వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ పార్టీకి నిన్ననే జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా.. బీజేపీలో చేరిక..? కేంద్రమంత్రి పదవీ..?

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ పార్టీకి జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా చేశారు. తన పదవీపై హై కమాండ్ నుంచి స్పష్టత రాకపోవడంతో తిరుగుబాటు ఎగరవేశారు. వాస్తవానికి సింధియా సోమవారం కాంగ్రెస్ పార్టీకి సింధియా రాజీనామా చేయగా.. అదీ ఇవాళ వెలుగులోకి వచ్చింది. తనకు రాజ్యసభ సీటు ఇస్తామని మాటిచ్చి.. తీర్చకపోవడంతోనే సింధియా తిరుగుబాటు చేసినట్టు తెలుస్తోంది.

Recommended Video

Jyotiraditya Scindia Resigns From Congress! | Oneindia Telugu
రాజ్యసభ సీటు ఇవ్వకపోవడంతో..

రాజ్యసభ సీటు ఇవ్వకపోవడంతో..

మధ్యప్రదేశ్ నుంచి ప్రియాంక గాంధీకి రాజ్యసభ సభ్యత్వం ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనిని ఒక వర్గం కూడా కోరుకుంటోంది. దీంతో తనను రాజ్యసభకు పంపించారని సింధియా ఫిక్స్ అయ్యారు. తన వర్గానికి చెందిన వారితో క్యాంప్ వేశారు. 17 మందిని బెంగళూరు తరలించి.. హై టెన్షన్ క్రియేట్ చేశారు. సింధియా తిరుగుబాటుతో.. కాంగ్రెస్ పార్టీ దారిలోకి వచ్చింది. రాజ్యసభ కాదు.. పీసీసీ చీఫ్ పదవీ కూడా ఇస్తామని సీఎం కమల్ నాథ్ చెప్పినా.. అప్పటికే సమయం మించిపోయింది. సింధియా పార్టీకి రాజీనామా చేశారు.

 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా..?

17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా..?

సింధియా తర్వాత 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే కమల్ నాథ్ ప్రభుత్వం మైనార్టీలో పడిపోడింది. 114 సీట్ల నుంచి కాంగ్రెస్ పార్టీ బలం 97కి చేరుకుంటోంది. 109 సీట్లతో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తోంది. గవర్నర్ విచక్షణ మేరకు బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశం ఉంది. మరోవైపు 17 మంది సింధియా వర్గ ఎమ్మెల్యేలు బెంగళూరు క్యాంప్‌లోనే ఉన్నారు. వారు సాయంత్రం 6 గంటలకు భోపాల్‌లో మీడియాతో మాట్లాడనున్నారు.

దేశానికి ఏం చేయలేకపోతున్నా..?

దేశానికి ఏం చేయలేకపోతున్నా..?

కాంగ్రెస్ పార్టీలో ఉండి దేశానికి ఏం చేయలేకపోతున్నానని జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. అందుకే రాజీనామా చేశానని వివరించారు. దాదాపు 18 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో జ్యోతిరాదిత్య సింధియా కొనసాగారు. రాజ్యసభ సీటుపై హామీనివ్వకపోవడంతో.. ప్లేటు ఫిరాయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు సింధియా రాజీనామాపై కాంగ్రెస్ పార్టీ కూడా జెట్ స్పీడ్‌తో స్పందిందించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అతనిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామని పేర్కొన్నది. ఈ మేరకు ఒక ప్రకటనలో కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ స్పష్టంచేశారు.

 బీజేపీ నుంచి రాజ్యసభకు సింధియా...

బీజేపీ నుంచి రాజ్యసభకు సింధియా...

సింధియా రాజీనామాతో ఢిల్లీలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. బెంగళూరు క్యాంప్‌లో ఉన్న ఎమ్మెల్యేలు ఢిల్లీ నుంచి భోపాల్ వెళ్లనున్నట్టు తెలిసింది. వారు సాయంత్రం మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ఇటు సాయంత్రం బీజేపీ ఎన్నికల కమిటీ భేటీ కాబోతుంది. బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల సీట్లపై చర్చించబోతోంది. సింధియా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో... బీజేపీ ఎన్నికల కమిటీ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. బీజేపీ నుంచి రాజ్యసభకు పంపించి... ప్రధాని మోడీ తన క్యాబినెట్‌లోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

English summary
jyotiraditya Scindia resign congress party, he send letter to congress chief sonia gandhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X