వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మా ఇంటి కోర్టుకు రండి: సుప్రీం కోర్టు జడ్జిలకు కర్ణన్ ఝలక్

కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్ మరో షాక్ ఇచ్చారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)తోపాటు మరో ఆరుగురు జడ్జీలు తన ఎదుట హాజరవ్వాలని జస్టిస్‌ కర్ణన్‌ ఆదేశాలు జారీ చేశారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్ మరో షాక్ ఇచ్చారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)తోపాటు మరో ఆరుగురు జడ్జీలు తన ఎదుట హాజరవ్వాలని జస్టిస్‌ కర్ణన్‌ ఆదేశాలు జారీ చేశారు.

నన్ను జైల్లో పెట్టుకోండి: సుప్రీం కోర్టుకు జస్టిస్ కర్ణన్ సవాల్ నన్ను జైల్లో పెట్టుకోండి: సుప్రీం కోర్టుకు జస్టిస్ కర్ణన్ సవాల్

ఈ నెల 28న తన ఇంటి కోర్టుకు రావాలని పేర్కొన్నారు. వీరంతా ఇంతకుముందు జస్టిస్‌ కర్ణన్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేశారు. ఏడుగురు జడ్జిల ధర్మాసనం తనను ఉద్దేశపూర్వకంగా అవమానించిందని ఆయన పేర్కొన్నారు.

justice karnan

నాపై ఆరోపణలకు వివరణ ఇవ్వాలి

ఎస్సీ,ఎస్టీ వేధింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘిస్తున్నట్లు తాను మోపిన ఆరోపణలపై వారు వివరణ ఇచ్చుకోవాలన్నారు. దళితుడిని కావడం వల్లే తాను వివక్షకు లోనైనట్లు జస్టిస్‌ కర్ణన్‌ ఆరోపిస్తున్నారు.

గురువారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 28న ఉదయం 11.30 గంటలకు ఏడుగురు న్యాయమూర్తులు తన ఇంటి కోర్టులో హాజరు కావాలని, వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు.

తన తాత్కాలిక కోర్టుగా చెబుతున్న నివాసం నుంచే సుమోటు జ్యుడీషియల్‌ ఆదేశాల్ని జారీ చేశారు. మార్చి 31న సీజేఐ జస్టిస్‌ జేఎస్‌ ఖేహర్‌ తన మానసిక ఆరోగ్యాన్ని ప్రశ్నించారనీ, దానిని ధర్మాసనంలోని ఆరుగురు న్యాయమూర్తులు సమర్థించారనీ, అది తనను అవమానించినట్లేనన్నారు.
కాగా, కోర్టు ధిక్కరణ కేసులో మార్చి 31న జస్టిస్‌ కర్ణన్‌ సుప్రీం కోర్టుకు హాజరయ్యారు. ఆయన చాలా రోజులుగా ధిక్కార స్వరం వినిపిస్తున్నారు.

భారత న్యాయ వ్యవస్థ చరిత్రలో ప్రథమం

ఒక హైకోర్డు జడ్జి కోర్టు ధిక్కారం కింద సుప్రీం కోర్టుకు ఎదుట హాజరవడం భారత న్యాయవ్యవస్థ చరిత్రలో ఇదే మొదటిసారి కాగా, చీఫ్ జస్టిస్, మరో ఆరుగురు సుప్రీం న్యాయమూర్తులు తన ఇంటి కోర్టులో హాజరు కావాలని నోటీసులు ఇవ్వడం కూడా ఇదే ప్రథమం.

English summary
In a move probably unprecedented in the country's legal history, Justice CS Karnan of the Calcutta high court said on Thursday that he has passed an order asking Chief Justice of India J S Khehar and six other judges of the Supreme Court to appear before him at his residential court in Kolkata on April 28.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X