హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

justice for disha:దిశ కోసం దేశవ్యాప్తంగా నిరసనల హోరు, నిందితులకు ఉరే సరి..

|
Google Oneindia TeluguNews

దిశ ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. ఊరు, వాడ అనే తేడా లేకుండా నిరసనలతో హొరెత్తిస్తున్నారు. మెట్రోపాలిటన్ నగరాల్లో విద్యార్థులు వి వాంట్ జస్టిస్ దిశ అంటూ గొంతెత్తి నినదిస్తున్నారు. వందలాది మంది వీధుల్లో ర్యాలీలు తీసి నిరసన తెలుపుతున్నారు. సోమవారం పార్లమెంట్‌లో కూడా దిశ అంశంతో అట్టుడికిపోయింది.

దిశ హంతకులకు కఠిన శిక్ష, చట్టం చేసేందుకు రెడీ:లోక్‌సభలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్దిశ హంతకులకు కఠిన శిక్ష, చట్టం చేసేందుకు రెడీ:లోక్‌సభలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్

వి వాంట్ జస్టిస్

వి వాంట్ జస్టిస్

దిశ హత్య కేసు నలుగురు నిందితులకు తక్షణమే ఉరి శిక్ష విధించాలని కోరుతున్నారు. వి వాంట్ జస్టిస్ అంటూ ప్ల కార్డులతో నిరసన తెలియజేస్తున్నారు. హైదరాబాద్‌లో ఆందోళన పర్వం సోమవారం కూడా కొనసాగింది. నిందితులు ఉన్న చర్లపల్లి జైలు వద్దకు భారీగా జనం తరలొచ్చారు. వారిని తమకు ఐదు నిమిషాలు అప్పగించాలని కోరుతున్నారు.

ఢిల్లీలో..

ఢిల్లీలో..

ఢిల్లీలో విద్యార్థులు దిశ కుటుంబానికి న్యాయం చేయాలని నిరసన చేపట్టారు. జంతర్ మంతర్ వద్ద నినాదాలతో హోరెత్తించారు. దిశ హత్య కేసు నిందితులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. లైంగికదాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునే చట్టాలు చేయాలనే డిమాండ్ తెరపైకి తీసుకొచ్చారు.

కోల్‌కతాలో..

కోల్‌కతాలో..


కోల్‌కతాలో కూడా విద్యార్థులు నిరసనలు కొనసాగాయి. వీ వాంట్ జస్టిస్.. జస్టిస్ ఫర్ దిశ అంటూ నినాదాలు చేశారు. ప్రధాన వీధులగుండా నిరసనలు కొనసాయి. విద్యార్థుల నిరసనకు ప్రజాసంఘాలు, మేధావులు కూడా మద్దతు తెలిపారు.

బెంగళూరులో..

బెంగళూరులో..

ఐటీ హబ్ బెంగళూరులో కూడా నిరసనలు మిన్నంటాయి. లైంగికదాడి ఘటనలపై గొంతెత్తి నినాదించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఇటు లక్నో, చండీగడ్ సహా ఇతర ప్రాంతాల్లో కూడా దిశ కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.

సమానమే కదా..

సమానమే కదా..


సమాజ అభివృద్ధిలో పురుషులతో సమానంగా మహిళలకు హక్కులు ఉన్నాయని కొందరు మేధావులు చెప్తున్నారు. కానీ సమాజంలో మాత్రం మహిళలకు సరైన ప్రాధాన్యం లేదన్నారు. చులకనగా చూడటంతోనే సమస్య వస్తుందని చెప్పారు. మరికొందరు ఇంటి వద్దనే దాడులకు గురవతున్నారని చెప్పారు. ఇది హేయనీయమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు.

English summary
youth agitation on disha issue. countrwide agitation on monday. they demand culprit will hang
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X