వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐటీ రైడ్స్ ఎఫెక్ట్ : మధ్యప్రదేశ్‌లో మల్టీక్రోర్ స్కాంపై ఎఫ్ఐఆర్ నమోదు

|
Google Oneindia TeluguNews

భోపాల్ : మధ్యప్రదేశ్‌లో కలకలం రేపిన మల్టీ క్రోర్ ఈ టెండరింగ్ స్కాంలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. శివరాజ్ సింగ్ హయాంలో జరిగిన కుంభకోణంపై కమల్‌నాథ్ సర్కార్ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వంలోని నాలుగు ప్రభుత్వ విభాగాలు, ఏడు మౌలిక వసతుల సదుపాయాల కల్పన కంపెనీలు, నాలుగు ఐటీ కంపెనీలపై కేసు నమోదుచేసినట్టు ఎకనామిక్ ఎఫెన్స్ వింగ్ తెలిపింది.

 Kamal Nath govt files FIR in Shivraj-era multi-crore scam

ఐటీ రైడ్స్ తర్వాతే ..
వివిధ సంస్థలు, అధికారులతోపాటు కొందరు రాజకీయ నేతల పేర్లను కూడా ఎఫ్ఐఆర్‌లో చేర్చినట్టు వెల్లడించింది. శివరాజ్ సింగ్ హయాంలో కొందరు బ్యూరోక్రాట్లు, నేతల ప్రమేయంతో మల్టీ క్రోర్ స్కాం జరిగినట్టు ప్రభుత్వం గుర్తించింది. ఇటీవల మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు జరుపడంతో ... ఈ స్కాంను మధ్యప్రదేశ్ సర్కార్ తెరపైకి తీసుకొచ్చింది. ఈ కేసు విచారణ క్రమంలో లభించిన ఆదారాలతో ఎఫ్ఐర్ నమోదు చేసినట్టు ఈవోడబ్ల్యూ తెలిపింది. దీనికి సంబంధించి సాంకేతిక కారణాలను కంప్యూరట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం నిర్ధారించిందని వెల్లడించింది.

రూ.3 వేల కోట్ల స్కాం
ఎంపీ జల్ నిగమ్ మూడు టెండర్లు, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ పేరుతో మూడు టెండర్లు, వాటర్ రిసోర్స్ డిపార్ట్ మెంట్ రెండు టెండర్లు, ఎంపీ రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఒక టెండర్ మొత్తం 9 టెండర్ల రూ.3 వేల కోట్ల విలువగల కుంభకోణం జరిగిందని, దీంతో సదరు కాంట్రాక్టర్లు లబ్ధి పొందారని ఈవోడబ్ల్యూ తెలిపింది. దీంతోపాటు జీవీపీఆర్ ప్రైవేట్ ఇన్'ఫ్రాస్ట్రక్చర్ సంస్థ, మాక్స్ మాంటెన్నా, ద హ్యుమ్, పైప్ లిమిటెడ్, జేఎంసీ లిమిటెడ్, సోర్తియా బెల్జి లిమిటెడ్, మాధవ్ ఇన్ ఫ్రా ప్రాజెక్టు లిమిటెడ్, మిస్ రామ్ కుమార్ నార్వాని లిమిటెడ్ కంపెనీ పేర్లను కూడా చేర్చింది. సదరు కంపెనీలు, అధినేతలపై ఐపీసీ 420, 468, 471, 120 బీ సెక్షన్ల కింద కేసు నమోదుచేసినట్టు వెల్లడించింది.

English summary
The Economic Offences Wing (EOW) of the state government on Wednesday registered a case against concerned officers and employees of four departments of the state government, seven infrastructure companies and four Information Technology (IT) companies in connection with the multi-crore e-tendering scam. The FIR mentions certain unknown politicians. The e-tendering scam took place during the previous BJP government and names of certain bureaucrats, considered close to the previous dispensation had come up in connection with it. The action comes two days after the Income Tax department searched the premises of family members and aides of CM Kamal Nath.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X