వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘కొత్త పార్లమెంట్’ సాక్షిగా ప్రజల హక్కుల్ని కాలరాస్తే ఎలా?: సెంట్రల్ విస్టాపై జస్టిస్ ఖన్నా భిన్న తీర్పు

|
Google Oneindia TeluguNews

''వివిధ అంశాలకు సంబంధించి ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యం యాత్రికంగా లేదా కేవలం లాంఛనప్రాయంగా ఉండకూడదు. ఒక అంశంపై సమాచారాన్ని తెలుసుకునే హక్కు ప్రజలకు ఎంతుంటుందో.. అభ్యంతరాలు లేదా సలహాలు ఇచ్చే హక్కును కూడా కలిగి ఉంటారని మర్చిపోరాదు'' అంటూ సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సంజీవ్ ఖన్నా రాసిన అసమ్మతి తీర్పు ఇప్పుడు చర్చనీయాంశమైంది.

బర్డ్ ఫ్లూ విలయం: చికెన్, గుడ్లు తింటున్నారా? -అన్ని రాష్ట్రాలకు కేంద్రం కీలక మార్గదర్శకాలుబర్డ్ ఫ్లూ విలయం: చికెన్, గుడ్లు తింటున్నారా? -అన్ని రాష్ట్రాలకు కేంద్రం కీలక మార్గదర్శకాలు

దేశంలో నెహ్రూ-గాంధీల పాలనలో కొనసాగిన అన్ని విధానాలు, రూపాలు, సంస్థలను సమూలంగా మార్చేస్తోన్న నరేంద్ర మోదీ సర్కార్.. పార్లమెంటుకు కూడా సరికొత్త భవనాన్ని నిర్మిస్తుండటం తెలిసిందే. రూ.20వేల కోట్ల ఖర్చుతో కేంద్రం చేపడుతున్న వివాదాస్పదమైన సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు మంగళవారం ఆమోదముద్ర వేసింది. కానీ, 2:1 మెజారిటీతో వెలువడిన తీర్పులో మెజార్టీతో విభేదించిన జస్టిస్‌ ఖన్నా వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

 Justice Khanna dissent on Central Vista project: Must make intelligible information public

బెంచ్‌లో జస్టిస్‌ ఏఎం ఖాన్విల్కర్‌, జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి 432 పేజీల మేర అనుకూలమైన తీర్పు రాయగా, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా మాత్రం కొన్ని అంశాల్లో విభేదిస్తూ 179- పేజీలతో విడిగా తీర్పు రాశారు. ప్రాజెక్టుకు బిడ్ల ఆహ్వానం, కాంట్రాక్టుల మంజూరుపై మాత్రం ఆయన మిగిలిన జడ్జీలతో ఏకీభవించారు. ప్రధానంగా ప్రజల నుంచి సేకరించాల్సిన అభిప్రాయాలు, సలహాలు, సూచనల విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరును జస్టిస్ ఖన్నా తప్పుపట్టారు.

సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టు కోసం భూవినియోగ మార్పులు చట్టరీత్యా లోపభూయిష్టమని, భూమి వినియోగంపై వస్తున్న సందేహాలపై తనకు భిన్నాభిప్రాయం ఉందని, ముందుగా హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీ అనుమతి కూడా తీసుకోలేదని, ప్రజలు లేదా స్థానికుల నుంచి అభిప్రాయాలు తీసుకునే ప్రక్రియను తూతూమంత్రంగా చేపట్టడం శోచనీయమని జస్టిస్‌ ఖన్నా అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వ నిర్ణయాల్లో ప్రజల భాగస్వామ్యం యాంత్రికంగా ఉండరాదన్న జస్టిస్ ఖన్నా.. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు ప్రణాళికను తయారు చేసి, దాన్ని కేంద్రం ఆమోదించడానికి ముందు.. ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (డిడిఎ) చట్టం ప్రకారం, ప్రజల నుంచి అభ్యంతరాలు లేదా సలహాలు ఆహ్వానించాల్సిన అవసరం ఉందని, ముసాయిదా మాస్టర్ ప్లాన్‌కు సంబంధించిన ప్రాతినిధ్యాలను కనీసం పరిగణలోకైనా తీసుకోవడానికి అథారిటీ బోర్డు ఆఫ్ ఎంక్వైరీ అండ్ హియరింగ్ ను నియమించాల్సిందని ఆయన తీర్పులో పేర్కొన్నారు.

హిందూపురం: బాలయ్యకు షాక్ -జగన్ కుటుంబ చరిత్రే అంత -ప్రత్యేక రాష్ట్రం తేస్తానని హామీహిందూపురం: బాలయ్యకు షాక్ -జగన్ కుటుంబ చరిత్రే అంత -ప్రత్యేక రాష్ట్రం తేస్తానని హామీ

జస్టిస్ ఖన్నా విభేదించినప్పటికీ త్రిసభ్య ధర్మాసనంలోని మెజారిటీ జడ్జీల వాదనే చెల్లుబాటవుతుంది గనక ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. న్యూఢిల్లీలో రాష్ట్రపతి భవన్‌ నుంచి ఇండియాగేట్‌ దాకా ఉన్న మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న 86 ఎకరాల ప్రాంతానికి కొత్త రూపురేఖలు సంతరించడం సెంట్రల్ విస్టా ప్రాజెక్టు లక్ష్యం. అందులో భాగంగానే గరిష్టంగా 1200 మంది ఎంపీలు కూర్చోడానికి వీలైన కొత్త పార్లమెంటు, అనుబంధ భవనాలు త్రిభుజాకృతిలో నిర్మితమవుతాయి. 2022 ఆగస్టునాటికి దీనిని సిద్ధం చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ సంకల్పంతో ఉంది.

English summary
HOLDING that public participation cannot be a mechanical exercise or formality in a decision-making process, Justice Sanjiv Khanna, in a dissenting judgment on the Central Vista project matter, Tuesday said that the right to make objections and suggestions will also include the right to have intelligible and adequate information regarding the proposal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X