• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గాయాలతోనే 'కెమెరా ఆన్'.. కన్నీటితో 'కర్తవ్యం'.. కేరళ బంద్‌లో "షాజిలా" తెగువ

|

కేరళ : వృత్తిపట్ల నిబద్ధత.. మొక్కవోని ధైర్యం.. విధినిర్వహణలో తెగువ. వెరసి ఎన్నో వార్తలకు సాక్షిగా నిలిచిన ఆమె.. ఇప్పుడు వార్తల్లోకి ఎక్కారు. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ఇద్దరు మహిళలు ప్రవేశించడాన్ని నిరసిస్తూ హిందూ సంఘాలు చేపట్టిన కేరళ బంద్ హింసాత్మక ఘటనలకు దారితీసింది. కవరేజీ కోసం వెళ్లిన మీడియాపై కూడా ఆందోళనకారులు దాడికి దిగారు.

ఆ క్రమంలో కైరాలీ టీవి కెమెరాపర్సన్ షాజిలాను అడ్డుకున్నారు. అయినా ఆమె బెదరలేదు. ఆందోళనకారులు కెమెరా లాక్కోవడంతో వారిని ప్రతిఘటించారు. ఆందోళనకారులు నెట్టివేసినా, దాడిచేసినా భయపడలేదు. వారి నుంచి కెమెరా లాక్కొని మళ్లీ విధినిర్వహణలో మునిగిపోయారు. బాధను దిగమింగి విజువల్స్ కోసం ఆమె ఆరాటపడ్డ తీరుకు ప్రశంసల జల్లు కురుస్తోంది.

ఆందోళనకారుల దాడి.. చెక్కుచెదరని ధైర్యం

ఆందోళనకారుల దాడి.. చెక్కుచెదరని ధైర్యం

ఆందోళనల సమయంలో కవరేజీకి వెళ్లే కెమెరామెన్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో షాజిలా ఉదంతం రుజువుచేస్తోంది. మీడియా వ్యక్తులనీ కూడా చూడకుండా కేరళలో ఆందోళనకారులు రెచ్చిపోయారు. రాష్ట్ర బంద్ నేపథ్యంలో తిరువనంతపురంలో కవరేజీకి వెళ్లిన షాజిలాపై నిరసనకారులు దాడి చేశారు. అంతేకాదు కెమెరా లాక్కొని ఆమెను నెట్టివేశారు. ఊహించని పరిణామంతో షాజిలా బెదరలేదు. పైగా ఆందోళనకారులు లాక్కున్న కెమెరాను వెనక్కి తీసుకునేంతవరకు వారితో పెనుగులాడారు. ఈ క్రమంలో తనకు గాయాలైనా లెక్క చేయకుండా కవరేజీలో మునిగిపోయారు. బాధను పంటిబిగువున దాచి విధినిర్వహణలో నిమగ్నమయ్యారు.

కన్నీటితోనే కర్తవ్యం

కన్నీటితోనే కర్తవ్యం

నిరసనకారులు తన కెమెరా లాక్కోవడంతో షాజిలా అధైర్యపడలేదు. తనపై దాడి జరిగినా భయపడలేదు. మీడియా పర్సన్ అనే విచక్షణ లేకుండా ఆందోళనకారులు ఆమెతో వాగ్వాదానికి దిగారు. అయినా ఆమె వెనుకడుగు వేయలేదు. వారితో ప్రతిఘటించి కెమెరా తన చేతికి వచ్చేంతవరకు విడిచిపెట్టలేదు. ఒక్కవైపు గాయాలు తీవ్రంగా బాధిస్తున్నా కూడా మరో ఆలోచన పెట్టుకోలేదు. కన్నీటి బొట్లు రాలినా.. కలత చెందలేదు. విధినిర్వహణకే మొగ్గుచూపారు. ఆందోళన కార్యక్రమం జరిగిన తీరు కళ్లకు కట్టినట్లు చిత్రీకరించారు.

శభాష్ షాజిలా.. నెటిజన్ల ప్రశంసలు

శభాష్ షాజిలా.. నెటిజన్ల ప్రశంసలు

కేరళ బంద్ లో భాగంగా తనపై జరిగిన దాడిపై షాజిలా మాట్లాడిన తీరు.. ఆమె ధైర్యానికి మచ్చుతునకలా కనిపిస్తుంది. కన్నీటి బొట్లు రాల్చడానికి భయం కారణం కాదన్నారు. ఏమి చేయలేని తన నిస్సహాయ స్థితికి అవి నిదర్శనమన్నారు. గుంపుగా వచ్చి దాడిచేస్తే ఏంచేయగలనంటూ వాపోయారు. ఆందోళనకారులు తనపై దాడి చేసినందుకు బాధ లేదని.. మంచి విజువల్స్ మిస్ కావడంతో పాటు టైమ్ వృధా అయిందని వాపోయారు. కన్నీటితో విధినిర్వహణలో ఉన్నట్లుగా కెమెరా చేతబట్టుకున్న షాజిలా ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆమె ధైర్యానికి, వృత్తి నిబద్ధతకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు నెటిజన్లు.

English summary
kairali tv cameraperson shajila on duty even attacked by protestants in kerala. The camera was dragged and she pushed. In this order she was caught the protest visuals in the coverage without having to calculate pain.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more