వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సామాన్యులు ఎంతో ఆశిస్తున్నారు, కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు: ప్రధాని మోడీ

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: న్యాయవ్యవస్ధపై దేశ ప్రజలకు అపారమైన విశ్వాసం ఉందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ప్రజల విశ్వాసాన్ని మరింతగా పంచేలా కేసులకు సత్వర పరిష్కారం చూపే దిశగా చర్యలు చేపట్టాలని ఆయన న్యాయమూర్తులకు పిలుపునిచ్చారు.

ఆదివారం ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో న్యాయవ్యవస్థ - సుపరిపాలన అంశంపై ముఖ్యమంత్రులు, ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో ప్రధాని మోడీ మాట్లాడుతూ... న్యాయవ్యవస్థపై ప్రజలకు అత్యంత విశ్వాసం ఉంది. న్యాయవ్యవస్థ నుంచి సామాన్యులు ఎంతో ఆశిస్తున్నారని అన్నారు.

న్యాయవ్యవస్థలో ఎక్కువ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కేసుల సత్వర పరిష్కారానికి కావాల్సిన అంశాలపై దృష్టి పెట్టాలి. భవిష్యత్ తరాల కోసం ఉత్తమ న్యాయవ్యవస్థను తయారు చేయాల్సిన అవసరాన్ని గుర్తించాలి. కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థ మధ్య సత్సంబంధాలు కొనసాగాలి. వ్యక్తులు మంచివాళ్లే, వ్యవస్థలోనే ఎక్కడో లోపముందని దాన్ని సవరించాల్సిన అవసరం ఉందన్నారు.

న్యాయవ్యవస్థ చేస్తున్న పని దైవత్వంతో కూడుకున్నదని అన్నారు. డిజిటల్‌ ఇండియా భారత ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకమని అన్నారు. న్యాయ వ్యవస్థలో సంస్కరణలకు డిజిటల్‌ ఇండియా ఉపయోగపడుతుందన్నారు. న్యాయవ్యవస్థ మరింత అభివృద్ధికి ఇంటర్నెట్ సేవలను కూడా వినియోగించుకోవాలని కోరారు.

 Judiciary should be both powerful and perfect, says PM Modi

లా యూనివర్శిటీలు, కాలేజీల్లో అత్యుత్తమ బోధనకు కృషి చేయాలని మోడీ పిలుపునిచ్చారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హెచ్‌‌ఎల్‌ దత్తు ప్రారంభోపన్యాసం చేశారు.

ఈ కార్యక్రమానికి కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ, తెలుగు రాష్ట్ర ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కల్యాణ్‌జ్యోతిసేన్‌ గుప్తా, ఏపీ సీఎం చంద్రబాబులతోపాటు వివిధ రాష్ట్రాల సీఎంలు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు హాజరయ్యారు.

English summary
There is a lot of responsibility on judges as God has made them to carry out divine functions, Prime Minister Narendra Modi said on Sunday addressing a conference of judges and chief ministers in the national capital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X