వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాలూ ప్రసాద్ యాదవ్‌కు జడ్జి మరో దిమ్మతిరిగే కౌంటర్

|
Google Oneindia TeluguNews

పాట్నా: దాణా కుంభకోణం కేసులో జైల్లో ఉన్న ఆర్జేడీ చీఫ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు జడ్జి మరోసారి కౌంటర్ ఇచ్చారు. లాలూను కలవడానికి వారానికి కేవలం ముగ్గురే రావాలని సీబీఐ న్యాయమూర్తి శివపాల్‌ సింగ్‌ ఆదేశించారు. ఈ విషయం గురించి పునరాలోచించాల్సిందిగా బుధవారం లాలూ న్యాయమూర్తిని కోరారు.

సంక్రాంతి పండుగ వస్తోందని, తమ ఇంట్లో దహీ చుర్రా (మిఠాయి)తో అట్టహాసంగా పండుగ జరుపుకుంటామని, తనను కలవడానికి వారంలో కేవలం ముగ్గురికే అనుమతిస్తున్నారని లాలూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై మరోసారి ఆలోచించాలని కోరారు. ఆ అధికారం మీకు ఉందని జడ్జితో చెప్పారు.

Judge promises Lalu Prasad Chura Dahi in jail on Makar Sankranti

ఇందుకు జడ్జి ధీటైన కౌంటర్ ఇచ్చారు. ఆ మిఠాయి నీకు అందేలా చూస్తానని, కానీ ముగ్గురు విజిటర్లకు మించి లోనికి అనుమతించేది లేదని తేల్చి చెప్పారు. ఇందుకు లాలూ స్పందిస్తూ.. తాను లాయర్‌ను అని, సుప్రీం, హైకోర్టులలో న్యాయవాదిగా తన పేరు నమోదై ఉందని, తన ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని శిక్ష వేస్తానని చెప్పారని, కానీ మూడున్నరేళ్లు జైలు శిక్ష విధించారని అన్నారు.

Recommended Video

Fodder scam : దాణా స్కాం: లాలూకు శిక్ష ఖరారు వాయిదా !

దీనికి జడ్జి శివపాల్ స్పందిస్తూ.. కానీ నువ్వు రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ సమర్పించలేదని, అందుకే నీకు మూడున్నరేళ్లు శిక్ష వేశానని చెప్పారు. ఇంతకుముందు కూడా లాలూ తనకు జైల్లో చలిగా ఉందని చెప్పడంతో న్యాయమూర్తి చలేస్తే తబలా వాయించుకో అని చురకలు అంటించారు. కాగా, దాణా కుంభకోణంలో లాలూ జైలుకు వెళ్లడం ఇది ఎనిమిదో సారి. ప్రస్తుతం లాలూ ఝార్ఖండ్‌లోని హజరిబాగ్‌ ప్రాంతంలో ఉన్న ఓపెన్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.

English summary
Troubles have not ended for Lalu Prasad Yadav yet as another fodder scam case inches closer to judgement day. A special CBI court in Ranchi, which is hearing one of the four cases of the two decades old fodder scam, is likely to pronounce its judgement on January 24.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X