వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రంలో రుణమాఫీ చేయలేదా ? నిజాన్ని అంగీకరించాలని శివరాజ్‌కు కమల్‌నాథ్ లేఖ

|
Google Oneindia TeluguNews

భోపాల్ : మధ్యప్రదేశ్ రాజకీయాలు మంచి రాంజుమీదున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు మద్దతు లేదని బీజేపీ ఆరోపణలతో మొదలైన ప్రకంపనలు కాంగ్రెస్ కౌంటర్ అటాక్ వరకు వెళ్లాయి. అయితే తాజాగా సీఎం కమల్‌నాథ్, బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్‌కు లేఖ రాశారు. రైతుల రుణమాఫీ చేయని బీజేపీ .. అధికారం కోసం మాత్రం పాకులాడుతుందని విమర్శించారు.

21 లక్షల రైతుల రుణమాఫీ ..
గత బీజేపీ సర్కార్ రైతులను పట్టించుకోలేదని కమల్‌నాథ్ లేఖ ప్రారంభించారు. ఏ వర్గానికి సముచిత న్యాయం చేయలేదని విమర్శించారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల సంక్షేమం కోసం పాటుపడ్డామని వివరించారు. దాదాపు 21 లక్షల మంది రైతుల రుణాలను మాఫీ చేశామని పేర్కొన్నారు. దేశంలో ఇప్పుడు ఎన్నికలు ముగిశాయి .. ఫలితాలే తరువాయి అని .. ఈ సమయంలో మీరు మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి సపోర్ట్ చేయండి అని కోరారు. మీరు మద్దతిస్తే రైతుల రుణమాఫీ ప్రక్రియ యధావిథిగా కొనసాగుతుందని గుర్తుచేశారు. ఇప్పటికైనా తమ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసిందనే నిజాన్ని అంగీకరించండి అని పేర్కొన్నారు.

Kamal Nath writes to Shivraj: Elections over, accept truth about loan waiver

ఇన్నాళ్లు మిన్నకుండిపోయారు ?
ఎంపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో చాలా చేసిందని .. కానీ బీజేపీ సంక్షేమాన్ని మరచిపోయిందని విమర్శించారు. ఎన్నికల ఫలితాల ఒకరోజు ముందు కమల్‌నాథ్ ... శివరాజ్ సింగ్‌కు లేఖరాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం మధ్యప్రదేశ్‌లో బీజేపీ 26 నుంచి 28 సీట్లు గెలవనుంది. అధికార కాంగ్రెస్ పార్టీ 1 నుంచి 3 సీట్లకు పరిమితమవనుంది. ఈ అంచనాలతో బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా కౌంటర్ ఇస్తూ తమ ఉనికిని చాటుకోవాలనుకునే ప్రయత్నం చేసింది. అయితే అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్ సీట్లకు పరిమితం అవుతుందనే అంచనాలు ఆ పార్టీని జీర్ణించుకోలేకపోతుంది.

English summary
madhya Pradesh Chief Minister Kamal Nath has written a letter to former CM Shivraj Singh Chouhan and took a sharp jibe at his predecessor saying the Congress government had successfully waived loans of 21 lakh farmers, the BJP had been denying the feat to attack the party. He also said that now that the elections are over, he hopes BJP will extend its support to the Congress in continuing to help the farmers with the loan waiver scheme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X