చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తిరుగులేని మహానేతకు మెరీనా బీచులో చోటివ్వాల్సిందే: విశాల్

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు 'కలైంజర్' కరుణానిధి మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే కరుణానిధి సమాధికి మెరీనా బీచ్‌లోని 'అన్నా మెమోరియల్' వద్ద స్థలం ఇవ్వాలంటూ డీఎంకే చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం సున్నితంగా తోసిపుచ్చింది.

హైకోర్టులో పలు కేసులు పెండింగ్‌లో ఉన్నందున అక్కడ స్థలం ఇవ్వడం సాధ్యంకాదని చేతులెత్తేసింది. ఇందుకు ప్రత్యామ్నాయంగా గాంధీ మండపం సమీపంలో గిండీ వద్ద (అన్నా వర్శిటీ ఎదురుగా) రెండెకరాలు స్థలం ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. దీంతో అన్నా మెమోరియల్ వద్దే స్థలం కేటాయించాలని కోరుతూ హైకోర్టును డీఎంకే ఆశ్రయించింది.

KALAIGNARS DEMISE: VISHAL MAKES AN IMPORTANT REQUEST

ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ నటుడు, నడిగర్ సంఘం జనరల్ సెక్రటరీ విశాల్ స్పందించారు. కరుణానిధికి అంత్యక్రియలకు మెరీనా బీచ్‌లో చోటు కల్పించాలని అతను డిమాండ్ చేశారు.

'డా.కరుణానిధి కచ్చితంగా తిరుగులేని మహానేత. ఆయన సినిమాకి, రాజకీయాలకు చేసిన సేవలకు ఎవరూ సాటిలేరు. ఆయన కుటుంబసభ్యులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. సినిమాల్లో ఆయన రాసిన డైలాగులు ట్రెండ్‌సెట్టర్లు. సినిమా ఇండస్ట్రీకి ఆయన మరణం తీరని లోటు. 'కలైంజర్ అయ్య' గత 50 సంవత్సరాలుగా ఓ రాజకీయ పార్టీకి నేతగా ఉండి, ఎన్నో సేవలు చేసిన ఆయన మెరీనా బీచ్‌లో చోటు ఇచ్చేందుకు అన్ని విధాల అర్హుడు. కాబట్టి నేను తమిళనాడు ప్రభుత్వాన్ని 'కలైంజర్ అయ్య' అంత్యక్రియలకు మెరీనా బీచ్‌లో చోటు ఇచ్చేందుకు అన్ని విధాలుగా కృషి చేయాలని కోరుతున్నా.. ఇట్లు విశాల్' అని ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు.

English summary
Following the demise of DMK Supremo, and former Chief Minister of Tamil Nadu, Dr Kalaignar Karunanidhi, people from various fields and parts of the world have been sharing their condolence messages.'I hereby request the Tamilnadu Government to take all efforts possible to allot space in Marina for Kalaignar Ayya's burial' said Vishal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X