వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Bigg Boss 4: కుటుంబాల్లో చిచ్చు -ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు -హోస్ట్‌పై మండిపాటు

|
Google Oneindia TeluguNews

బుల్లితెర ఎంటర్​టైన్​మెంట్​లో బిగ్​బాస్​ షోకు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. స్టార్ హీరోలు సైతం తమ బిజీ షెడ్యూల్ని పక్కనపెట్టి మరీ హోస్టులుగా వ్యవహరిస్తున్నారు. తమిళ్​ బిగ్​బాస్​కి 'ఉళగనాయకన్'​ కమల్​హాసన్​ హోస్ట్​గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆయన రాజకీయ పార్టీకి సారధి కూడా కావడం, ఇటీవలే ఎన్నికల ప్రచారాన్ని కూడా మొదలుపెట్టడం విదితమే. దీంతో కమల్ రాజకీయాలకు బిగ్ బాస్ షోను ముడిపెడుతూ విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. తాజాగా..

పిరుదులపై ప్రేమ ప్రాణం తీసింది -లైవ్​లో చూసి షాక్​ -సర్జరీ వికటించి ప్రముఖ మోడల్ మృతిపిరుదులపై ప్రేమ ప్రాణం తీసింది -లైవ్​లో చూసి షాక్​ -సర్జరీ వికటించి ప్రముఖ మోడల్ మృతి

సీఎం పళని సంచలనం..

సీఎం పళని సంచలనం..

తమిళనాడులో ప్రస్తుత అన్నాడీఎంకే సర్కారుపై, ముఖ్యమంత్రి పళనిస్వామిపై ఎంఎన్ఎం చీఫ్ కమల్ హాసన్ వరుసగా విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో సీఎం పళని కమల్ పై ఎదురుదాడి చేశారు. గురువారం ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. కమల్​పై విరుచుకుపడుతూ బిగ్ బాస్ షోపై, కమల్ నటించిన సినిమాలపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ విమర్శల కోసం టీవీ షోను సీఎం టార్గెట్ చేయడమేంటనే రచ్చ జరుగుతోంది..

కుటుంబాల్లో బిగ్ బాస్ చిచ్చు

కుటుంబాల్లో బిగ్ బాస్ చిచ్చు

‘‘బిగ్​బాస్ అట.. అదేం టీవీ షోనోనాకైతే అర్థంకాలేదు. దాన్ని చూసి పిల్లలు పాడైపోతున్నారు. కుటుంబాలు చెడిపోతున్నాయి. పచ్చని కాపురాల్లో బిగ్​బాస్​ చిచ్చుపెడుతోంది. అలాంటి రియాలిటీషోను ఎంకరేజ్​ చేసేవాళ్లను, హోస్లింగ్ చేసే కమల్ లాంటివాళ్లను ఏమనాలి? నిజం చెప్పాలంటే ఆయన(కమల్)వి పనికిమాలిన సినిమాలు.. సమాజానికి పనికొచ్చే ఏమైనా సందేశం ఉంటుందా? కానీ...

ఎంజీఆర్ సాక్షిగా ఫైరింగ్

ఎంజీఆర్ సాక్షిగా ఫైరింగ్

కమల్ మాత్రం తానేదో సమాజానికి మంచి చేస్తున్నట్లు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంటుంది. ఈ మధ్యే కమల్.. దివంగత ఎంజీఆర్ గురించి మాట్లాడారు. ఎంజీఆర్ అందరివాడని, ఆయన ప్రభావం తమిళ సమాజంపై బలంగా ఉందని కొనియాడారు. నిజమే, ఎంజీఆర్ సినిమాల్లోని పాటలు చిన్నపిల్లలపై కూడా పాజిటివ్ ప్రభావాన్ని చూపెట్టేవి. మరి ఈయన(కమల్ సినిమాలు సమాజంపై ఏం ప్రభవాన్ని చూపినట్లు? కమల్ రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు ఇంత కూడా మంచి చేయలేరు'' అని సీఎం పళనిస్వామి ఫైరయ్యారు.

కమల్ అనూహ్య రియాక్షన్

కమల్ అనూహ్య రియాక్షన్

బిగ్ బాస్ షోను ఉద్దేశించి సీఎం పళనిస్వామి చేసిన కామెంట్లపై ఆ కార్యక్రమ హోస్ట్ కమల్ హాస్ అనూహ్య రియాక్షన్ ఇచ్చారు. పళని లాంటి పొలిటికల్ బిజీ పర్సన్ తన రియాలిటీ షో చూడడం ఎంతో సంతోషాన్నిచ్చిందన్న కమల్​.. సీఎంకు థ్యాంక్స్​ చెప్పారు. అంతేకాదు తమిళనాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్​పై తాను చేసిన కామెంట్లకు కట్టుబడి ఉంటానన్న కమల్ స్పష్టం చేశారు. ఎంజీఆర్‌ కలను సాకారం చేసిననాడు తానే ఆ నేతకు నిజమైన వారసుడిని అవుతానని కమల్ చెప్పుకొచ్చారు.

ఇటు బిగ్‌బాస్.. అటు ఎన్నికల పోరు

ఇటు బిగ్‌బాస్.. అటు ఎన్నికల పోరు

తమిళ బిగ్ బాస్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తూనే కమల్ హాసన్ తన ఎంఎన్ఎం పార్టీ కోసం ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఐదు నెలల సమయం ఉన్నా, ముందస్తుగానే ఆయన రంగంలోకి దిగారు. కలిసొచ్చే వాళ్లతో పొత్తుపెట్టుకుంటానన్న కమల్.. ఇప్పటికే మజ్లిస్ పార్టీతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. త్వరలో రజనీకాంత్​ పార్టీ ప్రకటించనున్న నేపథ్యంలో.. పొత్తుపై తేల్చాల్సింది రజనీనేనని కమల్​ అన్నారు. ఎంఎన్​ఎం పార్టీ ఎన్నికల గుర్తు విషయంలో కమల్​కు ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్​ కనిపిస్తోంది. బ్యాటరీ టార్చ్‌లైట్‌చిహ్నం కోసం మక్కల్‌నీది మయ్యం ఈసీని అభ్యర్థించేందుకు సిద్ధమైంది. అయితే ఈ గుర్తు ఎంజీఆర్‌మక్కల్‌కట్చికి ఇదివరకే కేటాయించింది. దీంతో వదులుకునే ప్రసక్తే లేదని ఎంజీఆర్‌మక్కల్‌కట్చి నేత విశ్వనాథన్‌తెలిపారు. కమల్ మాత్రం ఈ గుర్తును చేజిక్కించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

దేశంలో మరో మహమ్మారి విలయం -మ్యూకర్‌మైకోసిస్‌ వ్యాధితో 9 మంది మృతి - గుజరాత్‌, ఢిల్లీలో కల్లోలందేశంలో మరో మహమ్మారి విలయం -మ్యూకర్‌మైకోసిస్‌ వ్యాధితో 9 మంది మృతి - గుజరాత్‌, ఢిల్లీలో కల్లోలం

English summary
Hitting out at Makkal Needhi Maiam (MNM) leader Kamal Haasan and “Bigg Boss” Tamil, TN Chief Minister Edappadi K Palaniswami alleged that the show hosted by the actor-politician for a private television channel will spoil families. The minister criticised the 66-year-old star, alleging he has joined politics recently after retiring from acting and does not know anything. Kamal Haasan also reacts on cm EPS comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X