వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రయాణీకురాలి ప్రాణాలను కాపాడిన కాంగ్రెస్ ఎంపీ జ్యోతిరాదిత్య

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ యువ ఎంపి , మాజీ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా రైలులో తన తోటి ప్రయాణీకురాలి ప్రాణాలను కాపాడారు. రైల్వేశాఖ సకాలంలో స్పందించకున్నా ఎంపీ సకాలంలో స్పందించడంతో ఆమె ప్రాణాలు దక్కాయి.

శుక్రవారం నాడు బోపాల్‌లో శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో సింధియా ఢిల్లీకి వెళ్తున్నారు. ఢిల్లీ శివారుకు చేరుకోగానే ఆయనకు ఎదురుగా కూర్చోన్న వందన లనే యువతి ఛాతీనొప్పితో కుప్పకూలిపోయింది. సమయానికి రైల్లో వైద్యుడు లేకపోవడంతో అప్రమత్తమైన సింధియా రైల్వే శాఖ మంత్రి ఫీయూష్ గోయల్‌కు డివిజనల్ మేనేజర్‌కు సమాచారం అందించారు.

Jyotiraditya Scindia Saves Life of Co-Passenger in Shatabdi Train

అయితే రైల్వేశాఖకు చెందిన అంబులెన్స్‌ గంట ఆలస్యంగా వచ్చింది. అయితే జ్యోతిరాదిత్య సింధియా ఆమెను సమీపంలోని ఆ ఆసుపత్రికి తీసుకెళ్ళి చికిత్స చేయించారు. దీంతో ఆమె ప్రాణాలు దక్కాయి.

జ్యోతిరాదిత్య సింధియా సకాలంలో స్పందించకపోతే ప్రాణాలు పోయేవని వైద్యులు చెప్పారు. మధ్యప్రదేశ్‌‌లోని గునా నియోజకవర్గం నుండి జ్యోతిరాదిత్య సింధియా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

English summary
Congress leader and MP Jyotiraditya Scindia turned saviour when his co-passenger on the Bhopal Shatabdi Express had a heart attack on the outskirts of Delhi. In the absence of any medical assistance, Scindia called Railway Minister Piyush Goyal and ensured that the girl was transported to a hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X