వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భగవద్గీత శ్లోకంతో సత్యార్ధి, ఇస్లాంకు తప్పుడు అర్థమని మలాలా: భారత్-పాక్ కలిసి... (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

ఓస్లో: ఒస్లోలో సత్యార్థి, మలాలాలు నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. నార్వే రాజధాని ఓస్లోలోని సిటీ హాల్‌లో బహుమతి ప్రధానోత్సవం వైభవంగా జరిగింది. ఇద్దరి కుటుంబాలకు చెందిన సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన కచ్చేరీలో భారతీయ సంగీత విద్వాంసుడు సరోద్ వాద్యకారుడు అంజాద్ అలీ ఖాన్ తన ఇద్దరు కుమారులు అమాన్, అయాన్‌లతో కలిసి కచేరీ నిర్వహించారు. నోబెల్ శాంతి బహుమతి అందుకున్న ఎనిమిదవ భారతీయుడిగా కైలాశ్ సత్యార్ధి చరిత్రకెక్కాడు.

ఈ కార్యక్రమంలో కైలాశ్ సత్యార్ధి భగవద్గీత శ్లోకం హిందీలో పఠించి తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. స్వర్గం కంటే ఉన్నతమైన నా దేశానికి, ఈ భూమికి ప్రణామాలు అని అన్నారు. తల్లిదండ్రులకు, దేశానికి, ధరిత్రికి వినమ్రంగా నమస్కరిస్తున్నానని చెప్పారు.

మలాలా నా కూతురి లాంటిదని అన్నారు. బాలలు స్వేచ్ఛగా పెరిగి అభివృద్ది జరగాలనేది నా ఆకాంక్ష అని అన్నారు. మా ఉద్యమం కాపాడిన చిన్నారుల నవ్వుల్లో దైవత్వం చూసేవాడినని అన్నారు. ఈ ప్రపంచంలో జీవించే హక్కు అందరికీ సమానంగా ఉండాలని ఆకాంక్షించారు.

 భగవద్గీత శ్లోకంతో సత్యార్ధి.. ఇస్లాంపై మలాలా

భగవద్గీత శ్లోకంతో సత్యార్ధి.. ఇస్లాంపై మలాలా

ఒస్లోలో సత్యార్థి, మలాలాలు నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. నార్వే రాజధాని ఓస్లోలోని సిటీ హాల్‌లో బహుమతి ప్రధానోత్సవం వైభవంగా జరిగింది. ఇద్దరి కుటుంబాలకు చెందిన సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

 భగవద్గీత శ్లోకంతో సత్యార్ధి.. ఇస్లాంపై మలాలా

భగవద్గీత శ్లోకంతో సత్యార్ధి.. ఇస్లాంపై మలాలా

నార్వే రాజధాని ఓస్లోలోని సిటీ హాల్‌లో జరిగిన నోబెల్ శాంతి బహుమతి ప్రధానోత్సవంలో అవార్డు స్వీకరించిన సత్యార్థి, మలాలాలు. నోబెల్ శాంతి బహుమతి అందుకున్న ఎనిమిదవ భారతీయుడిగా కైలాశ్ సత్యార్ధి చరిత్రకెక్కాడు.

 భగవద్గీత శ్లోకంతో సత్యార్ధి.. ఇస్లాంపై మలాలా

భగవద్గీత శ్లోకంతో సత్యార్ధి.. ఇస్లాంపై మలాలా

నార్వే రాజధాని ఓస్లోలోని సిటీ హాల్‌లో జరిగిన నోబెల్ శాంతి బహుమతి ప్రధానోత్సవంలో అవార్డు స్వీకరించిన సత్యార్థి, మలాలాలు. ఈ కార్యక్రమంలో కైలాశ్ సత్యార్ధి భగవద్గీత శ్లోకం హిందీలో పఠించి తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. స్వర్గం కంటే ఉన్నతమైన నా దేశానికి, ఈ భూమికి ప్రణామాలు అని అన్నారు. తల్లిదండ్రులకు, దేశానికి, ధరిత్రికి వినమ్రంగా నమస్కరిస్తున్నానని చెప్పారు.

 భగవద్గీత శ్లోకంతో సత్యార్ధి.. ఇస్లాంపై మలాలా

భగవద్గీత శ్లోకంతో సత్యార్ధి.. ఇస్లాంపై మలాలా

మలాలా నా కూతురి లాంటిదని అన్నారు. బాలలు స్వేచ్ఛగా పెరిగి అభివృద్ది జరగాలనేది నా ఆకాంక్ష అని అన్నారు. మా ఉద్యమం కాపాడిన చిన్నారుల నవ్వుల్లో దైవత్వం చూసేవాడినని అన్నారు. ఈ ప్రపంచంలో జీవించే హక్కు అందరికీ సమానంగా ఉండాలని అన్నారు.

 భగవద్గీత శ్లోకంతో సత్యార్ధి.. ఇస్లాంపై మలాలా

భగవద్గీత శ్లోకంతో సత్యార్ధి.. ఇస్లాంపై మలాలా

విశ్వశాంతికి మానవాలి కృషి చేయాలని అన్నారు. బాలలు హక్కుల కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన వారికి ఈ బహుమతి అంకితమిస్తున్నానని అన్నారు. బాలలను విముక్తులను చేయడం ద్వారా నేను విముక్తుడిని అయ్యానని అన్నారు. బాలలు హక్కుల కోసం పోరాడిన ఎందరో కార్యకర్తలకు గౌరవాన్ని అంకితమిస్తున్నానని అన్నారు.

పేదరికం కారణంగా చిన్నపిల్లను చంపుకునే పరిస్ధితి రాకూడదని అన్నారు. ధరిత్రిపై ఉన్న అందరూ సమాన అవకాశాలతో ముందుకెళ్లాలని సూచించారు. బాలల ఆలనాపాలనా చూడలన్నదే అన్ని మతాల సారాంశమని పేర్కొన్నారు.

అమాయకపు ప్రజల ఆక్రందనలకు నేను ప్రతినిధినని అన్నారు. పిల్లల కలల్ని ఛిద్రం చేసే హక్కు మనకు లేదని అన్నారు. బాలాల హక్కుల కోసం పోరాడే నిరంతర సైనికుడినని అన్నారు. ప్రపంచంలో ప్రజలంతా ఐకమత్యంతో మెలగాలని సూచించారు. ప్రభుత్వాలు బాలల-మైత్రిని అవలభించాలని అన్నారు.

ప్రపంచానికి శాంతి నేర్పించండి అంటూ మహాత్మాగాంధీ చెప్పినట్టు మన పిల్లలకు శాంతి గురించి నేర్పిద్దాం అని నోబెల్ పురస్కార గ్రహీత కైలాష్ సత్యార్థి పిలుపునిచ్చారు. బాలల హక్కుల కోసం పోరాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. పిల్లలు దేవుడితో సమానమని, వారిలో తేడాలు చూడలేమని, పిల్లాడేడిస్తే అంతా ఒకేలా స్పందిస్తామని అలాంటప్పుడు మన పిల్లల కోసం మనం పోరాడలేమా? అని అన్నారు.

వేల కొద్దీ మహాత్మా గాంధీలు, నెల్సన్ మండేలాలను తయారు చేసేందుకు బానిస సంకెళ్ల నుంచి, బాలకార్మిక వ్యవస్థ నుంచి బాలల హక్కుల హరించి వేత నుంచి వారికి స్వేచ్ఛ కల్పిద్దామని ఆయన పిలుపునిచ్చారు.

విశ్వశాంతికి మానవాలి కృషి చేయాలని అన్నారు. బాలలు హక్కుల కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన వారికి ఈ బహుమతి అంకితమిస్తున్నానని అన్నారు. బాలలను విముక్తులను చేయడం ద్వారా నేను విముక్తుడిని అయ్యానని అన్నారు. బాలలు హక్కుల కోసం పోరాడిన ఎందరో కార్యకర్తలకు గౌరవాన్ని అంకితమిస్తున్నానని అన్నారు.

నిర్లక్ష్యానికి గురైన బాధిత బాలల హక్కులకే నా పోరాటం: మలాలా

ఈ సందర్భంగా మలాలా మాట్లాడుతూ.. ఇంతటి మహోన్నతమైన అవార్డుకు నన్ను ఎంపిక చేసినందుకు ధన్యవాదులు అంటూ ప్రసంగం మొదలు పెట్టింది. మా అమ్మ నిజమైన ఇస్లాంకు ప్రతిరూపం అని అన్నారు. నా తల్లి దండ్రులు నాకు స్వేఛ్చనిచ్చినందుకు వారికి కృతజ్ఞతలను తెలియజేశారు.

నాలో స్పూర్తి నింపిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు అని అన్నారు. సత్యార్ధితో కలిసి నోబెల్ బహుమతి అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. నాణ్యమైన విద్య సమాన హక్కుల కోసం మహిళలు ఎదురుచూస్తున్నారని పేర్కొంది. ఒక పాకిస్ధానీ, ఒక భారతీయడు కలసి పనిచేయగలరని అన్నారు.

నిర్లక్ష్యానికి గురైన మహిళల హక్కుల కోసమే నా పోరాటమని అన్నారు. ప్రపంచం నలుమూలల శాంతి విరిసిల్లాలనేది నా ఆకాంక్ష అని అన్నారు. ఓ ఒక్క చిన్నారి కూడా విద్యకు దూరం కాకూడదని అన్నారు. పర్యాటకంగా అభివృద్ధి చెందాల్సిన స్వాత్ లోయలో టెర్రరిజం అభివృద్ధి చెందడం నిజంగా బాధాకరమని అన్నారు.

సత్యార్ధితో కలిసి పనిచేస్ అదృష్టం దక్కడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొంది. చదువుకోవడం హక్కు దాని నుంచి నేరమనే స్ధాయికి దిగజారిందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది బాలికలకు విద్య నిరాకరించబడుతోందని పేర్కొన్నారు.

ఇస్లాంకు తప్పుడు అర్ధం చెప్పి తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. నోబెల్ శాంతి బహుమతి ద్వారా వచ్చిన సొమ్మును మాలాలా నిధికి ఉపయోగిస్తానని అన్నారు. విద్యకు దూరమైన 6.6 కోట్ల బాలికల తరుపున మాట్లాడుతున్నానని ఆమె పేర్కొన్నారు.

భారత్, పాకిస్ధాన్‌లో ఇంకా బాల్యవివాహాలు జరుగుతున్నాయి. నా గ్రామంలో బాలలు చదువుకునేందుకు ఉన్నత పాఠశాల లేదు. అక్కడి బాలికల కోసం ఉన్నతమైన పాఠశాల నిర్మించాలన్నది నా లక్ష్యమని అన్నారు. పిల్లలకు తుపాకులివ్వడం తేలిక, పుస్తకాలివ్వడం కష్టంగా భావిస్తున్నారని అన్నారు. పిల్లల పట్ల చూపించాల్సింది జాలి కాదు... బాధ్యత చూపించాలని ఆమె అన్నారు.

నోబెల్ అందుకోవడంతో బాధ్యత మరింత పెరిగిందన్నారు. ఏ ఒక్క చిన్నారి కూడా ఉగ్రవాదానికి బలికావొద్దన్నారు. బాలికల విద్యాభివృద్ధికి పాటుపడతానని చెప్పారు. భారత్, పాక్ ప్రధానుల భేటీ జరగాలని తాను కోరుకుంటున్నట్లు మలాలా వెల్లడించింది.

కైలాస్ సత్యార్థి, మలాలా యూసఫ్ జాయ్‌‌లకు ప్రధాని నరేంద్రమోడీ అభినందనలు:

ఓస్లోలో నోబెల్ శాంతి బహుమతి అందుకున్న కైలాస్ సత్యార్థి, మలాలా యూసఫ్ జాయ్‌‌లకు ప్రధాని నరేంద్రమోడీ అభినందనలు తెలిపారు.

నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలిద్దరూ బాలల సమస్యలపై పోరాటం చేశారు: నోబెల్ కమిటీ

ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలిద్దరూ బాలల సమస్యలపై పోరాటం చేశారని నోబెల్ కమిటీ పేర్కొంది. ఒకరు బాల కార్మిక వ్యవస్ధ నిర్మూలనకు కృషిచేస్తే మరొకరు బాలికల విద్యకోసం పోరాటం చేశారని కమిటీ పేర్కొంది. కైలాశ్ సత్యార్ధి, మాలాలా ఇద్దరూ కూడా బాలల హక్కులకు ప్రచారం కల్పించారని కమిటీ పేర్కొంది. ఆ దిశగా ఎన్నో కష్టాలను పడ్డారని నోబెల్ కమిటీ పేర్కొంది.

English summary
India's Kailash Satyarthi and Pakistan's Malala Yousafzai received the 2014 Nobel Peace Prize in Oslo on Wednesday evening. The Nobel Prize is presented every year on December 10, the death anniversary of its founder Alfred Nobel.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X