• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఈ వెడ్డింగ్ కార్డు తెగ వైరల్ అవుతోంది... ఇందులో ఏమి రాసి ఉందో తెలిస్తే షాక్ అవుతారు..?

|

అసలే ఇది ఎన్నికల సీజన్. మరి కొన్ని నెలల్లో భారతదేశం సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతోంది. దీంతో ఎక్కడ నలుగురు గుమికూడినా వారు చర్చించుకుంటున్న అంశం రాజకీయం. రానున్న ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వస్తారు.. ఎవరు ప్రతిపక్షంలో కూర్చుంటారు అనే మాటలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే ఆయా రాజకీయ పార్టీలు దేశవ్యాప్తంగా పర్యటనలు చేసి ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇది నాయకుల పని అయితే... మరి కొందరు ఆ పార్టీలకు అభిమానులుగా చెప్పుకునే వారు తమ స్ట్రాటజీని మరోలా ప్రదర్శిస్తున్నారు. ఇంతకీ ఆ కొత్త రకం వ్యూహం ఏమిటి.. ఆ కొత్త ప్రచారం ఏమిటి.. ఏ పార్టీకి వీరు ప్రచారం చేస్తున్నారు... తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాలి మరి.

టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన వెడ్డింగ్ కార్డు

అది గుజరాత్‌లోని సూరత్ నగరం. అక్కడ ఓ వెడ్డింగ్ ఇన్విటేషన్ గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. సాధారణంగా వెడ్డింగ్ కార్డు ఇవ్వగానే ఎవరైనా సరే పెళ్లి గురించి మాట్లాడుకుంటారు. కానీ ఇదేం చోద్యమో తెలీదు కానీ అక్కడ వివాహ ఆహ్వాన పత్రిక గురించి మాట్లాడుకుంటున్నారు. పోనీ అదేమైనా అంబానీ కూతురు పెళ్లికి ఇచ్చిన ఇన్విటేషన్ కార్డు కంటే ఖరీదైనదా అంటే అదీ కాదు. మరి ఎందుకు మాట్లాడుకుంటున్నారో తెలుసా... ఆ ఇన్విటేషన్ కార్డు కింద "బహుమతులు, కానుకలు తీసుకొన బడవు" అని రాసి ఉండే లైన్ గురించే చర్చ జరుగుతోంది.

కార్డును చూసి షాక్‌కు గురైన అతిథులు

"బహుమతులు, కానుకలు తీసుకొన బడవు" అని ఉంటే పెద్దగా చర్చ జరిగేది కాదేమో... కానీ అక్కడ ఏమి రాసి ఉందో తెలిస్తే మీరు కూడా అవాక్కవుతారు. ఆ పత్రికలో ఏమి రాసి ఉందంటే..."మీరు మాకు ఇచ్చే కానుక 2019లో మోడీ గారికి ఓటు వేయడమే " అని ఉంది. కార్డుపై ఇలా రాసి ఉండటం చూసిన అతిథులు షాక్‌కు గురయ్యారు. సాధారణంగా వెడ్డింగ్ కార్డులపై "డొనేట్ ఫర్ చారిటీ" అనో లేక " నో గిఫ్ట్స్ ప్లీజ్" అనో రాసి ఉంటుంది. కానీ ఈ టైపులో ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఎక్కడా చూడలేదని అతిథులు గుసగుసలాడారు.

మోడీ కోసం వెరైటీ ప్రచారం

ఇక అసలు విషయానికొస్తే ప్రధాని నరేంద్ర మోడీ కోసం తమవంతు ప్రచార బాధ్యతను ఆ కుటుంబం తీసుకుంది. అందుకే ఇలా వెరైటీగా ప్రచారం చేస్తోంది. మోడీకి ఓటు వేయండి అని రాసిఉన్న ఈ వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. దీంతో మంగళూరుకు చెందిన మరో మోడీ వీరాభిమాని కూడా తన పెళ్లి పత్రికను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. మొత్తానికి ఎన్నికల వేడి ఇటు నాయకుల్లోనే కాదు అటు సామాన్యుల్లో కూడా పెరుగుతోంది అని చెప్పేందుకు ఈ వెడ్డింగ్ కార్డులే నిదర్శనం.

వెడ్డింగ్ కార్డుపై మోడీ పథకాలు

వెడ్డింగ్ కార్డుపై మోడీ పథకాలు

ఇదిలా ఉంటే మరో వెడ్డింగ్ కార్డు కూడా తెగ వైరల్ అవుతోంది. భూషణ్ బ్రాన్సన్ అనే మరో వ్యక్తి తన వెడ్డింగ్ కార్డును వెరైటీగా డిజైన్ చేయించాడు. ఆయన వివాహ ఆహ్వాన పత్రికపై మోడీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రింట్ చేయించి మోడీపై తనకున్న అభిమానం చాటాడు. అంతేకాదు ఇది ట్విటర్‌లో పోస్టు చేస్తూ ప్రధాని మోడీని కూడా ట్యాగ్ చేశాడు. " సర్ ఇది నా వెడ్డింగ్ ఇన్విటేషన్. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి వివరించాను. పెళ్లికి వచ్చే ప్రతి అతిథి పథకాలు తెలుసుకోవాలని ఇలా చేశాను.ఇతరులు కూడా ఈ పథకాల ద్వారా లబ్ది పొందేందుకు సహకరించాలని రాశాను. మోడీని మనం కాపాడుకోగలిగితే... దేశాన్ని మోడీ కాపాడుతారు అని నేను నమ్ముతాను" అని భూషణ్ ట్వీట్ చేశాడు.

English summary
A couple from Surat started canvassing for Modi in a different style. The couples wedding card read "Vote for Modi in 2019 Lok Sabha elections". This went viral on social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X