వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒక్కరోజు ఆటకోసం రాలేదు: కమల్‌హాసన్ పార్టీ పేరు మక్కళ్ నీది మయ్యమ్, అర్థం ఇదీ

|
Google Oneindia TeluguNews

Recommended Video

Kamal Hassan Party 'Makkal Needhi Maiam': What Does It Mean?

మధురై: నటుడు కమల్ హాసన్ తన కొత్త పార్టీని బుధవారం సాయంత్రం మధురై వేదికగా ప్రకటించారు. పార్టీ పేరు మక్కళ్ నీది మయ్యం. దీని అర్థం జస్టిస్ ఫర్ పీపుల్. అంటే ప్రజలకు న్యాయం. పార్టీ జెండాను ఆవిష్కరించారు.

పార్టీ పేరు ఆవిర్భావానికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తదితరులు హాజరయ్యారు. భారీగా అభిమానులు వచ్చారు. ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడారు. తాను జనంలో నుంచి వచ్చిన వాడిని అని, తలైవాను కాదన్నారు.

ఒక్క రోజు కోసం రాజకీయాల్లోకి రాలేదు

ఒక్క రోజు కోసం రాజకీయాల్లోకి రాలేదు

తాను నాయకుడిని కాదని, మీలో ఒకడిని అని కమల్ హాసన్ అన్నారు. ప్రజలకు సలహాలు చెప్పే నాయకుడిని కాదని, ప్రజల నుంచి సలహాలు తీసుకునే వాడిని అని చెప్పారు. ఈ ఒక్క రోజుతోనే కార్యక్రమం ఆగిపోదన్నారు. ఒక్క రోజు కోసం రాజకీయాల్లోకి రాలేదని చెప్పారు.

ఒక్క రోజు ఆట కోసం కాదు, ఆయుధం లాంటి వాడిని

ఒక్క రోజు ఆట కోసం కాదు, ఆయుధం లాంటి వాడిని

తాను నాయకుడిని కాదని, మీ చేతిలో ఉపకరణాన్ని అని కమల్ హాసన్ చెప్పారు. మీకు సేవ చేసేలా నాకు దిశా నిర్దేశనం చేయాలని ప్రజలను కోరారు. ఒక్క రోజు ఆట కోసం నేను రాజకీయాల్లోకి రాలేదన్నారు. నేను ఆయుధంలాంటి వాడిని అని, పార్టీ నేతను కాదన్నారు.

దీర్ఘకాలిక లక్ష్యం

దీర్ఘకాలిక లక్ష్యం

రాజకీయాల్లో తనకు దీర్ఘకాలిక లక్ష్యం ఉందని కమల్ హాసన్ చెప్పారు. మధురై ఒత్తకడై మైదానంలో విలక్షణ నటుడు పార్టీ పేరును ప్రకటించిన సమయంలో అభిమానులు కేరింతలు కొట్టారు.

జెండాలో చేయి చేయి కలిపినట్లు

జెండాలో చేయి చేయి కలిపినట్లు

కమల్ హాసన్ పార్టీ ఆవిష్కరణ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. తెలుపు రంగు జెండాలో ఎరుపు, తెలుపు రంగులు కలిసిన జెండాను ఆవిష్కరించారు. ఒక చేతి మణికట్టుని మరో చేయి పట్టుకుని ఉన్న ఆరు చేతులు, అందులో మూడు ఎరుపు రంగులో, మరో మూడు తెలుపు రంగులో ఉన్నాయి. వాటి మధ్యలో తెల్లని నక్షత్రం ఉంది.

English summary
Big day in Tamil Nadu politics. Actor Kamal Haasan will launch his political party on Wednesday and has reached Ramanathapuram. Earlier, he visited late president APJ Abdul Kalam's home in Rameswaram and sought blessings from Abdul Kalam's brother.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X