వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒక్కసారిగా కుప్పకూలిన వంతెన: నదిలో పడిన వాహనాలు(వీడియోస్)

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఒక్కసారిగా కుప్పకూలిన వంతెన : నదిలో పడిన వాహనాలు(వీడియోస్)

గాంధీనగర్: గుజరాత్‌లోని జూనాగఢ్‌లోని మలంక గ్రామంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే ఓ నదిపై ఉన్న వంతెన కుప్పకూలింది. దీంతో ఆ వంతెనపై ప్రయాణిస్తున్న వాహనాలు బ్రిడ్జితోపాటు నదిలో పడిపోయాయి. దీంతో వాహనాల్లోని ప్రయాణికులు ప్రాణభయంతో అరుపులు, కేకలు పెట్టారు.

'ఇంట్లో దుస్తులు లేవా? ఇలాంటి డ్రెస్‌లో బయట తిరుగుతారా?'(వీడియో)'ఇంట్లో దుస్తులు లేవా? ఇలాంటి డ్రెస్‌లో బయట తిరుగుతారా?'(వీడియో)

నదిలో పడ్డ కార్లు

నదిలో పడ్డ కార్లు

సుమారు 60 అడుగుల ఎత్తులో ఉన్న ఈ వంతెన ఒక్కసారిగా కూలడంతో వాహనాలు నదిలో పడిపోయాయి. ఓ కారు నదిలో పడేస్థితిలో ఉండగా అందులోని ప్రయాణికులు అప్రమత్తంగా వ్యవహరించి బయటపడ్డారు.

కాపాడిన స్థానికులు

అక్కడేవున్న స్థానికులు ప్రయాణికులను కాపాడారు. ఆదివారం చోటు చేసుకున్న ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని, ఈ క్రమంలోనే బ్రిడ్జి కూలిపోయిందని అధికారులు చెబుతున్నారు.

అంతరాయం..

ఈ ఘటనలో 14మంది గాయపడగా.. వారందరినీ సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బ్రిడ్జి కూలడంతో ఆ మార్గం గుండా రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. అధికారులు ఈ ఘటనపై సమీక్షిస్తున్నారు.

సెల్ఫీ కోసం వెళ్తే నాలుగు ప్రాణాలు పోయాయి..

సెల్ఫీ కోసం వెళ్తే నాలుగు ప్రాణాలు పోయాయి..

ఇది ఇలా ఉండగా, తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించి జలాశయంలో పడి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఊత్తంగరై పాంబారు జలాశయం సమీపంలోని ఒడ్డపట్టి గ్రామానికి చెందిన సంతోష్(14), వినోద(18), స్నేహ(19), నివేద(20) ఆదివారం సాయంత్రం జలాశయాన్ని సందర్శించేందుకు వెళ్లారు.

సెల్ఫీ తీసుకోబోతుండగా అదుపుతప్పి

సెల్ఫీ తీసుకోబోతుండగా అదుపుతప్పి

అక్కడ సెల్ఫీ తీసుకోబోతుండగా అదుపుతప్పి గట్టుపై నుంచి నీటిలో పడిపోయారు. అక్కడే ఉన్న కొందరు స్థానికులు వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఆ నలుగురి మృతదేహాలను జలాశం నుంచి బయటకు తీశారు. సెల్ఫీలో పిచ్చిలో పడి ప్రాణాలు తీసుకోవద్దంటూ పోలీసుశాఖవారు చెబుతున్నప్పటికీ.. యువత ఏమాత్రం పట్టించుకోకుండా వారి తల్లిదండ్రులకు, కుటుంబసభ్యులకు తీరని శోకాన్ని మిగులుస్తున్నారు.

English summary
Many cars were damaged after a bridge collapsed near Malanka village in Junagadh in Gujarat on Sunday injuring many.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X