చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నన్ను కాపీ కొట్టడానికి సిగ్గు లేదా?:ఒంటికి నూనె పూసుకున్నాక బరిలో దిగాల్సిందే: కమల్ హాసన్

|
Google Oneindia TeluguNews

చెన్నై: బహుభాషా నటుడు కమల్ హాసన్ రాజకీయాల్లో ప్రవేశించినప్పటి నుంచీ ఎక్కడా గానీ పెద్దగా విమర్శలు చేయలేదు. ఒకటి, రెండు సందర్భాల్లో ఆయన కొన్ని విమర్శలు చేసినప్పటికీ.. అవి ఏనాడూ హద్దు దాటలేదు. పరిమితంగా, సున్నితంగా తన రాజకీయ ప్రత్యర్థులకు చురకలు అంటించే వారు. మక్కళ్ నీతి మయ్యం పార్టీని స్థాపించిన తరువాత సంస్థాగతంగా బలోపేతం చేయడానికి ఇన్నాళ్లూ పరిమితమైన కమల్ హాసన్.. తొలిసారిగా రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేశారు. వారి వైఖరిపై విరుచుకు పడ్డారు. తీవ్ర పదజాలంతో ఘాటుగా ఆరోపించారు. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, ఇటీవలే రాజకీయాల్లోకి ప్రవేశించిన తన తోటి నటుడు రజినీకాంత్ లను టార్గెట్ గా చేసుకున్నారు. ప్రత్యేకించి- స్టాలిన్ పై ఆయన నిప్పులు చెరిగారు. తన ప్రభుత్వం అధికారంలోకి వస్తే, క్షేత్ర స్థాయిలో సమస్యలను పరిష్కరించడానికి కమల్ హాసన్ ప్రకటించిన ఓ కీలక పథకాన్ని స్టాలిన్ కూడా మక్కీ కి మక్కీ దించేయడం కమల్ హాసన్ ఆగ్రహానికి కారణమైంది.

రాజనీయాల్లో నేను చిన్నపిల్లవాణ్ణి. ఇప్పుడిప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్నాను. మీరు (స్టాలిన్) కాకలు తీరిన యోధులు. అపర మేధావులు. నేను ప్రకటించిన పథకాన్ని కాపీ కొట్టడానికి సిగ్గుగా లేదా?.. అని కమల్ హాసన్ విమర్శించారు. గ్రామస్థాయిలో సమస్యలను పరిష్కరించడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై కమల్ కొద్ది రోజులుగా కసరత్తు చేస్తున్నారు. ఆయన తమిళనాడులోని పలు జిల్లాల్లో ఊరచ్చి సభై అనే పేరుతో గ్రామసభలను నిర్వహిస్తున్నారు. గ్రామీణులను పిలిపించుకుని, వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంటున్నారు. వాటిని పరిష్కరించడానికి ఏం చేస్తే బాగుంటుందని.. వారినే అడిగి తెలుసుకుంటున్నారు. డీఎంకే కూడా దీన్నే అనుసరిస్తోంది.

Kamal Haasan Mocks Rajinikanth’s ‘Slapping of Thighs’ and Stalin’s Torn Shirt

25 సంవత్సరాలుగా మీరు (స్టాలిన్) రాజకీయాల్లో ఉంటున్నారు. మీ పార్టీ చాలాసార్లు అధికారంలోకి వచ్చింది. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి గ్రామ సభలను ఏర్పాటు చేయాలనే ఆలోచన మీకు రాలేదా? రాజకీయాల్లో ఓ చిన్న పిల్లవాడినైన నేను చెబితే, దాన్ని మీరు కాపీ కొడుతున్నారు. సిగ్గుగా లేదా?.. అని ధ్వజమెత్తారు.

నేను నడివీధిలో నిల్చుని మీలా బట్టలు చింపుకోను. అసెంబ్లీలో కూడా నేనా పని చేయలేను. ఒక్క సారి చొక్కా చిరిగితే, దాన్ని నేను ధరించను. చిరిగిన చొక్క వేసుకుని బయటికి రాలేను. చొక్కాను మార్చుకుని వస్తా.. అని చెప్పారు. 2017లో స్టాలిన్ చిరిగిన చొక్కాతో అసెంబ్లీ సమావేశాల నుంచి బయటికి వచ్చిన సందర్భాన్ని కమల్ హాసన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Kamal Haasan Mocks Rajinikanth’s ‘Slapping of Thighs’ and Stalin’s Torn Shirt

లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయబోనని రజినీకాంత్ చేసిన ప్రకటనపై కమల్ హాసన్ మాట్లాడుతూ.. ఒక్కసారి రాజకీయాల్లోకి దిగిన తరువాత వెనక్కి తగ్గడం సబబు కాదని అన్నారు. ఒంటికి నూనె పూసుకుని, తొడగొట్టిన తరువాత బరిలోకి దిగాల్సిందే. యుద్ధానికి తలపడాల్సిందే. అంతే గానీ, ఇవ్వాళ వద్దు, రేపు వచ్చి యుద్ధం చేస్తానంటే కుదరదు.. అని ఎద్దేవా చేశారు.

English summary
The founder of MNM party was obliquely referring to DMK President M.K. Stalin and others holding Gram Sabha meetings. Actor-turned-politician Kamal Haasan on Sunday took digs at DMK President M.K. Stalin and Rajinikanth. At the Rotaract Annual District Conference held here, Kamal Haasan said Gram Sabha is there for decades and only after he started holding such meetings in villages in Tamil Nadu that others started copying that. "Are you not ashamed of copying from a small boy?" he said. At another point, Kamal Haasan said he cannot be wearing a torn shirt, and even if his shirt gets torn in the Assembly, he would wear another shirt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X