బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శశికళకు పూర్తి సమాచారం ఇచ్చిన జస్టిస్: ఇక బెంగళూరు జైల్లో, మౌనవ్రతం పూర్తి అయితే!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనుమానాస్పద మృతి విషయంపై విచారణ చేస్తున్న మద్రాసు హైకోర్టు రిటైడ్ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ శశికళ గొంతెమ్మ కోర్కెలకు సమాధానం ఇచ్చారు. ఇక బెంగళూరు జైల్లో శశికళను విచారణ చెయ్యడానికి రంగం సిద్దం చేస్తున్నారు.

శశికళ డిమాండ్లు

శశికళ డిమాండ్లు

తనను విచారణ చెయ్యాలంటే తన మీద ఎవరు ఫిర్యాదు చేశారు చెప్పాలి, సాక్షులు, ఫిర్యాదు చేసిన వారిని తన న్యాయవాదులు విచారణ చెయ్యడానికి అవకాశం ఇవ్వాలి, తరువాత మీరే చేపట్టే విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని శశికళ డిమాండ్ చేశారు.

Recommended Video

జయలలిత మృతిపై కామెంట్.. శశికళ ఫ్యామిలీలో చిచ్చు !
 శశికళకు సమాచారం

శశికళకు సమాచారం

శశికళ డిమాండ్ లు పరిశీలించిన జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ సాక్షులను విచారణ చెయ్యడానికి శశికళ న్యాయవాదులకు అవకాశం ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే విచారణ ఎప్పటి నుంచి ఉంటుంది అనే విషయం నేరుగా శశికళకు సమాచారం ఇచ్చారని తెలిసింది.

పెన్ డ్రైవ్, వీడియో!

పెన్ డ్రైవ్, వీడియో!

శశికళ టీటీవీ దినకరన్, న్యాయవాదుల దగ్గర ఇప్పటికే ఓ పెన్ డ్రైవ్, వీడియో ను జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ కు అందించారు. వాటిని పరిశీలించిన జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ శశికళ డిమాండ్ లు పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది.

 మౌనవ్రతం పూర్తి అయితే?

మౌనవ్రతం పూర్తి అయితే?

తన మీద ఫిర్యాదు చేసిన వారి వివరాలు వెలుగు చూస్తే వారి మీద ఎలా పగ తీర్చుకోవాలి అనే విషయం తరువాత ఆలోచిస్తానని శశికళ ఆమె సన్నిహితుల దగ్గర చెప్పారని తెలిసింది. మొత్తం మీద మౌనవ్రతం పూర్తి అయితే శశికళను ఆర్ముగస్వామి విచారణ కమిషన్ విచారణ చేసే అవకాశం ఉంటుంది.

బెంగళూరు జైల్లో!

బెంగళూరు జైల్లో!

శశికళను విచారణ చెయ్యడానికి అవకాశం ఇవ్వాలని ఆర్ముగస్వామి విచారణ కమిషన్ బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు అధికారులకు ఇప్పటికే లేఖ రాశారు. బెంగళూరు సెంట్రల్ జైల్లోనే శశికళను విచారణ చెయ్యాలని ఆర్ముగస్వామి విచారణ కమిషన్ నిర్ణయించింది.

English summary
Justice Arumugasamy commission has provided the details to Sasikala as sought by her counsel.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X