వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నిన్న తాజ్ మహల్, నేడు సబర్మతీలో కెనడా ప్రధాని, ఫ్యామిలీ, మోడీ రాకపోవడంపై ఇలా..
ఆగ్రా: కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో ఆదివారం తాజ్ మహల్‌ను సందర్శించారు. ఆయన వెంట భార్య సోఫీ ట్రూడో, పిల్లలు ఎల్లా - గ్రేస్ మార్గరెట్, హాడ్రిన్, గ్లేజివియర్ జేమ్స్ ఉన్నారు. తాజ్‌ను సందర్శించడం సంతోషంగా ఉందని వారు అన్నారు.
వారి సందర్శన సమయంలో కాసేపు ఇతర సందర్శకులకు అనుమతివ్వలేదు. వారం రోజుల పర్యటన నిమిత్తం శనివారం వారు భారత్ వచ్చారు. పర్యటనలో భాగంగా శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీతో ట్రుడో చర్చలు జరపనున్నారు.

కాగా, ట్రూడో కుటుంబం సోమవారం గుజరాత్లో పర్యటించింది. అహ్మదాబాదులో వారికి ఘన స్వాగతం లభించింది. వారు సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు.
ట్రూడో గుజరాత్లో పర్యటిస్తున్న సమయంలో ప్రధాని మోడీ ఆయన వెంట లేరని కొన్ని మీడియా కథనాలు వచ్చాయి. దీనిపై ప్రభుత్వ వర్గాలు స్పందిస్తూ.. అన్ని సందర్భాల్లో ప్రధాని మోడీ వెళ్లలేరని చెప్పారు.