లోతుగా విచారిస్తున్నారు.

ఆశిష్ జన్వానికి జర్నలిస్ట్‌గా ఆ ప్రాంతంలో మంచి పేరుంది. ఆ క్రమంలో లిక్కర్ మాఫియా అతడిని కాల్చి చంపడంతో స్థానికంగా పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. అయితే తనను ఇదివరకు లిక్కర్ మాఫియా బెదిరించిన ఘటనలో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని లోకల్‌గా వినిపిస్తున్న మాట. లిక్కర్ మాఫియా జర్నలిస్ట్‌ను చంపేసిందనే సమాచారంతో ఆగమేఘాల మీద ఘటనాస్థలికి చేరుకున్నారు డీఐజీ ఉపేంద్ర అగర్వాల్. జర్నలిస్ట్‌తో పాటు ఆయన సోదరుడు కూడా ఈ ఘటనలో చనిపోవడంతో ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం.

English summary
A journalist and his brother were on Sunday shot dead allegedly by liquor mafia in Saharanpur area of Uttar Pradesh. The journalist, who worked with a leading Hindi newspaper, had been threatened by liquor mafia on several occasions in the past.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X