వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిల్లర పంచాయితీ: రూ.27వేల భరణంను ఈ భర్త ఎలా చెల్లించాడో తెలిస్తే షాక్ అవుతారు

|
Google Oneindia TeluguNews

పంజాబ్‌లో ఓ జంట విడాకులకు దరఖాస్తు చేసుకోగా... కేసును విచారించిన కోర్టు మరో రెండురోజులకు వాయిదా వేసింది. కోర్టులు వాయిదా వేయడం మామూలే ఇందులో కొత్తేముంది అనేకదా మీ డౌటు..? అక్కడికే వస్తున్నాం. విడాకుల మంజూరుకు సంబంధించి తుది తీర్పు మంగళవారం రావాల్సి ఉండగా జడ్జీ జూలై 27కు వాయిదా వేశారు. ఇందుకు కారణం భర్త ఇచ్చిన మెయింటెనెన్స్ లెక్క తేలలేదు. కారణం కాస్త వెరైటీగా ఉన్నా... నిజం మాత్రం ఇదే.

2015లో ఓ జంట విడాకులు కావాలంటూ పంజాబ్ హర్యానా ఉమ్మడి హైకోర్టులో దరఖాస్తు చేసుకుంది. కేసు విచారణ చేసిన జడ్జీ భార్య మెయింటెనెన్స్ కింద రూ.25వేలు ప్రతి నెల ఇవ్వాల్సిందిగా భర్తను ఆదేశించారు. అయితే తీర్పును భర్త బేఖాతరు చేయడంతో భార్య మళ్లీ కోర్టును ఆశ్రయించింది. ఈ సారి సీరియస్ అయిన కోర్టు నెలకు రూ.50వేలు భార్యకు చెల్లించాలని భర్తను ఆదేశించింది. అయితే ఇందుకు భర్త ఒప్పుకోలేదు. తన దగ్గర అంత డబ్బు లేదని కోర్టుకు చెప్పాడు.

Judgement delayed in divorce case due to coins

భర్త చెప్పేదంతా అబద్ధమని తను అడ్వొకేట్‌గా పనిచేస్తున్నాడని భార్య చెప్పింది. ఆయన పేరుమీద ఎన్నో ఆస్తులు ఉన్నాయని...తన దగ్గరకు అన్నీ హైప్రొఫైల్ కేసులు వస్తుంటాయని భార్య కోర్టుకు తెలిపింది. అయితే కోర్టు ఈసారి గట్టిగా చెప్పడంతో కొంత డబ్బులు చెల్లించాడు. ఆ తర్వాత మరోసారి చెల్లించాల్సి వచ్చినప్పుడు మాత్రం డబ్బును కాయిన్స్ రూపంలో చెల్లించాడు. అన్ని రూపాయి రెండు రూపాయిల బిల్లలు ఉన్న బ్యాగును ఆమె భర్త లాయరు ఆమెకు అందించాడు. ఇది చూసి షాక్ అయ్యింది భార్య. డబ్బును కాయిన్ల రూపంలో ఇచ్చి కొత్త రకం హింసకు తెరలేపాడని భార్య వాపోయింది. మొత్తం రూ.24వేల 600 రూపాయలను భర్త రూపాయి రెండు రూపాయల నాణేల రూపంలో చెల్లించాడు. దీంతో ఆగ్రహం చెందిన భార్య ఈ చిల్లరతో నేనేమి చేసుకుంటానని ప్రశ్నించింది. వీటిని బ్యాంకులు కూడా తీసుకోవని ఆవేదన వ్యక్తం చేసింది.

Judgement delayed in divorce case due to coins

అయితే భర్త మాత్రం తెలివిగా సమాధానం ఇచ్చాడు. డబ్బు చెల్లించాలని మాత్రమే కోర్టు చెప్పిందని ఆ డబ్బును రూ.100 నోట్లలో ఇవ్వాలనో... రూ.500 నోట్ల రూపంలో ఇవ్వాలనో.. లేక రూ.2వేల నోట్ల రూపంలో ఇవ్వలానో ఎక్కడా చెప్పలేదని చెప్పాడు. డబ్బును లెక్క పెట్టాలని ముగ్గురికి ఇచ్చినట్లు భర్త తెలిపాడు. ఒక్క రూ.400 మాత్రమే నాలుగు వంద నోట్ల రూపంలో చెల్లించాడు. ఇక ఇది లెక్కబెట్టేందుకు చాలా సమయం తీసుకోవడంతో జడ్జి కేసును వాయిదా వేశారు.

English summary
An alimonycase was on Tuesday adjourned for July 27 as a sum of Rs 24,600 could not be counted. Reason: the entire amount was in the denomination of Re 1 and Rs 2 coins.Drama was witnessed in the district courts when a Punjab and Haryana high court lawyer handed over the monthly maintenance amount to his former wife in a bag filled with coins.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X