• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బాల్కనీ ప్రభుత్వాలు కింద ఏం జరుగుతుందో చూడాలి ..వలస కార్మికుల సంక్షోభంపై కమల్ హాసన్

|

కరోనా మహమ్మారి ఇప్పుడు ప్రపంచ దేశాలను వేధిస్తుంది . ఈ పేరు చెబితేనే ప్రపంచం చిగురుటాకులా వణికిపోతుంది. ఇక కరోనా ప్రభావంతో ప్రపంచమే లాక్ డౌన్ అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక సంక్షోభానికి కరోనా కారణం అయ్యింది .ఇక చాలా దేశాలలో రైళ్లు, బస్సులు, విమానాలు ఎక్కడక్కడి క్కడ స్థంభించిపోయాయి. కరోనా దెబ్బకు పేద , గొప్ప, ఆడా, మగా తేడా లేకుండా అందరు భయాందోళనకు గురవుతున్నారు.

దారుణంగా మారిన వలస కార్మికుల జీవనం

దారుణంగా మారిన వలస కార్మికుల జీవనం

కరోనా వైరస్ ప్రభావంతో దాదాపు పరిశ్రమలు స్థంభించిపోయాయి. వర్తక వాణిజ్యాలు ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. అన్నిటికంటే కరోనా ప్రభావం సామాన్య, దినసరి కూలీల మీద, వలస జీఉల మీద పడింది. పట్టెడు అన్నం కూడా దొరకటం వారికి కష్టంగా మారింది. కాయకష్టం చేసుకుందామన్నా పని దొరకని పరిస్థితి ఉంది . ఇక కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం ముందు 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించింది.ఇక నిన్నటితో అది ముగియటంతో వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు . ఈ క్రమంలో ముంబై లోని బాంద్రా రైల్వే స్టేషన్ వద్దకు వలస కార్మికులు వెళ్ళటం వారి తాజా పరిస్థితికి అద్దం పడుతుంది.

వలక కార్మికుల సంక్షోభమే కరోనా కన్నా పెద్ద సంక్షోభం అన్న కమల్

వలక కార్మికుల సంక్షోభమే కరోనా కన్నా పెద్ద సంక్షోభం అన్న కమల్

ఇక తాజాగా నిన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కరోనా వైరస్ నియంత్రించేందకు దేశాన్ని మే 3 వారికి లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయి, సొంతూళ్లకు వెళ్లలేకపోయిన వలస కార్మికుల దుస్థితిపై మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హాసన్ స్పందించారు. ఇది అన్నిటికంటే పెద్ద సంక్షోభం అన్నారు కమల్ హాసన్ . మే 3 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి నిర్ణయం వెలువడగానే పెద్ద ఎత్తున వలసకార్మికులు ముంబయిలోని బాంద్రా స్టేషన్‌ వద్ద గుమిగూడారు. వారిని అక్కడినుంచి పంపించి వేయడానికి పోలీసులు లాఠీఛార్జి చేశారు.

బాల్కనీ ప్రభుత్వాలు కిందికి చూడాలని కోరిన కమల్ హాసన్

బాల్కనీ ప్రభుత్వాలు కిందికి చూడాలని కోరిన కమల్ హాసన్

ఈ ఘటన పై ట్విట్టర్ వేదికగా స్పందించారు కమల్ హాసన్ .''బాల్కనీలో ఉండేవారికి కిందికి చూడటం కష్టమవుతుంది. మొదట ఢిల్లీలో ఈ పరిస్థితి. ఇప్పుడు ముంబయి. వలసకార్మికుల సంక్షోభం అనేది ఒక టైమ్ బాంబ్‌ లాంటిది. అది కరోనా కంటే పెద్ద సంక్షోభం కాకముందే తగ్గించాలి. బాల్కనీ ప్రభుత్వాలు కింద కూడా ఏం జరుగుతుందో చూడాలి'' అని కమల్ చేసిన ట్వీట్ ఆలోచింపజేసేలా ఉంది . ఇప్పటికే వలస కార్మికులు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటూ ఉదయం ఆరు గంటల నుండే భోజనం కోసం పడరాని పాట్లు పడుతున్నారు . వారి జీవనం దుర్భరంగా మారింది . ఇక వీరి విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకోకుంటే కరోనా కంటే పెద్ద సంక్షోభం రావటం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది .

English summary
Kamal haasan outraged on government about migrant labor problem . he tweeted in twitter about the migrant labor crisis . "All the balcony people take a long and hard look at the ground. First it was Delhi, now Mumbai. The migrant crisis is a time bomb that must be defused before it becomes a crisis bigger than Corona. Balcony government must keep their eyes on what's happening on the ground too" he stated in the tweet .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more