వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొడుకును తిరిగివ్వలేరు: రాకీని ఉరితీయాలని ఆదిత్య తల్లిదండ్రులు

|
Google Oneindia TeluguNews

పాట్నా: ఆదిత్యా సచ్‌దేవ్ హత్య కేసులో మూడు రోజుల దర్యాప్తు అనంతరం నిందితుడు, జేడీయూ ఎమ్మెల్సీ కొడుకు రాకీ యాదవ్‌ను గయాలో అరెస్ట్ చేశారు పోలీసులు. కాగా, తన కొడుకు ఏ నేరం చేయలేదని రాకీ యాదవ్ తల్లి, ఎమ్మెల్సీ మనోరమా దేవి చెబుతున్నారు.

గత శనివారం(మే7)న ఈ ఘటన జరగిన సమయంలో తన కుమారుడు రాకీ యాదవ్ ఢిల్లీలో ఉన్నాడని ఆమె చెప్పుకొచ్చారు. గయా-బోధ్ గయా రోడ్డు మార్గంలో తన వాహనాన్ని ఓవర్ టేక్ చేశారనే కారణంతో రమాదేవి కుమారుడు రాకీ యాదవ్.. 19ఏళ్ల ఆదిత్యను తుపాకీతో కాల్చి చంపాడు.

ఆదిత్యా తల్లి వన్ఇండియాతో మాట్లాడుతూ.. తన కుమారుడ్ని హత్య చేసిన నిందితుడికి కఠినమైన శిక్ష పడాలని అన్నారు. 'ఒక తల్లి ఏం చేస్తుంది. ఆదిత్య మా జీవితంలోకి ఇక రాడు. ఫాస్ట్ ట్రాక్ విచారణ జరిపి రాకీ యాదవ్‌కు కఠినమైన శిక్ష విధించాలి' అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

#JusticeforAditya: Want fast track trial in my son's murder case, pleads Aditya's mother

సాధారణ ప్రజలకు, వీవీఐపీలకు మధ్య చట్టం, న్యాయం ఎందుకు తేడా చూపిస్తోందని ప్రశ్నించారు. ఆదిత్యను చంపలేదంటున్న రాకీ యాదవ్‌కు లై డిటేక్టర్(సత్య శోధన) పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

బీహార్ మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ తమ వద్దకు వచ్చి నిందితుడికి శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారని ఆమె తెలిపారు. కాగా, తన కొడుకును హత్య చేసిన రాకీ కుమార్ యాదవ్‌ను అరెస్ట్ చేస్తే సరిపోదని, వెంటనే ఉరితీయాలని ఆదిత్య తండ్రి డిమాండ్ చేశారు. అరెస్ట్ చేస్తే 6నెలల్లో తిరిగి బయటికి వస్తాడని, ఉరితీస్తేనే ఇలాంటి ఘటనలు పునరావృతం కావని చెప్పారు.

జేడీయూ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ మాట్లాడుతూ.. ఆదిత్య హత్యకు కారణమైన రాకీ కుమార్ యాదవ్, అతడి తండ్రి బిండీ యాదవ్‌లను అరెస్ట్ చేయించామని తెలిపారు. ఆదిత్యకు న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు.
చట్టానికి ఎవరూ అతీతులు కారని, నితీష్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు రక్షణ ఉంటుందని స్పష్టం చేశారు.

English summary
After three days of investigation and raids in Aditya Sachdeva murder case, the accused Rocky Yadav has finally been arrested by police in Gaya, Bihar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X