వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.30 కోట్లు ఇచ్చేస్తా, అది నేరం: ఫ్యాన్స్‌కు కమల్‌, హిందూ ఉగ్రవాదంపై కొత్త వాదన

ఇటీవలే రాజకీయ పార్టీ ప్రకటన చేసిన ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఆసక్తికర ప్రకటన చేశారు. పార్టీ పెట్టడానికి తనకు అభిమానుల ద్వారా వచ్చిన మొత్తాన్ని తిరిగి వారికి ఇస్తానని ప్రకటించారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: ఇటీవలే రాజకీయ పార్టీ ప్రకటన చేసిన ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఆసక్తికర ప్రకటన చేశారు. పార్టీ పెట్టడానికి తనకు అభిమానుల ద్వారా వచ్చిన మొత్తాన్ని తిరిగి వారికి ఇస్తానని ప్రకటించారు.

పార్టీ ఫ్యాన్స్ నుంచి రూ.30 కోట్లు

పార్టీ ఫ్యాన్స్ నుంచి రూ.30 కోట్లు

పార్టీ పెట్టడానికి తన అభిమానులు రూ.30 కోట్ల విరాళాలు సేకరించినట్లు కమల్ హాసన్ ఇటీవల వెల్లడించారు. కానీ తన కోసం అభిమానులు సేకరించిన డబ్బును తిరిగి వెనక్కి ఇస్తానని ఆయన చెబుతున్నారు.

అది నేరం అవుతుంది

అది నేరం అవుతుంది

ఆయన ఓ తమిళ మేగజైన్‌లో కథనం రాశారు. తన పార్టీకి వచ్చిన విరాళాల గురించి అందులో పేర్కొన్నారు. పార్టీ పరంగా ఎలాంటి మౌళికా సదుపాయాలు లేకుండా అభిమానులు సేకరించిన విరాళాలను దాచుకుంటే అది నేరం అవుతుందన్నారు.

పార్టీకి ఇంకా పేరు పెట్టలేదు

పార్టీకి ఇంకా పేరు పెట్టలేదు

తన పార్టీకి ఇంకా పేరు కూడా పెట్టలేదని కమల్ హాసన్ చెప్పారు. కాబట్టి తనకు వచ్చిన విరాళాలను తిరిగి ఇచ్చేద్దామనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఇలా చేయడం ద్వారా రాజకీయాల్లో తాను వెనుకడుగు వేస్తున్నట్లుగానో లేక విరాళాలు తీసుకోననో భావించవద్దని చెప్పారు.

హిందూ ఉగ్రవాదం అంశంపై

హిందూ ఉగ్రవాదం అంశంపై

హిందూ ఉగ్రవాదం విషయంలో తాను చేసిన వ్యాఖ్యల గురించి కూడా ప్రస్తావించారు. హిందూ జనాభా ఎక్కువగా ఉందని, కాబట్టి వీరు అన్నలాంటి వారు అని, జనాభా ఎక్కువగా ఉన్నప్పుడు వారికి పెద్ద మనసులు ఉండాలని, ఇతర మతాల వారు తప్పు చేస్తే సరిదిద్దాలి అన్నారు.

English summary
Days after Kamal Haasan sparked a controversy over his “Hindu extremism” column in Tamil newsmagazine Ananda Vikatan, the veteran actor, in his latest article published on Thursday, said "Hindus are in a majority, they should embrace others and correct them if they do wrong."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X