• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రాహుల్ గాంధీకి పదవి దక్కే అవకాశం లేదా: జ్యోతిష్య పండితులు ఏం చెబుతున్నారంటే?

|

డా.యం.ఎన్.చార్య - ఫోన్: 9440611151

సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. మళ్లీ ఎన్డీయేనే అధికారంలోకి వస్తుందని, నరేంద్ర మోడీయే రెండోసారి ప్రధాని అవుతారని పలు ప్రీపోల్ సర్వేలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ 2014 కంటే పుంజుకుంటుందని, అయినప్పటికీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ఈ సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో జ్యోతిష్య పండితులు కూడా ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే అంచనా వేస్తున్నారు. బీజేపీకి గెలుపు అంత సులువు కాదని చెబుతున్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు గట్టి పోటీ ఇస్తాయని, కానీ అధికారం మాత్రం బీజేపీదే అంటున్నారు.

మోడీ కారణజన్ముడా, ప్రముఖులకు ఓటమి తప్పదా?: జ్యోతిష్య పండితులు ఏం చెబుతున్నారంటే?

రాహుల్ గాంధీ జాతక విశ్లేషణ

రాహుల్ గాంధీ జాతక విశ్లేషణ

రాహుల్ గాంధీ గారి జన్మ వివరాల ప్రకారం వారు 19-06-1970, జన్మ సమయం 14:28 Pm. జన్మస్థలం ఢిల్లీ. ఆనాటి పంచాంగ ప్రకారం శ్రీ సాధారణ నామ సంవత్సరం, జ్యేష్ట మాసం, శుక్రవారం, శుక్ల పక్షమి పౌర్ణమి తిధి, మూలా నక్షత్రం మొదటి పాదం. ధనుస్సు రాశి, తులా లగ్నం. జన్మకాలదశ కేతు మహర్దశతో ప్రారంభమైనది. ప్రస్తుత దశ కుజమహర్ధశలో చంద్రుని అంతర్ధశ నడుస్తుంది. 15-4-2019 నుండి 26-12-2021 వరకు రాహు మహర్ధశలో రాహువు అంతర్ధశ ఉంటుంది.

ఏలినాటి శని రెండవ పర్యాయం

ఏలినాటి శని రెండవ పర్యాయం

గోచారరిత్య ఏలినాటి శని రెండవ పర్యాయం నడుస్తుంది. రాహుల్ గాంధీ గారి జన్మ కుండలిలోని ద్వాదశ భావాలలో గ్రహా స్థానాల ప్రకారంగా, గ్రహ దృష్టులు, షడ్భలాల ప్రకారం, దశమ భావం కర్కాటక రాశి అయ్యింది. దశమాధిపతి తృతీయ స్థానం ఉండటం, దశమ భావంలో శుక్రుడు అతి శత్రువై ఉన్నాడు. గోచార గ్రహ స్థితి రిత్య 27-3-2019 నుండి 27-5-2019 వరకు సప్తమ శుక్రుడు శుభకరంగా ఉన్ననూ.. ప్రస్తుత దశ అంతర్ధశ అంత అనుకూలంగా లేకపోవడం వలన రాజకీయంగా గతం కంటే మెరుగుగా ఉంటుంది. ప్రజాకర్షణ ఉంటుంది కాని ఆశించినంత అధికార అనుకూలతలు కనబడవు. గట్టి పోటీలో నిలబడతారు కాని పదవి దక్కే అవకాశం కనబడటం లేదు.

జాతకం బాగుంటే సరిపోదు

జాతకం బాగుంటే సరిపోదు

గమనిక:- ఎలక్షన్లలో పోటీ చేసే వ్యక్తి యొక్క పుట్టిన తేదీ ఆధారంగా జాతక చక్రం వేసి, నక్షత్రం, రాశి, లగ్నం ద్వాదశ భావాలలో గ్రహస్థితి గతులు, షట్భలాలు, దృష్టులు, యోగాలు, గోచార గ్రహస్థితి మొదలగునవి ఎన్నో పరిశీలిస్తే కాని ఫలితాలు చెప్పలేము. మా గురువుల శుభాశీస్సుల వలన మరియు, ఉపాసన బలం, శాస్త్రంపై పఠీష్టమైన కృషి వలన నాకున్న పరిజ్ఞానంతో ఈ ఫలితాలు చెప్పడం జరుగుతుంది.

ఇంకో విషయం ఒక ముఖ్య నాయకుడు అధికార పదవి చేపట్టాలి అంటే అతని జాతకం బాగుంటే సరిపోదు. అతనితో పాటు పార్టీలో ఉన్న ఇతర నాయకుల గ్రహ బలం మంచి, చెడు ఫలితాలు ప్రధాన వ్యక్తిపై ప్రభావం తప్పక చూపుతాయి. అలాగే పోటీలో నిలబడుతున్న ప్రతి పక్ష నాయకులందరి వివరాలు తెలియాలి. అన్ని వివరాలు సరిగ్గా ఉంటే సంపూర్ణ విశ్లేషణ చేయడం జరుగుతుంది. గతంలో తెలంగాణలో కెసిఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారు ఆ ఆధారంగానే చెప్పడం జరిగింది.

ఇది దేశ రాజకీయలకే కాదు వ్యక్తీ గత కుటుంబ సభ్యుల యొక్క జాతక మంచి, చెడు ఫలితాలు తప్పక చూపిస్తాయి. ముఖ్యంగా దేశ నాయకులవి, ఇతర ప్రముఖ రంగాల వారివి, సినిమా రంగం వారివి ఎక్కువ శాతం పుట్టిన వివరాలు సరైనవి బహిర్గతం చేయరు.పేరుతో జాతక ఫలితాలు చూసుకోవడం సరైన పద్దతి కాదు. మేము ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వారం కాదు. శాస్త్రంలో ఏమి ఉందో అదే తెలియ జేయడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
What will be the projected date of the 2019 Lok Sabha election? Who will win the 2019 general elections in India and why? Jyothishya Pundits Prediction on Rahul Gandhi for Lok Sabha elections 2019.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more