వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాపం చిదంబరం: రెండ్రోజుల్లో రిటైర్ కానున్న జడ్జి..అంతలోనే ఇలా..ఇంతకీ జడ్జి ఎవరు?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్రమాజీ మంత్రి చిదంబరంకు ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ముందస్తు బెయిల్ నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ఆ తర్వాత చిదంబరం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న కేంద్ర మాజీ మంత్రి కోసం సీబీఐ వేట కొనసాగిస్తోంది. అయితే చిదంబరంకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు జడ్జి ఎవరో తెలుసా..?

కేంద్రమాజీ మంత్రి చిదంబరం అజ్ఞాతంలోకి వెళ్లారంటే అందుకు కారణం జస్టిస్ సునీల్ గౌర్ చిదంబరంకు బెయిల్ నిరాకరించడమే. జస్టిస్ సునీల్ గౌర్ మరో 48 గంటల్లో రిటైర్ అవుతారు. అంతకుముందు ఓ ముఖ్య కేసులో ముఖ్యనేతకు బెయిల్ నిరాకరించడంతో ఒక్కసారిగా ప్రధానవార్తల్లో నిలిచారు జస్టిస్ సునీల్ గౌర్. ఈ కేసు తీర్పును చదివిన ఆయన... కేసు పూర్వాపరాలు పరిశీలిస్తే ఈ కేసులో పిటిషనర్ అయిన చిదంబరమే కుట్రదారుడుగా తెలుస్తోందని చెబుతూ ఆయనకు బెయిల్ ఇవ్వలేమని వెల్లడించారు. బెయిల్ ఇస్తే సమాజంకు తప్పుడు సంకేతాలు వెళతాయని ఆయన భావించి బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించారు. ఐఎన్ఎక్స్ మీడియాకు ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చింది. ఆ సమయంలో చిదంబరం కేంద్ర ఆర్థికశాఖ మంత్రిగా ఉన్నారు.

Justice Sunil Gaur Who rejected Chidambarams anticipatory bail retires on Friday

2007లో సీబీఐ ఈడీలు ఐఎన్ఎక్స్ మీడియాలో జరిగిన గోల్‌మాల్‌పై విచారణ చేస్తున్నాయి. ఆ సమయంలో చిదంబరం కొడుకు కార్తీ బోర్డు క్లియరెన్స్‌లను ఎలా మేనేజ్‌ చేశారనేదానిపై కూడా ఆరా తీస్తున్నారు. అయితే కార్తీని గతేడాది ఫిబ్రవరి 28న సీబీఐ అరెస్టు చేసింది. FIPB క్లియరెన్స్ కోసం ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలు కార్తీపై ఉన్నాయి. ఇదిలా ఉంటే జస్టిస్ సునీల్ గౌర్ మరో హైప్రొఫైల్ కేసు కూడా మంగళవారం విచారణ చేశారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ అల్లుడు రతుల్ పూరీ ఓ బ్యాంకును మోసం చేసిన కేసును జస్టిస్ సునీల్ గౌర్ విచారణ చేశారు. 1984లో పంజాబ్ హర్యానా హైకోర్టులో తన కెరీర్‌ను ప్రారంభించారు. 1995లో ఢిల్లీ హైయర్ జ్యుడీషియల్ సర్వీసులో చేరారు. ఇక 2008 నుంచి హైకోర్టు జడ్జిగా జస్టిస్ సునీల్ గౌర్ ఉన్నారు.

English summary
Former finance minister P Chidambaram was denied protection from arrest today in the INX Media case with a Delhi High Court judge saying "the facts of the case prima facie reveal that the petitioner is the kingpin, the key conspirator."Justice Sunil Gaur, who is set to retire within 48 hours on Friday called it a "classic case of money laundering" and said granting bail would send a wrong message to the society.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X