చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గర్వంగా ఉంది: మోడీ ఎంపికపై కమల్ హాసన్

By Pratap
|
Google Oneindia TeluguNews

చెన్నై: స్వచ్ఛ భారత్ కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఎంపిక చేసిన తొమ్మిది మందిలో తాను ఒకడిని కావడం గర్వంగా ఉందని ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ అన్నారు. తొమ్మిది జాబితాలో తన పేరు ఉన్నందుకు ప్రధానికి మోడీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. స్వచ్ఛ భారత్ కోసం మోడీ విసిరిన సవాల్ ప్రతిష్టాత్మకమైన ఆహ్వానమని ఆయన అన్నారు.

తన పేరును ఆ జాబితాలో చేర్చడం మోడీ ఔదార్యానికి నిదర్సనమని ఆయన అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన న్యూఢిల్లీలో స్వచ్ఛ భారత్‌ను ప్రధాని మోడీ ప్రారంభించిన విషయం తెలిసిందే. వచ్చే ఐదేళ్లలో భారత దేశాన్ని క్లీన్ ఇండియాగా మార్చాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రాభించారు.

kamal haasan positively responds to Modi's invitation

తన అభిమానులు గత ఇరవై ఏళ్లుగా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు ఆయన తెలిపారు. తన అబిమానుల క్లబ్‌లను సామాజిక సంక్షేమ కేంద్రాలుగా మార్చినట్లు తెలిపారు. తాను ఇప్పటికే చేస్తున్న సేవా కార్యక్రమాలకు మోడీ ఆహ్వానం గుర్తింపు అని ఆయన అన్నారు

జాతి నిర్మాణంగా దీన్ని తాను పరిగణించి సాధ్యమైతే 9 మంది మిలియన్ల మందిని ఇందులో భాగస్వాములను చేస్తానని శుక్రవారం అన్నారు.

English summary
Thanking Prime Minister Narendra Modi for inviting him to take part in the 'Swachh Bharat' initiative, cine star Kamal Haasan said on Friday that he has converted his fan clubs into social welfare outfits, and has been cleaning up with fans for the last twenty years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X