వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సింధియా మార్క్ రాజకీయం: ట్వీట్టర్ ప్రొఫైల్ నుంచి బీజేపీ లోగో తొలగింపు, ప్రకంపనలు

|
Google Oneindia TeluguNews

జ్యోతిరాదిత్య సింధియా.. ఈ పేరు ఎవరికీ గుర్తు ఉన్న లేకున్నా మధ్యప్రదేశ్ కాంగ్రెస్, కమల్‌నాథ్ మాత్రం మరచిపోలేరు. కాంగ్రెస్‌ను విభేదించి మరీ బీజేపీలో తన బృందంతో కలిసి చేరారు. అయితే బీజేపీలో చేరాక.. అతని మద్దతుదారులకు పదవులు.. సింధియాను కూడా కేంద్రమంత్రి పదవీ ఇస్తామని బీజేపీ ఆఫర్ ఇచ్చింది. కానీ ఇప్పటివరకు ఆ దిశగా అడుగులు పడటం లేదు. దీంతో సింధియా మరోసారి తనదైన శైలిలో రాజకీయానికి తెరతీశాడు.

 బీజేపీ గూటికి సింగ్వీ..? కోడై కూస్తున్న ట్వీట్టర్, సింధియా బాటలోనేనని.. గాసిప్స్‌పై రియాక్షన్... బీజేపీ గూటికి సింగ్వీ..? కోడై కూస్తున్న ట్వీట్టర్, సింధియా బాటలోనేనని.. గాసిప్స్‌పై రియాక్షన్...

ట్వీట్టర్ ప్రొఫైల్ ఛేంజ్..

ట్వీట్టర్ ప్రొఫైల్ ఛేంజ్..

ఇదివరకు కాంగ్రెస్ పార్టీని వీడేందుకు ట్వీట్టర్ ప్రొఫైల్ నుంచి కాంగ్రెస్ పార్టీ లోగో తీసేశాడు. తర్వాత బీజేపీలో చేరడం.. మధ్యప్రదేశ్‌లో శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం కొలువుదీరడం చకచకా జరిగిపోయాయి. కానీ ఇప్పుడు తన ట్వీట్టర్ ఖాతా నుంచి బీజేపీ లోగోను జ్యోతిరాదిత్య సింధియా తొలగించాడు. ఇందుకు కారణం కేంద్రమంత్రి పదవీ ఒక్కటైతే, శివరాజ్ సింగ్ ప్రభుత్వంపై కాస్త ఆలకబూనాడు. సింధియా మాటను లెక్కచేయడం లేదు అని భావిస్తున్నారు. అందుకోసమే బీజేపీ లోగో తీసేసి.. తన నిరసన తెలిపాడు.

అబ్బే అదేం లేదు..

అబ్బే అదేం లేదు..

కానీ బీజేపీ నేతలు ఖండిస్తున్నారు. బీజేపీలో ఎలాంటి భేదాభ్రిప్రాయాలు లేవు అని.. ట్వీట్టర్ ప్రొఫైల్ ఛేంజ్ చేస్తే జరిగే నష్టం ఏమీ లేదని.. ఎందుకు ఊహాగానాలకు తావిస్తున్నారని మండిపడ్డారు. అయితే ఇదివరకు కూడా ట్వీట్టర్ ప్రొఫైల్‌లో కాంగ్రెస్ లోగో తీసివేసిన తర్వాత బీజేపీలో చేరారు కదా అని కొందరు ప్రశ్నిస్తున్నారు.

Recommended Video

Jr NTR Fans Vs Meera Chopra : KTR Responds On Meera Chopra Complaint Against Jr NTR Fans
22 మంది ఎమ్మెల్యేలు

22 మంది ఎమ్మెల్యేలు

కమల్ నాథ్ సర్కార్, కాంగ్రెస్ పార్టీ తీరుతో విసుగుచెందిన జ్యోతిరాదిత్య సింధియా తన 22 మంది ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరారు. మార్చి 22వ తేదీన వారు కమల తీర్థం పుచ్చుకున్నారు. కానీ అంతకుముందు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్.. సింధియా వైఖరిపై విమర్శలు చేశారు. ఆయన కేంద్రమంత్రి కావాలి.. అందుకోసం ఎంతకైనా తెగిస్తారు.. ఎలాంటి రాజకీయాలు చేయడానికైనా వెనకాడరు అని వ్యాఖ్యానించారు.

English summary
Fuelling the speculation of a rift with Shivraj Singh Chouhan-led government in Madhya Pradesh, party leader Jyotiraditya Scindia has removed 'BJP' from his Twitter profile
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X