• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వ్యాక్సిన్లపై వివాదం: బీజేపీ ఉచితంగా ఇస్తుంది, కాంగ్రెస్‌కు దమ్ముందా? సోనియాకు జేపీ నడ్డా సవాల్

|

దేశంలో కరోనా మహమ్మారి చుట్టూ నెలకొన్న రాజకీయాలూ రోజుకో మలుపుతిరుగుతున్నాయి. మోదీ సర్కారు అనుచిత, అనాలోచిత విధానాల వల్లే వైరస్ ప్రమాదకర స్థాయిలో వ్యాప్తి చెందిందన్న కాంగ్రెస్ పార్టీ.. కొవిడ్-19 రెండోదశ విలయం చాలా తీవ్రమైన విపత్తు అని, దీనికి కారణం మోదీ ప్రభుత్వ ఉదాసీనత, అసమర్థత అని, కనీసం వ్యాక్సిన్ల విషయంలోనైనా శాస్త్రీయంగా వ్యవహరించాలని, తక్షణమే ప్రధాని మోదీ నిపుల సలహాలు తీసుకుని, వ్యాక్సిన్ డ్రైవ్ పై అఖిలపక్ష భేటీ నిర్వహించాలని హితవు పలికింది. సోమవారం జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో ఈ మేరకు కాంగ్రెస్ ఈ మేరకు తీర్మానాలు చేయగా, వాటికి బీజేపీ చీఫ్ జేపీ నడ్డా కౌంటరిచ్చారు.

కల్వరి టెంపుల్‌లో కొవిడ్‌ సెంటర్‌ -హైదరాబాద్ చర్చిలో 300బెడ్లతో -బ్రదర్ సతీశ్‌కు ఎమ్మెల్సీ కవిత విషెస్కల్వరి టెంపుల్‌లో కొవిడ్‌ సెంటర్‌ -హైదరాబాద్ చర్చిలో 300బెడ్లతో -బ్రదర్ సతీశ్‌కు ఎమ్మెల్సీ కవిత విషెస్

4పేజీల ఘాటు లేఖ..

4పేజీల ఘాటు లేఖ..

కరోనా వైరస్ వ్యాప్తి, కొవిడ్ వ్యాక్సిన్ల పంపిణీ విధానంపై ప్రజలను తప్పుదోవపట్టించేలా కాంగ్రెస్ వ్యవహరిస్తున్నదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మండిపడ్డారు. వ్యాక్సినేషన్ పై తప్పుడు ఆందోళనలు సృష్టించవద్దని, జనాన్ని మభ్యపెట్టడం మానుకోవాలని కాంగ్రెస్ ను హెచ్చరించారు. ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ సహా ఆ పార్టీ ముఖ్యమంత్రులు, ఇతర నేతలను అడ్రెస్ చేస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ మేరకు మంగళవారం ఘాటు లేఖరాశారు. మొత్తం 4పేజీలున్న లేఖలో నడ్డా కీలక అంశాలను ప్రస్తావించారు...

బిగ్ రిలీఫ్: కరోనాకు గ్లూకోజ్ పౌడర్ -DRDO తయారీ 2-DG డ్రగ్‌కు డీసీజీఐ అనుమతి -ఆక్సిజన్ అసరం ఉండదుబిగ్ రిలీఫ్: కరోనాకు గ్లూకోజ్ పౌడర్ -DRDO తయారీ 2-DG డ్రగ్‌కు డీసీజీఐ అనుమతి -ఆక్సిజన్ అసరం ఉండదు

భారత్ ఇలా ఉన్నందుకు గర్వించండి..

భారత్ ఇలా ఉన్నందుకు గర్వించండి..

కరోనా విలయాన్ని నిర్వహించడంలో కేంద్రం, బీజేపీ పాలిత రాష్ట్రాలు సమర్థవంతంగా వ్యవహరించాయన్న జేపీ నడ్డా.. భారతదేశంలో వ్యాక్సిన్ తయారవడం అందరికీ గర్వకారణమైన విషయం కావాలని, అలాంటిది కాంగ్రెస్ నేతలు మాత్రం వ్యాక్సిన్లను ఎగతాళి చేసే ప్రయత్నం చేశారని, ప్రజల మనసుల్లో సందేహాలు సృష్టించే ప్రయత్నం చేశారని నడ్డా మండిపడ్డారు. ఏఐసీసీ పెద్దలతోపాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు వ్యాక్సిన్లపై తప్పుడు ప్రచారారలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు..

  Twitter Donated 15M $ To India | Covid 19 | Jack Dorsey || Oneindia Telugu
  బీజేపీ రాష్ట్రాల్లో ఉచిత వ్యాక్సిన్..

  బీజేపీ రాష్ట్రాల్లో ఉచిత వ్యాక్సిన్..

  వ్యాక్సిన్లను అనుమానించే చరిత్ర లేనటువంటి దేశంలో సందేహాలను సృష్టించే కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్న రికార్డు కాంగ్రెస్‌కు దక్కిందని, 100ఏళ్లకోసారి వచ్చే మహమ్మారి విలయం సృష్టిస్తుండగా కాంగ్రెస్ ఇలా వ్యవహరించడం సిగ్గుచేటని జేపీ నడ్డా ఎద్దేవా చేశారు. బహుశా కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు మధ్య తీవ్రమైన సమాచార లోపం ఉదేమోనని నడ్డా అనుమానం వ్యక్తం చేశారు. నిజానికి వ్యాక్సినేషన్ ను డీసెంట్రలైజ్ చేయాలని గతంలో కాంగ్రెస్ పార్టీనే సలహాఇచ్చిందని గుర్తు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పేదలకు, అణగారిన వర్గాలకు ఉచితంగా వ్యాక్సిన్లు ఇస్తామని ఇప్పటికే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన విషయాన్ని నడ్డా గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విధంగా పేదలకు సాయపడేందుకు ముందుకు వస్తాయా? ఉచితంగా వ్యాక్సిన్లు అందించగలవా? అని బీజేపీ చీఫ్ ప్రశ్నించారు.

  English summary
  Urging that the Congress should not weaken the country’s fight against Covid-19, BJP chief JP Nadda on Tuesday wrote a letter to Sonia Gandhi, saying former Congress chief Rahul Gandhi will be remembered for duplicity and pettiness.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X