వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత తొలి లోక్‌పాల్‌గా జస్టిస్ పీసీ ఘోష్...ఆమోదం తెలిపిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: దేశంలోనే తొలిసారిగా లోక్‌పాల్ ఏర్పాటు అయ్యింది. అవినీతికి అడ్డుకట్టు వేసేందుకు లోక్‌పాల్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మేరకు లోక్‌పాల్ తొలి ఛీఫ్‌గా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీ పినాకి చంద్రఘోష్‌ను నియమించారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.ఇక లోక్‌పాల్‌లో జ్యుడిషియల్ సభ్యులుగా జస్టిస్ దిలీప్ బీ భోసలే, జస్టిస్ పీకే మొహంతి, జస్టిస్ అభిలాష కుమారి, జస్టిస్ ఏకే త్రిపాఠీలను రాష్ట్రపతి నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దినేష్ కుమార్ జైన్, అర్చన రామసుందరం, మహేంద్ర సింగ్, ఐపీ గౌతమ్‌లను సభ్యులుగా అప్పాయింట్ చేశారు రామ్‌నాథ్ కోవింద్.

Justice Pinaki Chandra Ghose appointed first Lokpal of India

2014 జనవరి 16న లోక్‌పాల్ చట్టం నోటిఫై చేసిన ఐదేళ్ల తర్వాత లోక్‌పాల్ ఛీఫ్‌గా జస్టిస్ పీసీ ఘోష్‌ను నియమించడం విశేషం. ఇక లోక్‌పాల్‌ అవినీతిపై కొరడా ఝుళిపిస్తుంది. ఇందులో ముగ్గురు సభ్యులు ఉంటారు. వీరిలో ఒకరు ఛైర్మెన్‌, ఒకరు జ్యుడిషియల్ సభ్యులు మరొకరు నాన్-జ్యుడిషియల్ సభ్యులుగా ఉంటారు. లోక్‌పాల్‌లో మొత్తం 8 మంది సభ్యులు ఉంటారు. ఇందులో హైకోర్టు మాజీ జడ్జీలు, మాజీ సివిల్ సర్వీసెస్ అధికారులు ఉంటారు.

వాట్ ఏ ఛాలెంజ్: మోడీకి అమిత్ షాలకు మమతా విసిరిన సవాల్ ఏంటో తెలుసా..? వాట్ ఏ ఛాలెంజ్: మోడీకి అమిత్ షాలకు మమతా విసిరిన సవాల్ ఏంటో తెలుసా..?

ప్రభుత్వ అధికారులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై కేంద్రంలో అయితే లోక్‌పాల్ విచారణ చేస్తుంది అదే రాష్ట్రంలో అయితే లోకాయుక్తాలు విచారణ చేస్తాయి. మార్చి 17న ప్రధాని నరేంద్ర మోడీ, సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్, ప్రముఖ జ్యూరీ సభ్యులు ముకుల్ రోహత్గీలు సమావేశమై జస్టిస్ పీసీ ఘోష్‌ను లోక్‌పాల్‌కు పేరును ప్రతిపాదించారు. అయితే ఈ సమావేశానికి విపక్షనేత మల్లికార్జున ఖర్గే హాజరు కాలేదు.

English summary
Retired Supreme Court judge Pinaki Chandra Ghose was on Tuesday appointed the first Lokpal of India or anti-corruption watchdog by President Ram Nath Kovind. Justice Dilip B Bhosale, Justice P K Mohanty, Justice Abhilasha Kumari and Justice AK Tripathi have been appointed as the judicial members.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X