చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎస్పీ బాలు కోసం ఒక్కొక్కరుగా - ఆస్పత్రి వద్ద ఉద్విగ్నత - కమల్ సహా సన్నిహితుల రాక

|
Google Oneindia TeluguNews

అంతా బాగుంది.. అతి త్వరలోనే ఆస్పత్రి నుంచి ఇంటికెళ్లాలని ఆత్రుత పడుతున్నారు.. అని తెలియడంతో అభిమానులు రిలాక్స్ అయ్యారు.. కానీ 24 గంటల్లనే అంతా రివర్స్ అయింది.. గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు అనారోగ్యం తిరగబెట్టింది.. దీంతో కండిషన్ క్రిటికల్ గా మారింది. బాలు ఆరోగ్యం విషమంగా ఉందంటూ అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రి వద్ద ఉద్విగ్న వాతావరణం నెలకొంది..

ఎస్పీ బాలు కండీషన్ సీరియస్ - ప్రార్థనలు చేయాలంటూ ప్రముఖల పిలుపు - అసలేం జరిగింది?ఎస్పీ బాలు కండీషన్ సీరియస్ - ప్రార్థనలు చేయాలంటూ ప్రముఖల పిలుపు - అసలేం జరిగింది?

గడిచిన 50 రోజులుగా ఆస్పత్రిలోనే ఉన్న ఎస్పీ బాలు ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతుండగా, గురువారం నాటి ప్రకటన అందరినీ ఆందోళను గురిచేసింది. ''గడిచిన 24 గంటల్లో ఎస్పీ బాలు ఆరోగ్యం క్షీణించింది. మ్యాగ్జిమమ్ లైఫ్ సపోర్టు అందిస్తున్నాం. నిపుణులైన వైద్య సిబ్బంది పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతున్నది'' అని చెన్నై ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆ వెంటనే బాలు సన్నిహితులు ఒక్కొక్కరిగా ఆస్పత్రికి రావడం మొదలుపెట్టారు..

Kamal Haasan and others visits SP Balasubrahmanyamat MGM hospital in Chennai

ఎస్పీ బాలు బంధువులతోపాటు ఆయనకు అత్యంత సన్నిహితుడైన నటుడు, రాజకీయ నేత కమల్ హాసన్ గురువారం రాత్రి ఎంజీఎం ఆస్పత్రికి వచ్చారు. గాయకుణ్ని పరామర్శించిన అనంతరం కమల్ తిరిగి వెళుతూ మీడియాతో మాట్లాడారు. బాలు త్వరగా కోలుకోవాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. కమల్ రాకకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కమల్ నటించిన మెజార్టీ సినిమాలకు తెలుగులో బాలునే డబ్బింగ్ చెప్పడం తెలిసిందే. 'దశావతారం' సినిమాలో ఏకంగా ఎనిమిది పాత్రలకు బాలు స్వరదానం చేశారు. గాయకుడి ఆరోగ్యానికి సంబంధించి మరో బులిటెన్ కూడా వెలవడొచ్చని తెలుస్తోంది.

మంత్రి కొడాలి నానికి వైసీపీ హితవు - మోదీపై కామెంట్లు సరికాదన్న సజ్జల - ఢిల్లీ సీరియస్ అయినందుకేమంత్రి కొడాలి నానికి వైసీపీ హితవు - మోదీపై కామెంట్లు సరికాదన్న సజ్జల - ఢిల్లీ సీరియస్ అయినందుకే

అనారోగ్యం మళ్లీ తిరగబెట్టిందన్న వార్తలతో సంగీతాభిమానుల్లో ఆందోళన రెట్టింపైంది. బాలు ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని ప్రార్థన చేద్దామంటూ టాలీవుడ్, కోలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు ప్రకటనలు చేశారు. కరోనాతో బాలు ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరగా, రెండో వారానికి పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్, ఎక్మో సాయంతో చికిత్స అందిస్తున్నారు. ఇటీవల కరోనా నెగటివ్ రావడంతో ఇక కోలుకుంటారని అంతా భావించినా, మళ్లీ కండిషన్ క్రిటికల్ గా మారినట్లు డాక్టర్లు చెప్పారు. ''ప్రే ఫర్ ఎస్పీబీ'' హ్యాష్ ట్యాగ్ తో నెటిజన్లు బాలు కోసం ప్రార్థనలు చేస్తున్నారు.

English summary
After learning that legendary singer SP Balasubrahmanyam is critical, Kamal Haasan visited MGM hospital in Chennai to check on the former's health condition. A few hours ago, there were reports that SP Balasubrahmanyam's health condition has worsened and is now on maximum life support. The statement from the hospital said that the doctors are closely monitoring him. Following this, SPB's friend and well-wisher Kamal Haasan visited him at the hospital in Chennai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X