వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా రంజన్ గొగొయ్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ పేరును ప్రస్తుత చీఫ్‌ జస్టిస్‌ దీపిక్‌ మిశ్రా సిఫార్సు చేసినట్లు తెలిసింది. మిశ్రా పదవీ కాలం వచ్చే అక్టోబరు 2వ తేదీతో ముగియనుంది.

ఈ నేపథ్యంలోనే తదుపరి సీజేఐగా ఎవరిని నియమించాలనే దానిపై ఒకరి పేరును సీజేఐ నెల రోజులు ముందుగానే న్యాయశాఖకు సిఫార్సు చేయాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా జస్టిస్‌ గొగొయ్‌ పేరును ప్రతిపాదించారు.

 Justice Misra recommends Justice Gogoi as next CJI

ఇందుకు కేంద్ర న్యాయశాఖ ఆమోదం పొందిన అనంతరం తదుపరి సీజేఐగా జస్టిస్‌ గొగొయ్‌ నియమితులు కానున్నారు. అదే జరిగితే అక్టోబరు 3న ఆయన నూతన సీజేఐగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది.

జస్టిస్‌ గొగొయ్‌ 2001, ఫిబ్రవరి 28న గువాహటి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాత ఆయన పంజాబ్‌, హర్యానా హైకోర్టుకు చీఫ్‌ జస్టిస్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2012లో సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా చేరారు.

English summary
Justice Ranjan Gogoi to become the next Chief Justice of India. According to reports, he will take oath on October 3. As per procedure, the papers regarding the recommendation are being prepared and it will be sent to the Law Ministry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X