వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విదేశాల్లో మెడికల్ డిగ్రీలు కానీ.: మనదేశ పరీక్షలో మాత్రం పాసవడం లేదు, 85శాతం మంది ఫసక్కే!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మనదేశం నుంచి వెళ్లి విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అయితే, విదేశాల్లో చదివి వైద్య విద్యను చదివిన చాలా మంది విద్యార్థులు భారతదేశంలో ప్రొక్టిస్ చేసుకునేందుకు లైసెన్స్ పొందడంలో మాత్రం విఫలమవుతుండటం గమనార్హం. కేవలం 15శాతం మంది మాత్రమే ఈ లైసెన్స్ పొందడం గమనార్హం.

మనదేశంలో ప్రాక్టిస్ చేయాలంటే.

మనదేశంలో ప్రాక్టిస్ చేయాలంటే.

విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించిన విద్యార్థులు భారతదేశంలో ప్రాక్టిస్ చేసుకోవాలంటే లైసెన్స్ అవసరం ఉంటుంది. ఈ లైసెన్స్ కోసం ఫారెన్ మెడికల్ గ్రాడ్యూయేట్స్ ఎగ్జామినేషన్(ఎఫ్ఎంజీఈ) పరీక్షలో నెగ్గాలి. అయితే, విదేశాల్లో వైద్య విద్య చదివిన 85శాతం మంది విద్యార్థులు ఈ పరీక్షలు ఫెయిల్ కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

కేవలం 15శాతం మందే ఉత్తీర్ణత

కేవలం 15శాతం మందే ఉత్తీర్ణత


ఎఫ్ఎంజీఈని నిర్వహించే నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ విశ్లేషణలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2015-2018 మధ్య కాలంలో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నిర్వహించిన ఎఫ్ఎంజీఈ కోసం 61,500 మంది విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించిన విద్యార్థులు హాజరయ్యారు. అయితే, వీరిలో 14.2శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు.
అంటే కేవలం 8,764మంది మాత్రమే ఈ పరీక్షలో విజయం సాధించారు. చైనా, రష్యా, ఉక్రెయిన్ దేశాల్లో విద్యనభ్యసించిన వారిలో ఎక్కువమంది ఈ పరీక్షలో ఫెయిలయ్యారు.

చైనా, రష్యాల కంటే బంగ్లాదేశ్, మారిషస్ బెటర్..

చైనా, రష్యాల కంటే బంగ్లాదేశ్, మారిషస్ బెటర్..

చైనా, రష్యా, బంగ్లాదేశ్, ఉక్రెయిన్, నేపాల్, కిర్జిస్థాన్, కజకిస్థాన్ దేశాల్లో వైద్య విద్యనభ్యసించిన 87.6శాతం అంటే 54,055 మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. ఇక మారిషస్‌లో విద్యనభ్యసించిన 52శాతం విద్యార్థులు(154 మందిలో 81మంది) విద్యార్థులు పరీక్షలో ఉత్తీర్ణులు కావడం విశేషం. ఇక బంగ్లాదేశ్‌లో విద్యనభ్యసించిన వారిలో 27.11శాతం (1265లో 343మంది)మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. నేపాల్‌లో వైద్య విద్యనభ్యసించిన 17.68శాతం(5894లో 1042మంది) ఉత్తీర్ణులు కావడం గమనార్హం. చైనాలో విద్యనభ్యసించిన వారి సక్సెస్ రేట్ 11.67శాతం(20,314లో 2370మంది), రష్యాలో 12.89శాతం, ఉక్రెయిన్‌లో విద్యనభ్యసించిన వారిలో 15శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు.

ఈ దేశాలు కాకుండా వేరేదేశాల్లో చదివితే టెస్ట్ రాయాల్సిందే..

ఈ దేశాలు కాకుండా వేరేదేశాల్లో చదివితే టెస్ట్ రాయాల్సిందే..


అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మినహా ఇతర దేశాల్లో వైద్య విద్యను అభ్యసించిన పూర్తి చేసిన విద్యార్థులు మనదేశంలో ప్రాక్టీస్ చేయడానికి, ఏదైనా ఆసుపత్రిలో పనిచేయడానికి ఎఫ్ఎంజీఈ పరీక్ష పాస్ అవ్వాలనే నిబంధన ఉంది. గత ఆరేళ్లలో ఎఫ్ఎంజీఈని క్లియర్ చేసిన విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 2012-13లో 28.29శాతం ఉండగా.. 2016-17లో 9.44శాతం కనిష్టానికి చేరుకుందని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నివేదక పేర్కొంది.

ఉత్తీర్థత శాతం తగ్గడంపై ఆందోళన

ఉత్తీర్థత శాతం తగ్గడంపై ఆందోళన


ఆఫ్ఘనిస్థాన్, ఇథియోపియా, జర్మనీ, హైతీ, హంగరీ, జాంబియా, థాయ్‌లాండ్ లాంటి దేశాల్లో చదవిని ఏ ఒక్క విద్యార్థి కూడా ఈ పరీక్షను క్లియర్ చేయలేకపోయారని కేంద్రం పేర్కొంది. దేశంలో మెడికల్ కాలేజీలలో తక్కువ సంఖ్యలో సీట్లు అందుబాటులో ఉన్నందున అవకాశం ఉన్నవారు పెద్ద ఎత్తున భారతీయ విద్యార్థులు విదేశాల్లో మెడిసిన్ చదువు కోసం వెళ్తున్నారు. కాగా, ఎఫ్ఎంజీఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించని వారి సంఖ్య పెరుగుతూ ఉండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది.

English summary
SQUEEZED OUT by the competition at home, Indian students may be increasingly tapping medical colleges overseas but, overall, less than 15 per cent of them clear the Foreign Medical Graduates Examination (FMGE), the mandatory test to obtain a licence to practice in India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X