వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిన్ లాడెన్ మృతిని ఊహించలేదు, అలా జరిగింది: కమల్ హాసన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

నేను ఊహించలేదు, అలా జరిగింది అంతే: కమల్ హాసన్

చెన్నై: అంతర్జాతీయ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ నాయకుడు ఒసామా బిన్ లాడెన్ ఒసామా బిన్ లాడెన్‌ను 2011లో అమెరికా మట్టుబెట్టింది. జెరోనిమో ఆపరేషన్ చేపట్టి అతనిని హతమార్చింది. అయితే కాకతాళీయంగా ఆ పదాన్ని 2010లోనే తన విశ్వరూపం స్క్రిప్ట్‌లో కమల్ హాసన్ రివీల్ చేశాడు. దీంతో లాడెన్ చావును కమల్ హాసన్ ముందే ఊహించాడని చెబుతున్నారు.

అయితే దీనిపై కమల్ స్పందిస్తూ.. బిన్‌లాడెన్‌ చావును తాను ముందే ఊహించలేదని స్పష్టం చేశారు. విశ్వరూపం 2 ప్రచార కార్యక్రమంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సందర్భంగా తాను తెరకెక్కించిన విశ్వరూపం సినిమాలో రాసుకున్న ఓ చిన్న పదం‌ అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్‌లాడెన్‌ చావుతో వైరల్‌గా మారిందని అంటున్నారు.

Kamal Haasan Claims He Predicted The Death Of Osama

విశ్వరూపం సినిమాకు 2010లోనే స్క్రిప్ట్‌ రాసుకుని అంతా సిద్ధం చేసుకున్నానని, అందులో జెరోనిమో అనే పదాన్ని పాసింగ్ లైన్‌గా వాడుకున్నానని, కానీ, ఆ పదం 2011లో చాలా వైరల్‌గా మారిందని, ఎందుకంటే 2011లో అమెరికా సైన్యం లాడెన్‌ను చంపడానికి ఆపరేషన్‌ జెరోనిమో మొదలుపెట్టిందని, అదీకాకుండా విశ్వరూపం చిత్రంలో హీరో ఓ ముస్లిం అని, ముస్లింల పట్ల సమాజం చిన్నచూపు చూడటాన్ని వ్యతిరేకించే పాత్ర అది అని కమల్ చెప్పారు. దాంతో ఈ సినిమాకు సమస్యలు తలెత్తాయన్నారు.

అదే తాను ఈ సినిమాను 2006లో విడుదల చేసి ఉంటే ఓ సాధారణ థ్రిల్లర్ చిత్రంలా ఉండేదన్నారు. కానీ రోజులు గడుస్తున్న కొద్ది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంఘటనలు చోటు చేసుకున్నాయన్నారు. దాంతో ఈ సినిమాను సెన్సార్‌ బోర్డుకు పంపినప్పుడు ఎవరూ ఏమనలేదని, సినిమాను న్యూయార్క్‌లో వేసవి సమయంలో చిత్రీకరించాలనుకున్నామని, కానీ, మాకు అక్కడి అధికారుల నుంచి అనుమతి రాలేదన్నారు. 2011 ఫిబ్రవరిలో స్క్రిప్ట్‌ను అధికారులకు ఇచ్చానని, వారు దానిని చదివి అనుమతిస్తే మేలో చిత్రీకరణ జరపాలనుకున్నామని, కానీ అలా జరగలేదన్నారు.

అ తర్వాత అద్భుతం జరిగినట్లు అబొట్టాబాదులో అమెరికా సైన్యం జెరోనిమో పేరుతో లాడెన్‌ను మట్టుబెట్టిందన్నారు. నేను ఆ పేరును తన సినిమాలో పాసింగ్‌ లైన్‌లా వాడానని, ఆ సినిమా చూసినవారంతా లాడెన్‌ను అమెరికా మట్టుబెడుతుందన్న విషయం ఒబామా తన సినిమా ద్వారా ప్రకటించారా? అని చాలామంది అనుకున్నారని చెప్పారు. కానీ అది తాను ఊహించింది కాదని, అలా జరిగిపోయింది అంతే అన్నారు.

English summary
Not that I am Nostradamus but I had foretold the death of Osama Bin Laden while writing the script of Vishwaroopam II, says Kamal Haasan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X