వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిగిలింది ఉరి..... నిర్భయ నిందితుడి పిటిషన్ కొట్టివేసిన కోర్టు

|
Google Oneindia TeluguNews

నిర్భయ కేసులో తాను మైనర్‌నంటూ... నేరాన్ని అంగీకరించినా.... తన వయస్సును నిర్ధారించకుండానే ఉరి శిక్షను ఖారారు చేశారంటూ...నిందితుల్లో ఒకడైన పవన్ గుప్త వేసిన పిటిషన్‌‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. దీంతో నిర్భయ నిందితుల ఉరిశిక్ష అమలు చేసేందుకు న్యాయపరంగా ఉన్న అడ్డంకులన్ని తొలగిపోయినట్టయింది.

డెత్ వారెంట్ జారీలో జాప్యం: విచారణ జనవరి 7కు వాయిదా: మా కడుపుకోత పట్టదా: నిర్భయ తల్లి డెత్ వారెంట్ జారీలో జాప్యం: విచారణ జనవరి 7కు వాయిదా: మా కడుపుకోత పట్టదా: నిర్భయ తల్లి

మరోవైపు నిందితుడి వయస్సుపై తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన న్యాయవాది ఏపీ సింగ్‌కు 25 వేల రూపాయల జరిమాన విధించింది. ముఖ్యంగా అఫిడవిట్ దాఖలు చేసిన న్యాయవాది కోర్టులో హజరు కావాల్సిందిగా కోర్టు పలుసార్లు కొరినా నిజాన్ని దాచిపెట్టి కోర్టుకు హజరుకానందుకు ఈ జరిమానాను విధించినట్టు తెలిపింది. మరోవైపు అతనిపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీ కూడ చర్యలు తీసుకోవాలని కోరింది.

Juvenile plea was dismissed in the Nirbhaya case

కాగా నిర్భయ కేసులో దోషులకు మరికొద్ది రోజుల్లో శిక్షపడనుందని , అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను సుప్రీం కోర్టు పరీశీలిస్తుంది. ఈ నేపథ్యంలోనే నిందితులు పెట్టుకున్న రివ్యూ పిటిషన్‌ను కూడ సుప్రీం కోర్టు కొట్టివేసింది. అయితే వారికి క్షమాబిక్ష కోరేందుకు వారంపాటు గడవు ఇచ్చింది. దీంతో నూతన సంవత్సరంలో దోషులకు ఉరిశిక్షలు పడే అవకాశాలు ఉన్నాయి. కాగా నిందితుల్లో ఒకరు అక్షయ్ సింగ్ రివ్యూపిటిషన్ కొట్టివేసిన తర్వాతా ఢిల్లీ కోర్టులో పవన్ గుప్తా కేసు వేయడంతో కొంత ఉత్కంఠ నెలకొనగా కోర్టు తీర్పుతో నిర్భయ తల్లిదండ్రులకు పూర్తి న్యాయం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

English summary
The claim of one of the four convicts sentenced to death in the Nirbhaya case that he was below 18 when at the time of the gang-rape and murder in 2012, was dismissed by the Delhi High Court
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X