వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాగాలాండ్, మేఘాలయలో నేడే ఓటర్ల తీర్పు

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

Nagaland Assembly Elections

ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, నాగాలాండ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు తమ తీర్పును ఇవ్వనున్నారు.. ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది.పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని అధికారులు వెల్లడించారు.

JP Hopes To Capture Power As Meghalaya, Nagaland Vote Today

కొన్ని పోలింగ్‌ కేంద్రాలు మినహా మిగతా అన్ని చోట్లా సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. నాగాలాండ్‌లోని కొన్ని జిల్లాల్లో సాయంత్రం 3 వరకు మాత్రమే పోలింగ్‌ నిర్వహించనున్నారు.

మేఘాలయ, నాగాలాండ్‌ సహా ఇప్పటికే ఎన్నికలు పూర్తైన త్రిపుర రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను మార్చి 3న ప్రకటిస్తారు. రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 120 నియోజకవర్గాలకు గానూ 118 చోట్ల పోలింగ్‌ జరగనుంది. మేఘాలయలో విలియమ్‌ నగర్‌ ప్రాంతంలో తీవ్రవాదుల దాడిలో ఎన్సీపీ అభ్యర్థి జోనాథన్‌ ఎన్‌ సంగ్మా మరణించడంతో అక్కడ ఎన్నిక నిలిపివేశారు. ఇక నాగాలాండ్‌లో ఎన్డీపీపీ చీఫ్‌ నెఫ్యూ రియో ఉత్తర అంగామి-2 నియోజకవర్గం నుంచి ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది.

మేఘాలయలో దాదాపు 18.4లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈసారి రాష్ట్రంలో మహిళల కోసం ప్రత్యేకంగా 67 పోలింగ్‌ కేంద్రాలు సహా 61 మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశామని మేఘాలయ చీఫ్‌ ఎలక్ట్రోరల్‌ ఆఫీసర్‌ ఎఫ్‌ఆర్‌ ఖార్‌కోంగర్‌ వెల్లడించారు.

అలాగే తొలిసారి అత్యధికంగా 32 మంది మహిళలు ఎన్నికల బరిలో ఉన్నట్లు తెలిపారు. ఇక నాగాలాండ్‌లో మొత్తం 11.91 లక్షల మంది ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొననున్నారు.

English summary
The tribal-Christian-majority north-eastern states of Meghalaya and Nagaland vote today, days after the eyeball-grabbing Left-BJP battle in Tripura.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X