వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శశికళ ఎఫెక్ట్!: రాజకీయ కక్ష.. కమల్ హాసన్ ఆగ్రహం

తన అభిమానులను అరెస్టు చేయడంపై ప్రముఖ నటుడు కమల్ హాసన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత నెల మెరీనా బీచ్‌లో నిర్వహించిన జల్లికట్టు ఆందోళనకు సంబంధం ఉందని సుధాగర్ అనే వ్యక్తిని, కమల్ హాసన్‌ రసిగరల్‌

|
Google Oneindia TeluguNews

చెన్నై: తన అభిమానులను అరెస్టు చేయడంపై ప్రముఖ నటుడు కమల్ హాసన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత నెల మెరీనా బీచ్‌లో నిర్వహించిన జల్లికట్టు ఆందోళనకు సంబంధం ఉందని సుధాగర్ అనే వ్యక్తిని, కమల్ హాసన్‌ రసిగరల్‌ నర్పని ఇయక్కం సంఘానికి చెందిన కొంతమంది సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు.

'రిసార్టులో ఏంజరిగిందో ఆధారాలు': శశికళకు షాక్, పళని ప్రభుత్వం నిలబడేనా?'రిసార్టులో ఏంజరిగిందో ఆధారాలు': శశికళకు షాక్, పళని ప్రభుత్వం నిలబడేనా?

ఈ విషయం తెలిసిన కమల్‌ హాసన్ బుధవారం సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఇక నేను ట్వీట్లు తగ్గించి, మౌనంగా ఉండాలనుకుంటున్నానని, ప్రజల న్యాయం దేశాన్ని కాపాడుతుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.

kamal hassan

నిన్న సుధాగర్‌ని, ఇయక్కం ఆర్గనైజేషన్‌కు చెందిన కొంతమందిని జల్లికట్టు ఆందోళనకారులుగా పోలీసులు అరెస్టు చేశారని, దీనివల్ల తమ ప్రతిష్ఠ పెరుగుతుందని, తమ పైన రాజకీయ కక్ష తీర్చుకుంటున్నారన్న విషయం బయటపడుతుందన్నారు.

ఇప్పుడు మా ఇయక్కం సభ్యులు ఇంకా సహనం, హుందాతనంతో ఉండాలని కూడా కమల్ హాసన్ పేర్కొన్నారు.

పళనిస్వామి బలనిరూపణ: స్టాలిన్ దీక్ష, రాష్ట్రపతికి 'అసెంబ్లీ' నివేదికపళనిస్వామి బలనిరూపణ: స్టాలిన్ దీక్ష, రాష్ట్రపతికి 'అసెంబ్లీ' నివేదిక

మీ అభిప్రాయాలు వినిపించడాన్ని కొనసాగించండని, కానీ ఎక్కడా హద్దులు దాటకుండా చూసుకోవాలని, మన సిద్ధాంతాలను వదులుకోవాల్సిన పని లేదని, ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరచినా ప్రజల సంక్షేమం కోసం పోరాడటమే మన పని అని, ప్రతిఫలం లేని ఈ బాధ్యతనూ ఎప్పటికీ కొనసాగిస్తామని, పాలకులు వస్తారు.. పోతారు కానీ దేశం శాశ్వతంగా ఉంటుందని కమల్ పేర్కొన్నారు.

కాగా, శశికళను, ఆ తర్వాత ఆమె సూచించిన పళని స్వామి అభ్యర్థిత్వాన్ని, అదే విధంగా శనివారం నాడు జరిగిన ముఖ్యమంత్రి పళనిస్వామి బలపరీక్ష పైన కమల్ హాసన్ స్పందించారు. ఆయన వ్యాఖ్యలు శశికళకు వ్యతిరేకంగా ఉన్నాయి.

English summary
Actor Kamal Haasan has been very actively reacting to the recent political developments in Tamil Nadu for the past few weeks. He has been receiving bouquets from people and brickbats from ruling party politicians and their supporters for the same.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X