వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రభుత్వానికి ఆ దమ్ములేదు, కేబుల్ టీవీ చానల్స్ తో గేమ్స్, చాలెంజ్: హీరో కమల్ హాసన్ !

|
Google Oneindia TeluguNews

Recommended Video

కేబుల్ టీవీ చానల్స్ తో ప్రభుత్వం గేమ్స్, దమ్ముంటే ప్రసారం చెయ్యాలని కమల్ హాసన్ చాలెంజ్ | Oneindia

చెన్నై: ప్రముఖ బహుబాష నటుడు, దర్శక నిర్మాత, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ తమిళనాడు ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విమర్శలు ఎదుర్కొనే సత్తా తమిళనాడు ప్రభుత్వానికి లేదని, ఆ దమ్ము లేకనే కేబుల్ టీవీ చానల్స్ తో గేమ్స్ ఆడుతోందని కమల్ హాసన్ ఆరోపించారు.

కేబుల్ టీవీ

కేబుల్ టీవీ

తమిళనాడు ప్రభుత్వం అరసు కేబుల్ టీవీని నడుపుతున్నది. పేద ప్రజల కోసం అతి తక్కువ ధరకు అనేక చానల్స్ ను ప్రసారం చెయ్యడానికి జయలలిత గతంలో అరసు కేబుల్ టీవీ చానల్ ను ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే.

ప్రభుత్వం వన్ వే !

ప్రభుత్వం వన్ వే !

తమిళనాడు ప్రభుత్వం ఏది చేస్తే అది రైట్ అన్నట్లు వ్యవహరిస్తోందని మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు, హీరో కమల్ హాసన్ ఆరోపించారు. తమిళనాడు ప్రభుత్వం ప్రజలను ఉద్దరిస్తోందని ఉచిత ప్రచారం చేసుకుంటోందని కమల్ హాసన్ విమర్శించారు.

దమ్ముంటే ప్రసారం చెయ్యండి

దమ్ముంటే ప్రసారం చెయ్యండి

తమిళనాడు ప్రభుత్వం అవినీతి గురించి, అసమర్థత గురించి విమర్శించే ప్రతిపక్షాల వార్తలను అరుసు కేబుల్ టీవీలో ప్రసారం కాకుండా అడ్డుకుంటున్నారని కమల్ హాసన్ ఆరోపించారు. మీ చేతని కాని ప్రభుత్వం గురించి ప్రతిపక్షాలు విమర్శించే వార్తలను దమ్ముంటే ప్రసారం చెయ్యాలని కమల్ హాసన్ చాలెంజ్ చేశారు.

తిత్తుకుడి ఉద్యమం

తిత్తుకుడి ఉద్యమం

తిత్తుకుడి జిల్లాలో స్టెరిలైట్ కాఫర్ ప్లాంట్ నుంచి కలుషిత నీరు విడుదలై ప్రజలు అనారోగ్యానికి గురి అవుతున్నారని, పంటలు నాశనం అవుతున్నాయని వేలాది మంది ఉద్యమం చేస్తుంటే అరసు కేబుల్ టీవీ చానల్స్ లో ఎందుకు ప్రసారం చెయ్యడం లేదని తమిళనాడు ప్రభుత్వాన్ని కమల్ హాసన్ నిలదీశారు.

 ప్రతిపక్షాల మద్దతు ఇచ్చారని !

ప్రతిపక్షాల మద్దతు ఇచ్చారని !

తిత్తుకుడి జిల్లాలో స్టెరిలైట్ కాఫర్ ప్లాంట్ ను మూసివేయాలని ఆందోళన చేస్తున్న స్థానికులకు మక్కల్ నీది మయ్యమ్ వ్యవస్థాపకుడు కమల్ హాసన్, ఎండీఎంకే అధ్యక్షుడు వైగోతో సహ కొన్ని ప్రతిపక్షాల నాయకులు సంపూర్ణ మద్దతు తెలిపారు.

ప్రభుత్వం పరువు పోతుంది !

ప్రభుత్వం పరువు పోతుంది !

ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు స్థానిక ప్రజలకు మద్దతు ఇచ్చి ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం పరువు పోతుందని సీఎం ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఆ వార్తలను అరుసు కేబుల్ టీవీ చానల్స్ లో ప్రసారం కాకుండా అడుకుంటున్నారని కమల్ హాసన్ ఆరోపించారు.

తిరుచ్చిలో చూపిస్తా !

తిరుచ్చిలో చూపిస్తా !

ఏప్రిల్ 3వ తేదీన చెన్నై నుంచి కమల్ హాసన్ రైలు యాత్ర చేస్తున్నారు. ఏప్రిల్ 4వ తేదిన తిరుచ్చిలో మక్కల్ నీది మయ్యమ్ పార్టీ బహిరంగ సభ సమావేశంలో కమల్ హాసన్ ప్రసంగించనున్నారు. ఏప్రిల్ 4వ తేదీ తిరుచ్చిలో తమిళనాడు ప్రభుత్వ తీరును ఎండగడుతానని హీరో కమల్ హాసన్ హెచ్చరించారు.

English summary
Makkal Needhi Maiam founder-president Kamal Haasan has said a government which is not honest enough and does not have guts to face criticism will not remain not just in history.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X