వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉన్నావ్ బాధితురాలి వాంగ్మూలం : ఎయిమ్స్‌కు మేజిస్ట్రేట్, కుల్‌దీప్ సింగ్ సెంగార్ కూడా..

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : ఉన్నావ్ లైంగికదాడి బాధితురాలి వాంగ్మూలం సేకరించేందుకు మేజిస్ట్రేట్ ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) చేరుకున్నారు. జడ్జీతోపాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు, బీజేపీ బహిష్కృత నేత, ఎమ్మెల్యే కుల్‌దీప్ సింగ్ సెంగార్ కూడా ఆస్పత్రికి వచ్చారు. 2017లో యువతికి ఉద్యోగం ఇస్తానని చెప్పి లైంగికదాడి చేశాడు. సెంగార్‌తోపాటు అతని అనుచరుడు శశి సింగ్ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలోనే కొద్దీరోజుల క్రితం బాధితురాలు యాక్సిడెంట్‌కు గురై ప్రాణాలతో పోరాడుతున్న సంగతి తెలిసిందే.

ఎయిమ్స్‌లో వాంగ్మూలం

ఎయిమ్స్‌లో వాంగ్మూలం

ఢిల్లీ కోర్టు ఆదేశాలతో ప్రత్యేక న్యాయమూర్తి ఎయిమ్స్ వచ్చారు. అక్కడే వాంగ్మూలం తీసుకునేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. దీనికి సంబంధించి ఈ నెల 7న ఎయిమ్స్‌కు వచ్చారు జిల్లా జడ్జీ ధర్మేష్ శర్మ. ఎయిమ్స్‌లోని జై ప్రకాశ్ నారాయణ ఆపెక్స్ ట్రామా సెంటర్ వద్ద ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. న్యాయమూర్తి సూచనలతో సిబ్బంది ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ఆడియో, వీడియో రికార్డింగ్ మాత్రం చేయొద్దని మెడికల్ సూపరింటెండెంట్ న్యాయమూర్తి తెలిపారు. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా చేసిన సూచనలను మేజిస్ట్రేట్ కూడా పరిగణలోకి తీసుకున్నారు. అయితే సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ... వాంగ్మూలం తీసుకోనున్నారు.

ఇదీ నేపథ్యం

ఇదీ నేపథ్యం

2017లో యువతికి ఉద్యోగం ఇస్తానని అప్పటి బీజేపీ ఎమ్మెల్యే కుల్ దీప్ సెంగార్, అతని అనుచరుడు శశి సింగ్ లైంగికదాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో యువతి మైనర్ అని .. ఉద్యోగం పేరుతో మభ్యపెట్టి లైంగికదాడి చేశారని తెలిపింది. ఉపాధి కోసం యువతి ఆశపడి వచ్చిందని ... ఆ సమయంలో సెంగార్ ఇంటి వద్ద సెక్యురిటీ సిబ్బంది కూడా లేరని వెల్లడించింది. యువతిని ఇంటి వెనకాల నుంచి తీసుకొని .. తర్వాత ఇంట్లో లైంగికదాడి చేశాడని చెప్పింది. తర్వాత ఉద్యోగం ఇవ్వకపోగా వేధింపులకు గురిచేశారు. ఇదేంటని నిలదీయడంతో బాధితురాలి తండ్రిపై కక్షపూరితంగా కేసు పెట్టారు. ఎమ్మెల్యే అండతో స్థానిక పోలీసుల అతడిని దాడి చేయడంతో చనిపోయాడు. అప్పటినుంచి ఎమ్మెల్యేపై బాధితురాలి పోరాడుతూనే ఉన్నారు.

కోర్టు ఆదేశాల మేరకు ..

కోర్టు ఆదేశాల మేరకు ..

ఉన్నావ్ బాధితురాలికి సంబంధించిన పేరు తెలియజేయొద్దని మీడియాకు జిల్లా న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. ఆమె కుటుంబసభ్యులకు సంబంధించిన వివరాలు కూడా తెలుపొద్దని .. అలా చేస్తే వారిపై దాడులు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. అయితే బాధితురాలి పేరుపై మీడియా గోప్యత పాటించింది. ఈ కేసు వివరాలను సుప్రీంకోర్టు మార్గదిర్గేశాల మేరకు ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులు న్యాయస్థానానికి తెలియజేస్తున్నారు.

English summary
following the directions of Delhi court, a judge has arrived at AIIMS in New Delhi for recording the statement of the Unnao rape survivor in the case of alleged sexual assault by expelled BJP MLA Kuldeep Singh Sengar in 2017. Accused Kuldeep Singh Sengar has also been taken to AIIMS for the hearing. He was brought along with co-accused Shashi Singh. As per directions of the court, the temporary court will hold 'in-camera' proceedings at AIIMS for recording the statement of the Unnao rape survivor. The rape survivor has been in the hospital after she was injured in an accident. The 'in-camera' proceedings are not open to the public and the press.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X