వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘ఐటమ్’ ఎఫెక్ట్:కమల్‌నాథ్ ‘స్టార్’హోదా రద్దు -ఎంపీ బైపోల్స్ వేళ ఈసీ షాక్ -28సీట్లకు 3న ఓటింగ్

|
Google Oneindia TeluguNews

మధ్యప్రదేశ్ లో మళ్లీ ప్రభుత్వం చేతులు మారే అవకాశాలున్న ఉప ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి స్వల్ప షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కు 'స్టార్ క్యాంపెయినర్' హోదాను ఎన్నికల సంఘం రద్దు చేసింది. ఎన్నికల కోడ్‌ను కమల్‌నాథ్ పదేపదే ఉల్లంఘించినందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.

ట్యూషన్ ఫీజు 30 శాతం తగ్గింపు -జగన్ సర్కారు కీలక ఉత్తర్వులు -విద్యార్థులకు ఊరటట్యూషన్ ఫీజు 30 శాతం తగ్గింపు -జగన్ సర్కారు కీలక ఉత్తర్వులు -విద్యార్థులకు ఊరట

బొటాబొటి మెజార్టీతో 2018లో మధ్యప్రదేశ్ లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీలో జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబావుటా ఎగరేయడంతో గతేడాది కమల్ నాథ్ సర్కారు కూలిపోయిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంలో మొత్తం 28 మంది ఎమ్మెల్యేలు అనర్హతకు గురికావడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. మళ్లీ అన్ని సీట్లను గెలుచుకోగలిగితే కాంగ్రెస్ తిరిగి అధికారాన్ని దక్కించుకునే అవకాశముంది. కానీ కమల్ నాథ్ అనుచిత వ్యాఖ్యలు ఆ పార్టీకి డ్యామేజ్ చేశాయిలా..

Kamal Nath No Longer Star Campaigner: Election Body Says Rules Violated

కాంగ్రెస్‌ నుంచి ఇటీవల బీజేపీలో చేరి, గ్వాలియర్ లోని డాబ్రా నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న ఇమర్తీ దేవీ అనే మహిళా నేతను ఉద్దేశించి.. కమల్ నాథ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ అభ్యర్థి సాధారణమైన వారని, ఇమర్తీ దేవిలా'ఐటెం' కాదని కమల్ నోరు పారేసుకున్నారు. ఈ వ్యవహారంపై అన్ని రాజకీయపార్టీలూ స్పందించాయి. కమల్ కామెంట్లను కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సైతం తప్పు పట్టారు.

ఇద్దరూ ఇద్దరే: మెలానియా సంచలనం -మీడియా, టెక్ దిగ్గజాలపై తీవ్ర విమర్శలు - భర్తకు వత్తాసుఇద్దరూ ఇద్దరే: మెలానియా సంచలనం -మీడియా, టెక్ దిగ్గజాలపై తీవ్ర విమర్శలు - భర్తకు వత్తాసు

కమల్ నాథ్ పై చర్యలు తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ఎన్నికల సంఘం చర్యలకు దిగింది. 'స్టార్ క్యాంపెయినర్' హోదా కోల్పోవడంతో ఇక నుంచి కమల్‌నాథ్ చేయబోయే ఎన్నికల ప్రచారానికి ఖర్చంతా.. సదరు అభ్యర్థి భరించాల్సి ఉంటుందని ఈసీ స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్ లోని 28 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 3న ఉప ఎన్నికలు జరగనున్నాయి.

English summary
Kamal Nath is no longer a "star campaigner" for the Madhya Pradesh by-polls next week, the Election Commission ordered today after a series of controversial remarks by the Congress leader. The powerful election body said the 73-year-old leader's star campaigner status was being revoked for "repeated violation of model code of conduct" and for "complete disregard" of warnings to him. Kamal Nath, being a leader of a political party, had repeatedly "breached ethical and dignified behaviour", the commission said in its order.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X