వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్టీ అధ్యక్ష పదవికి సీఎం కమల్‌నాథ్ రాజీనామా...? ఓటమీకి నైతిక బాధ్యత వహిస్తా....

|
Google Oneindia TeluguNews

గత సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాద్యత వహిస్తూ ఏకంగా పార్టీ అధ్యక్షుడుగా ఉన్న రాహుల్ గాంధీ రాజీనామ చేయడంతో అందరు అదే బాటపడుతున్నారు..ఇన్నాళ్లు పార్టీ ఓటమికి బాధ్యత వహించే నాయకుడే పార్టీని అంటిపెట్టుకునే ఉండే సంస్కృతికి రాహుల్ గాంధీ చరమ గీతం పాడుతుండడంతో దేశంలో ఉన్న పార్టీ అధ్యక్షులపై కూడ ఆ ప్రభావం పడుతుంది. ఈనేపథ్యంలోనే పార్టీ సీనియర్ నేతలు, ముఖ్యమంత్రులు సైతం రాజీనామ బాట పడుతున్నారు.

నాయకత్వ లేమితో సంక్షోభంలో పడిన కాంగ్రెస్ పార్టీ

నాయకత్వ లేమితో సంక్షోభంలో పడిన కాంగ్రెస్ పార్టీ

సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత దేశ కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం మొదలైంది..వందల సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీకి నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తుంది..సరైన నాయకత్వం లేకపోవడంబతోపాటు పాతకాలపు నాయకత్వమే ఇంకా పార్టీలో తమ పెత్తనాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో రెండు సార్వత్రిక ఎన్నికల్లో సైతం ఘోర పరాజయం పాలైంది..దీంతో పార్టీకి నాయకత్వం సమర్థవంతమైన నాయకుడు లేకపోవడంతో చరిత్ర కల్గిన పార్టీ నాయకత్వ సంక్షోభంలో పడింది..దీంతో పార్టీలోకి కొత్త నాయకత్వం రావాలలనే ఆకాంక్షను పలువురు వ్యక్తం చేస్తున్నారు..

ముందుగా రాజీనామ అడుగువేసిన రాహుల్ గాంధీ

ముందుగా రాజీనామ అడుగువేసిన రాహుల్ గాంధీ

ముఖ్యంగా ఈ పరిస్థితిని ప్రక్షాళన చేసేందుకు పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పునుకున్నాడు...దీంతో ముందుగా పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ సీడబ్ల్యూసీ సమావేశంలోనే నిర్ణయం తీసుకుని రాజీనామను సమర్పించారు.. ఈనేపథ్యంలోనే ఎన్నికలు ఫలితాలు ముగిసిన రెండు నెలల తర్వాత పార్టీ నేతల్లో కదలిక వస్తుంది. మరోవైపు పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ నేతలు ఎవరకు కూడ రాజీనామ ప్రకటించకపోవడంపై కూడ రాహాుల్ గాంధీ ప్రస్తావించారు..రాష్ట్ర్ర నేతలు కూడ రాహుల్ గాందీ బాట పడుతున్నారు.

పార్టీ అధ్యక్షుడిగా కమల్‌నాథ్ రాజీనామా

పార్టీ అధ్యక్షుడిగా కమల్‌నాథ్ రాజీనామా

తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్ర్ర కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న ముఖ్యమంత్రి కమల్ నాథ్ పార్టీ ఓటమికి తాను బాధ్యత వహిస్తానంటూ ప్రకటించారు..ఇందులో భాగంగానే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తానని చెప్పారు..స్వచ్ఛంధంగా పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ స్వచ్ఛంధంగా తప్పుకుంటానని కమల్ నాథ్ ప్రకటించారు. కాగా తాను గతంలోనే రాజీనా చేస్తానని చెప్పానని తెలిపారు.కాగా పార్టీ ఓటమికి తానే తనదే బాధ్యత అంటూ ప్రకటించారు.

29 స్థానాలకు ఒక్క స్థానంలో విజయం

29 స్థానాలకు ఒక్క స్థానంలో విజయం

కాగా గత పార్లెమంట్ ఎన్నికల్లో మొత్తం 29 లోక్‌సభ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక్క స్థానాన్ని మాత్రమే కైవసం చేసుకుంది. ఇక అప్పుడే పార్టీకి రాజీనామ చేస్తానని కమల్ నాథ్ ప్రకటించారని పార్టీ నేతలు ప్రకటించారు. తనతో పాటు ఇంకా ఎవరు పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తారో తనకు తెలియదని ఆయన రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. కగా కమల్ నాథ్ ఏప్రిల్ 2018న పార్టీ చీఫ్ గా పదవి బాధ్యతలు చేపట్టారు. అనంతరం గత డిశంబర్‌లో ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టారు.

English summary
Madhya Pradesh Chief Minister Kamal Nath has said he had offered to resign from the post of state Congress president after the party's bad performance in the Lok Sabha election. His remarks came amid reports that Congress chief Rahul Gandhi expressed disappointment that none of the leaders holding top posts took responsibility for the party's poor show.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X