వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రజనీకాంత్ మద్దతు కోరతానన్న కమల్ హాసన్ .. మూడో విడత ప్రచారంతో పాటు మూడో కూటమి యత్నాలు

|
Google Oneindia TeluguNews

సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త పార్టీ ఏర్పాటు ప్రకటనపై వెనక్కి తగ్గినట్టు చేసిన ప్రకటనపై మక్కల్ నీది మయ్యం అధినేత ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ స్పందించారు. రజనీకాంత్ చేసిన ప్రకటన ఆయన అభిమానులు అలాగే తనను కూడా ఎంతో నిరాశకు గురి చేసిందని కమల్ హాసన్ పేర్కొన్నారు.

రాజకీయ నాయకుడిగా మారిన నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ బుధవారం సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి మాట్లాడారు.

ఎన్నికల సమయంలో కమల్ హాసన్ కు షాక్ .. పార్టీకి గుడ్ బై చెప్పిన కీలక నేత బీజేపీలో చేరికఎన్నికల సమయంలో కమల్ హాసన్ కు షాక్ .. పార్టీకి గుడ్ బై చెప్పిన కీలక నేత బీజేపీలో చేరిక

రజినీకాంత్ పార్టీ ప్రకటన చేయకపోవడం పై నిరాశ చెందాను

రజినీకాంత్ పార్టీ ప్రకటన చేయకపోవడం పై నిరాశ చెందాను


తమిళనాడులో జరగబోయే ఎన్నికలకు తన మద్దతు కోరనున్నట్లు చెప్పారు. రజనీకాంత్ అభిమానుల్లాగా తాను కూడా రజినీకాంత్ పార్టీ ప్రకటన చేయకపోవడం పై నిరాశకు గురయ్యానని చెప్పిన కమల్ హాసన్ అన్నిటికంటే రజనీ ఆరోగ్యమే ముఖ్యమని పేర్కొన్నారు. ముఖ్యంగా, ఆరోగ్య సమస్యల కారణంగా ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశించకూడదని రజనీకాంత్ తన నిర్ణయాన్ని మంగళవారం ప్రకటించిన తర్వాత కూడా రాబోయే ఎన్నికలలో కమల్ హాసన్ తన పార్టీకి రజనీకాంత్ మద్దతు కోరతామని స్పష్టం చేశారు .

ఎన్నికల ప్రచారం తర్వాత రజనీని కలుస్తా ... పార్టీకి మద్దతు కోరతా

ఎన్నికల ప్రచారం తర్వాత రజనీని కలుస్తా ... పార్టీకి మద్దతు కోరతా


తన ఎన్నికల ప్రచారం తరువాత రజనీకాంత్ ను మళ్ళీ కలుస్తాను అన్నారు. తన పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరతానని వెల్లడించారు . రజనీకాంత్ రాజకీయ ప్రణాళికల మాదిరిగా కాకుండా, 2018 లో మదురైలో మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎమ్) ను ప్రారంభించి, గత ఏడాది లోక్సభ ఎన్నికలలో 3.7 శాతం ఓట్ల వాటాతో పోరాడిన కమల్ హాసన్ 2018 లో గట్టిగా దెబ్బ తిన్నారు . ఇక ఇప్పుడు రానున్న ఎన్నికల కోసం ప్రచారాన్ని ముమ్మరం చేసిన కమల్ హాసన్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు .

 మూడో విడత ఎన్నికల ప్రచారంలో కమల్ హాసన్ , మూడో కూటమి యత్నాలు

మూడో విడత ఎన్నికల ప్రచారంలో కమల్ హాసన్ , మూడో కూటమి యత్నాలు

ఒకవైపు ఎన్నికల ప్రచారం చేస్తూనే మరోవైపు మూడవ కూటమి దిశగా కమల్ హాసన్ ప్రయత్నాలు సాగిస్తున్నారు. మూడవ కూటమి ఏర్పడితే ముఖ్యమంత్రి అభ్యర్థి తానేనని తమరు చెప్తున్నారు ఇప్పటికే రెండు విడతల ప్రచారం ముగించుకుని కమల్ హాసన్ మూడో విడత ప్రచారాన్ని తిరుచ్చి నుంచి మొదలు పెట్టారు . ఎన్నికల ప్రచారం తరువాత రజనీకాంత్ ను కలుస్తానని, తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరుతానని ప్రకటించిన కమల్, రజినీకాంత్ సహకారంపై భారీగా ఆశలు పెట్టుకున్నారు

English summary
Actor-turned-politician Kamal Haasan on Wednesday reached out to superstar Rajinikanth, and said he will seek his support for the upcoming elections in Tamil Nadu. Notably, on Tuesday, Rajinikanth had announced his decision to not enter electoral politics due to health concerns.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X