బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Corona Lockdown: కరోనా కాలంలో మాజీ ప్రధాని మనుమడు, మాజీ సీఎం కొడుకు, స్టార్ హీరో పెళ్లి !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ రామనగర: ప్రస్తుతం ప్రపంచంలో కరోనా కాలం నడుస్తోంది. కంటికి కనపడని కరోనా వైరస్ ప్రపంచ దేశాలను ఫుల్ బాల్ ఆడుకుంటోంది. భారతదేశంలో కరోనా వైరస్ కట్టడికి రెండోసారి లాక్ డాన్ అమలు చేశారు. మాజీ ప్రధాని మనుమడు, మాజీ సీఎం కుమారుడు, ప్రముఖ హీరో పెళ్లికి కరోనా వైరస్ అడ్డంకి అయ్యింది. రంగరంగ వైభంగా జరగాల్సిన తన కుమారుడి పెళ్లిని సర్వసాధారణంగా చెయ్యాలని నిర్ణయించామని, బంధు మిత్రులు, పార్టీ కార్యకర్తలు అర్థం చేసుకుని వారి ఇళ్ల నుంచే నూతన వధూవరులను ఆశీర్వదించాలని మాజీ సీఎం మనవి చేశారు. బెంగళూరులో రేపు జరగాల్సిన తన కుమారుడి పెళ్లి వేదికను కరోనా రెడ్ జోన్ కారణంగా రామనగరకు మార్చేశామని స్వయంగా మాజీ సీఎం చెప్పారు.

Coronavirus: దేశంలో 63 శాతం కరోనా కేసులకు ఢిల్లీ తబ్లీగ్ జమాత్ లింక్, దొంగ దెబ్బ, బీఎల్ఎస్!Coronavirus: దేశంలో 63 శాతం కరోనా కేసులకు ఢిల్లీ తబ్లీగ్ జమాత్ లింక్, దొంగ దెబ్బ, బీఎల్ఎస్!

 స్టార్ హీరో తాత మాజీ ప్రధాని, తండ్రి మాజీ సీఎం

స్టార్ హీరో తాత మాజీ ప్రధాని, తండ్రి మాజీ సీఎం

కరోనా వైరస్ హాట్ స్పాట్ కేంద్రాల జాబితాలో సిలికాన్ సిటీ బెంగళూరు పేరు ఉంది. మాజీ ప్రధాని, జేడీఎస్ చీఫ్ హెచ్ డీ. దేవేగౌడ మనుమడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ. కుమారస్వామి కుమారుడు, స్టార్ హీర్ నిఖిల్ కుమారస్వామి వివాహం ఏప్రిల్ 17వ తేదీ శుక్రవారం బెంగళూరులో జరగవలసి ఉంది. అయితే కరోనా వైరస్ రెడ్ జోన్ ల జాబితాలో బెంగళూరు పేరు ఉండటంతో మాజీ ప్రధాని కుటుంబ సభ్యులు పెళ్లి వేదికను మార్చాలని నిర్ణయించారు. పెళ్లి కొడుకు నిఖిల్ తల్లి అనితా కుమారస్వామి కూడా ప్రస్తుతం జేడీఎస్ ఎమ్మెల్యే.

ఫ్యామిలీలో ఎంత మందో తెలుసా ?

ఫ్యామిలీలో ఎంత మందో తెలుసా ?

కొడుకు నిఖిల్ కుమారస్వామి పెళ్లి విషయంపై మాజీ సీఎం హెచ్.డీ. కుమారస్వామి మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ తాండవం చేస్తున్న సందర్బంగా తన కుమారుడు నిఖిల్ వివాహం ఇంట్లోనే సర్వసాధారణంగా చెయ్యాలని భావించామని మాజీ సీఎం కుమారస్వామి అన్నారు. తన సోదరులు, వారి కుటుంబ సభ్యులు, తన అక్క చెల్లెళ్లు, బావలు బావమరుదులు, తన కుటుంబ సభ్యులు, పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులు అందరూ కలిపితే సుమారు 70 మందికి పైగా ఉన్నారని, అంత మంది ఒకే చోట కలవడం మంచిదికాదని భావించామని మాజీ సీఎం కుమారస్వామి చెప్పారు.

 కరోనా నియమాలు పాటించాలి కదా !

కరోనా నియమాలు పాటించాలి కదా !

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాధి తాండవం చేస్తోందని, ఈ సందర్బంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర ప్రభుత్వం శుభకార్యాలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని సూచించదని, ఆ నియమాలు పాటించడం మన కర్తవ్యం అని మాజీ సీఎం కుమారస్వామి చెప్పారు. మొదట బెంగళూరులోని మా నివాసంలో పెళ్లి చెయ్యాలని నిర్ణయించామని, అయితే బెంగళూరు కరోనా రెడ్ జోన్ కావడంతో అక్కడ నిఖిల్ వివాహం చెయ్యకూడదని నిర్ణయించామని మాజీ సీఎం హెచ్.డీ. కుమారస్వామి వివరించారు.

 కరోనా రెడ్ జోన్ కాదు గ్రీన్ జోన్

కరోనా రెడ్ జోన్ కాదు గ్రీన్ జోన్

మొదటి నుంచి తనకు ఎంతో ఇష్టమైన ప్రాంతం, తనను అభిమానించే లక్షల మంది ప్రజలు ఉన్న రామనగరలోనే తన కుమారుడు నిఖిల్ పెళ్లి చెయ్యాలని తన మనుసులో ఉండేదని, చివరికి అలాగే జరుగుతోందని మాజీ సీఎం కుమారస్వామి అన్నారు. దేవుడి దయవలన రామనగర కరోనా గ్రీన్ జోన్ జాబితాలో ఉందని. ఇక్కడే నిఖిల్ పెళ్లి చెయ్యాలని తన కుటుంబ సభ్యులు చివరి నిమిషంలో నిర్ణయించారని మాజీ సీఎం హెచ్.డీ. కుమారస్వామి వివరించారు.

 అందరూ క్షమించండి

అందరూ క్షమించండి

శుక్రవారం (రేపు) బెంగళూరులో జరగవలసిన మాజీ సీఎం కుమారస్వామి కుమారుడు, ప్రముఖ హీరో నిఖిల్ వివాహ వేదిక ఇప్పుడు రామనగర జిల్లాకు మారింది. రామనగర జిల్లాలోని కేతిగానహళ్ళిలో మాజీ సీఎం కుమారస్వామి ఫాం హౌస్ లో నిఖిల్ కుమారస్వామి వివాహం చెయ్యడానికి సర్వసాధారణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తన కుమారుడు నిఖిల్ పెళ్లికి అహ్వానించలేదని తన సన్నిహితులు, జేడీఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భాదపడకూడదని, పరిస్థితి అర్థం చేసుకుని అందరూ తనను పెద్ద మనుసుతో క్షమించాలని మాజీ సీఎం కుమారస్వామి మనవి చేశారు.

 గ్రాండ్ గా పార్టీ ఇస్తాం

గ్రాండ్ గా పార్టీ ఇస్తాం

తన కుమారుడు నిఖిల్ పెళ్లి కారణంగా రామనగర జిల్లా ప్రజలకు ఎలాంటి కరోనా వైరస్ ఇబ్బందులు ఎదురుకాకుండా కేవలం తన కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం జరిపించాలని నిర్ణయించామని మాజీ సీఎం కుమారస్వామి మీడియాకు చెప్పారు. తన కుమారుడు నిఖిల్ పెళ్లి సందర్బంగా మీరు అందరూ మీ ఇళ్ల నుంచే నవ దంపతులను ఆశీర్వదించాలని, కరోనా వైరస్ కట్టడి అయిన తరువాత అందరినీ పిలిచి గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేసి అందరికి విందు ఇస్తామని, అంత వరకు అందరూ ఓపికగా ఉండాలని మాజీ సీఎం కుమారస్వామి జేడీఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు మనవి చేశారు.

Recommended Video

Fake News Buster : 05 కాణిపాకం గుడి క్వారంటైన్ సెంటరా ? బాంద్రా లో జరిగిన దానికి కారణం ఫేక్ న్యూస్
 కరోనా ఇబ్బందులు ఎదురు కానివ్వం !

కరోనా ఇబ్బందులు ఎదురు కానివ్వం !

కరోనా వైరస్ నియమాలు ఉల్లంఘించకుండా అన్ని నియమాలు పాటించి రామనగర ప్రజలకు ఎలాంటి కరోనా కష్టాలు ఎదురుకాకుండా తన కుమారుడు నిఖిల్ పెళ్లి జరిపిస్తామని మాజీ సీఎం హెచ్.డీ. కుమారస్వామి స్పష్టం చేశారు. మొత్తం మీద కరోనా కాలంలో మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ మనుమడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ. కుమారస్వామి కుమారుడు, స్టార్ హీరో నిఖిల్ కుమారస్వామి వివాహం అనుకున్న ముహూర్తానికే బెంగళూరులో కాకుండా రామనగరలో జరుగుతున్నది. రామనగర జిల్లా ప్రజలకు ఎలాంటి కరోనా వైరస్ కష్టాలు ఎదురుకాకుండా తన కుమారుడు నిఖిల్ వివాహం జరిపిస్తామని మాజీ సీఎం హెచ్.డీ. కుమారస్వామి రామనగర జిల్లా ప్రజలకు హామీ ఇచ్చారు.

English summary
Coronavirus Lockdown: Just One Day Before Son Nikhil Kumaraswamy Marriage, Karnataka former CM HD Kumaraswamy Changed The Venue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X