వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కీలకమైన కైరానా లోకసభ నియోజకవర్గంలో బీజేపీ ఓటమికి కారణాలు ఎన్నో

By Srinivas
|
Google Oneindia TeluguNews

లక్నో: ఇటీవల కీలక కైరానా లోకసభ నియోజవకర్గంలో బీజేపీ ఓడిపోయింది. బీజేపీ ఓటమికి పలు కారణాలు ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యమైనది ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ, ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కలవడం. ఈ పార్టీలన్నీ కలిసినా బీజేపీని కేవలం యాభై వేల పై చిలుకు ఓట్లతో మాత్రమే ఓడించాయి. ఇదే విషయాన్ని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు.

దీనికి తోడు ఇదే సమయంలో పెరుగుతున్న పెట్రోలు ధరలు, ముస్లీంలు - జాట్‌లు ఏకం కావడం కూడా ప్రధాన కారణంగా చెబుతున్నారు. కైరానా లోకసభ నియోజకవర్గంలో నకుర్‌, గంగోహ్‌, కైరానా, థానాభవన్‌, షామ్లి అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇందులో నకుర్‌, గంగోహ్‌ స్థానాలు సహరన్‌పుర్‌ జిల్లాలోను, మిగిలిన మూడు స్థానాలు షామ్లి జిల్లాలో ఉన్నాయి.

Kairana bypoll result: How strategy of ‘Opposition unity’ ensured BJP’s defeat

షామ్లిలో ఉన్న మూడు పంచదార మిల్లులు రైతులకు రూ.512.71 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. సహరన్‌పుర్‌లో ఉన్న మూడు మిల్లుల బకాయిలు రూ.261.74 కోట్లు మాత్రమే. ఇక్కడి ఓటింగ్‌ సరళిని పరిశీలిస్తే, ప్రతిపక్షాలు చెబుతున్నట్లు చెరకు రైతులకు బకాయిలు చెల్లించకపోవడం వల్ల బీజేపీ ఓడిపోలేదని అంటున్నారు.

పైగా బీజేపీకి అండగా ఉంటే జాట్‌లు ఈసారి ఆర్ఎల్డీకి మద్దతిచ్చిందని అంటున్నారు. పెట్రో ధరల పెంపు కూడా కారణమంటున్నారు. ఇక్కడ ముస్లీం-అహిర్-గుజ్జర్-దళిత ఫార్ములా ఫలించిందంటున్నారు.

English summary
The importance of the defeat of the BJP in the recently concluded Kairana by-election is not lost on the party. A bevy of senior ministers from the BJP, chief minister Yogi Adityanath, and Prime Minister Narendra Modi all campaigned for this by-election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X