• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆమె తెగువకు ఊహించని అవకాశం... ఇవాంకా ట్వీట్‌తో దుమారం.. సిగ్గుతో తలదించుకోవాలని!

|

కష్టాలు,కన్నీళ్లు కొంతమందిని కుంగదీస్తాయి. కానీ ఎంత కష్టమొచ్చినా వెరవక తమ తెగువను చూపించేవారు కొందరుంటారు. బీహార్‌కి చెందిన 17 ఏళ్ల జ్యోతి కుమారి రెండో కోవకు చెందుతుంది. లాక్ డౌన్ వేళ ఉపాధి కోల్పోయినా... ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయమని వేధించినా.. ఆమె మానసిక స్థైర్యం కోల్పోలేదు. రోడ్డు ప్రమాదంలో గాయపడి నడవలేని స్థితిలో ఉన్న తండ్రిని చూసి.. హయ్యో మాకు దిక్కేది.. అని కుంగిపోలేదు. ధైర్యం కూడదీసుకుని.. తండ్రిని సైకిల్‌పై ఎక్కించుకుని.. హర్యానాలోని గురుగ్రామ్ నుంచి బీహార్‌లోని తమ స్వస్థలమైన దర్భంగాకు ఏకంగా 1300కి.మీ ప్రయాణించింది. ఆ బాలిక తెగువకు,సాహసానికి మెచ్చి సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సైక్లింగ్‌లో ఆమె ప్రతిభను ప్రపంచానికి చాటేందుకు ముందుకొచ్చింది. ఊహించని ఈ అవకాశం పట్ల జ్యోతి కుమారి సుముఖత వ్యక్తం చేసింది. అన్ని అనుకున్నట్టుగా జరిగితే.. భవిష్యత్తులో భారత్ తరుపున జ్యోతి కుమారిని సైక్లింగ్ రైడర్‌గా చూడవచ్చునేమో..

ఊహించని అవకాశం..

జ్యోతి కుమారి సైక్లింగ్ టాలెంట్‌కు మెరుగులు దిద్ది ఆమెకు శిక్షణ ఇచ్చేందుకు సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ముందుకొచ్చింది. ఆ సంస్థ చైర్మన్ ఓంకార్ సింగ్ మాట్లాడుతూ... 'జ్యోతి కుమారి సైక్లింగ్ సామర్థ్యానికి మేము ఆశ్చర్యపోయాం. తండ్రిని వెనకాల ఎక్కించుకుని 7 రోజుల్లో 1300కి.మీ సైకిల్ తొక్కడం సాధారణ విషయం కాదు. అందుకే సీఎఫ్ఐ ఆమెకు ఒక అవకాశం ఇవ్వాలనుకుంటోంది. తద్వారా ఆమె టాలెంట్‌ను ప్రపంచానికి చాటి చెప్పాలనుకుంటున్నాం.' అన చెప్పుకొచ్చారు.

  Omar Abdullah & Karti Chidambaram Slams Ivanka Trump For Her Tweet On Jyoti Kumari
  జ్యోతిని సంప్రదించిన సైక్లింగ్ ఫెడరేషన్..

  జ్యోతిని సంప్రదించిన సైక్లింగ్ ఫెడరేషన్..

  లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేసిన తర్వాత జ్యోతి కుమారిని తిరిగి ఢిల్లీకి తీసుకొచ్చి.. ఆమె సైక్లింట్ టాలెంట్‌ను పరీక్షిస్తామని ఓంకార్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం దర్భంగాలోని సిర్హులిలో ఆమె హోమ్ క్వారెంటైన్‌లో ఉన్నట్టు చెప్పారు. ఆమెతో తాను ఫోన్‌లో మాట్లాడి సైక్లింగ్ అవకాశాల గురించి వివరించానని... ఢిల్లీ వచ్చేందుకు ఆమె సుముఖత వ్యక్తం చేసిందని తెలిపారు. జ్యోతి కుమారి తల్లి దేవీ మాట్లాడుతూ.. తమ కుమార్తె గతేడాది పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిందని.. మొదట ఆ పరీక్షల్లో పాస్ అవడమే ఆమె మొదటి లక్ష్యం అని ఆమె చెప్పారు.

  ఇవాంకా ట్వీట్‌పై దుమారం...

  మరోవైపు జ్యోతి కుమారిని ప్రశంసిస్తూ ఇవాంకా చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. '15 ఏళ్ల జ్యోతి కుమారి గాయపడిన తన తండ్రిని సైకిల్‌పై ఎక్కించుకుని 7 రోజుల్లో 1,200 కి.మీ ప్రయాణించి స్వగ్రామానికి చేరుకుంది. ఈ బ్యూటిఫుల్ ఫీట్.. భారతీయుల్లోని ప్రేమ,ఓర్పుకు అద్దం పడుతోంది. సైక్లింగ్ సమాఖ్యను ఆమె కట్టిపడేసింది.' అని ఇవాంకా తన ట్వీట్‌లో పేర్కొన్నారు. లాక్ డౌన్ కారణంగా చుట్టుముట్టిన సమస్యల్లో చిక్కుకుపోయిన బాలికను పట్టుకుని.. అదేదో ఆమె థ్రిల్లింగ్ కోసం చేసినట్టు మాట్లాడటం సరికాదంటూ పలువురు నెటిజెన్స్‌ ఇవాంకాకు కౌంటర్ ఇచ్చారు.

  జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సైతం ఇదే అభిప్రాయపడ్డారు. పేదరికంలో,నిస్సహాయతలో 1200కి.మీ ఆమె సైకిల్ తొక్కితే.. అదేదో థ్రిల్లింగ్ కోసం చేసినట్టు కీర్తిస్తున్నారని విమర్శించారు. మాజీ కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం కూడా ఇవాంకా ట్వీట్‌పై స్పందించారు. 'ఇదేమీ సంబరపడాల్సిన ఫీట్ కాదు. మోదీ నాయకత్వ వైఫల్యం వల్ల ఓ బాలిక ఎదుర్కొన్న విపత్కర పరిస్థితులు' అని ట్వీట్ చేశారు. మరికొందరు నెటిజెన్స్ కూడా 'ఇలాంటి విషాదాలను దయచేసి రొమాంటిసైజ్ చేయవద్దని' ఇవాంకాకు విజ్ఞప్తి చేశారు. దేశంలో వలస కూలీలను వారి నిస్సహాయతకు వదిలేసినందుకు మనమంతా సిగ్గుతో తలదించుకోవాలని మరికొందరు ట్వీట్ చేశారు.

  పలువురి ఆర్థిక సాయం..

  పలువురి ఆర్థిక సాయం..

  జ్యోతి కుటుంబం ఆమె తండ్రి సంపాదన పైనే ఆధారపడి జీవిస్తోంది. ఆటో డ్రైవర్‌గా పనిచేసే అతను ఈ ఏడాది జనవరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. అప్పటినుంచి ఆ కుటుంబ పరిస్థితులు మరింత దిగజారాయి. తాజాగా జ్యోతి కుమారి గురించి తెలిసి ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తమకు రూ.1లక్ష సాయం అందించేందుకు ముందుకు వచ్చారని జ్యోతి తల్లి దేవి తెలిపారు. అలాగే జన్ అధికార్ పార్టీ నేత పప్పు యాదవ్ రూ.20వేల ఆర్థిక సాయం అందిస్తామని చెప్పినట్టు పేర్కొన్నారు. దర్భంగా జిల్లా యంత్రాంగం కూడా రూ.11వేలు ఇచ్చేందుకు ముందుకు వచ్చిందన్నారు. స్థానిక పోలీసులు కూడా రూ.5వేలు సాయం అందించేందుకు ముందుకొచ్చినట్టు చెప్పారు.

  బతుకు దెరువు కోసం ఢిల్లీకి..

  జ్యోతి కుటుంబానికి కొద్దిపాటి వ్యవసాయ భూమి ఉంది. ఇందిరా ఆవాజ్ యోజన కింద నిర్మించిన ఇల్లు ఉంది. అయితే బతుకుదెరువు కోసం తండ్రి గురుగ్రామ్ వెళ్లి ఆటో డ్రైవర్‌గా పనిచేస్తుండటంతో.. జ్యోతి కూడా తండ్రికి చేదోడు వాదోడుగా అక్కడే ఉంటోంది. అయితే రోడ్డు ప్రమాదంలో అతను గాయపడటం.. లాక్ డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోవడం జరిగాయి. తండ్రి తన వద్ద ఉన్న చివరి రూ.500తో సరుకులు తీసుకురావాలని చెప్పగా.. జ్యోతి మాత్రం ఆ డబ్బులతో సైకిల్ కొని తెచ్చి తండ్రిని ఎక్కించుకుని ఇంటి బాట పట్టింది. 1300కి.మీ సైకిల్ తొక్కుకుంటూ ఇంటికి చేరిన జ్యోతి కుమారి సాహసానికి ప్రతీ ఒక్కరూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

  English summary
  The Cycling Federation of India on Friday offered trial for Jyoti Kumari, the 15-year-old girl from Bihar, who carried her injured father on a bicycle, covering a distance of 1200 km from Gurugram to Bihar's Darbhanga in six days amid the coronavirus lockdown.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more